పేజీలు

7 ఏప్రిల్, 2009

సూక్షశరీర ప్రయాణం

సూక్షశరీర యానం
సూక్షశరీరం అంటే శరీరం ఏమిటి ?
మన భౌతిక శరీరం ఎలా ఉంటుందో దాన్ని ఆవరించుకునే ఒక తొడుగులా సూక్షశరీరం ఉంటుంది.ఇది యోగుల ధృష్టికే తప్ప మాములు కంటికి కనపడదు.జీవికి భౌతిక శరీరం చనిపోయిన సూక్షశరీరం నిలిచేఉండి ఆ సూక్షశరీరంతోనే మరో జన్మ తీసుకుంటుంది.సూక్ష్మ శరీరం ఉన్నంత కాలం కూడ జీవిత జననమరణ చ్రకం తప్పదు.సూక్షశరీరం కారణ శరీరాన్ని ఆదారం చేసుకుంటుంది.ఆధునిక మనిషి కంటికి కనపడని ఏ విషయాన్ని నమ్మని పరిస్థితుల్లో భౌతిక శరీరాన్ని విడిచి పెట్టి సూక్షశరీరం ద్వార ఎక్కడెక్కడో తిరిగిరావచ్చు అంటే నమ్మడం చాల కష్టం.
సరైన హేతువాదం అంటే దేన్ని నమ్మకపోవడం కాదు.ఒక విషయం నిరూపణకు సిద్దంగా ఉన్నప్పుడు కూడా దాన్ని పరిశోధించిక ఊరికే కొట్టిపడేయడం సరైన హేతువాదం అనిపించుకోదు. ప్రతి ఒక్కరు సాధన ద్వార తమ తమ భౌతిక శరీరాలను వదిలిపెట్టి సూక్ష శరీర యానం చేయవచ్చు అనేది వాస్తవం.
మీలో నిజమైన పట్టుదల ఉంటే మీరే స్వయంగా పరిక్షించుకుని చూడండి.కాని సాధనకు ముందే ఒకే విషయం గుర్తుంచుకోండి.ఒక బ్రిడ్జ్ కట్టడానికి ఇంజనీర్ కోర్సు,ఒక రోగి శరీరాన్ని కొసి పరిక్షించడానికి మెడిసిన్ కోర్సు ఎలాగైతే ఓ నాలుగేళ్ళు చదివి,సాధనచేసి మాత్రమే అందులో ఉత్తీర్ణులవుతున్నారో ,అలాగే ఈ సూక్ష్మ శరీర ప్రయాణానికి తగిన కాల వ్యవది సాధన కోసం వెచ్చించాల్సి వస్తుంది.ఎంతకాలం అనేది మీ యోగ్యత,నమ్మకం,సాధన మీద ఆధారపడి ఉంటుంది.
సాధన : ముందుగా అసలు సూక్షశరీర యానం అనగానే మీకో ఆలోచన వచ్చి ఉంటుంది. మీ ఆలోచన ప్రవాహం మీకో నమ్మకాన్ని ఏర్పరిచి మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళుతుంది.మీకా నమ్మకం లేకుంటే ఇక్కడి వరకు చదువుకుంటూ వచ్చేవారే కాదు. కాబట్టి అసలు ఆలోచన గురించి ఆలోచించండి. ఆలోచనను ఎక్కడ ఉండాలని మీరు కోరుకుంటారో ,అది అక్కడే ఉంటుంది.
మీ ఆలోచనను సూక్షశరీరయానం మీద పెట్టండి.
ఇక సాధన మొదలు పెట్టండి.ముందు ఎవరు ఎలాంటి విఘ్నాలు కల్గించని ఏకాంత ప్రదేశం చూసుకుని ఒంటరిగా బెడ్ రూమ్ లో పడుకోండి.మీరు సూక్షశరీర యానం చేయగలరు అని సంపూర్ణంగా ముందుగా నమ్మకం ఏర్పరుచుకోండి.ఎంతో అద్భుతమైన సూక్షశరీరయానానికి మీరు సిద్దపడుతున్నందుకు టెన్షన్ పడకుండా పూర్తి విశ్రాంతిగా మంచం మీద పడుకుని కళ్ళుమూసుకుని సేదతీరండి.మీ ఆలోచననను ఇక ఒక విషయం మీద పూర్తిగా కేంద్రీకరించండి.మీ భౌతిక శరీరం నుండి సూక్ష్మంగా ఉన్న మరో శరీరం విడిపడుతున్నట్ల పూర్తి ద్యాసను అక్కడే ఉంచి ఆలోచించండి.మీకు ఆ ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఏది మీ మనసులో రాకూడదు.మీ ధ్యాసను అక్కడే ఉంచి మీరు నెమ్మదిగా సూక్షశరీరం ద్వార బయటపడుతున్నట్లు ఆలోచిస్తూనే ఉండండి.అసలు ఇలా సూక్షశరీరయానం సాధ్యమేనా కాదా,ఇది ఊరికే టైమ్ వేస్ట్ ప్రయోగం అని,రోజులో జరిగిన మరేవో ఆలోచనలు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తుంటాయి. పట్టువదలని విక్రమార్కునిలా మాటిమాటికి మీ ఆలోచనలు పక్కదారిలో వెళ్ళిన మీ అసలు లక్ష్యంపైనే కేంద్రీకరించండి. నిముషాలు గడుస్తూనే ఉంటాయి.మీలో నుండి ఎలాంటి సూక్షశరీరం బయట పడడంలేదని అప్పుడే నిరాశ పుట్టిందా? మీ సాధనలో కెల్లా అతిముఖ్యమైన అవరోధం ఇదే..ఓ కరాటే,కుంగ్ ఫూ,బాక్సింగ్ లాంటి సాధనలు చేస్తుండగా మీరెప్పుడైనా చూసారా.శరీరం హూనం అవుతుంటుంది.ఒంట్లో చమట దారలై కారిపోతుంటుంది.శరీరంలో నొప్పులు పెచ్చరిల్లుతుంటాయి.ఊపిరితిత్తులు కొలుములై మండుతుంటాయి.బతికుంటే బలుసాకు తినవచ్చు ఈ సాధన ఇంతటితో ఆపేద్దాం అనిపిస్తుంది. అలా ఓ నాలుగేళ్ళు సాధన చేసి శరీరం వజ్రకాయమైతే తప్ప ఓ బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరుకుంటాం.
అలాంటి సాధనతో పోలిస్తే ఈ సూక్షశరీరయాన సాధన ఎంతో సులభం..కావల్సిన మొదటి అర్హత అల్లా విసుగేసి మద్యలోనే వదిలిపెట్టకుండా ఉండడం..ఇది చదివిన వాళ్ళు నూటికి 90 శాతం మంది ఇలా చదివి ఓహో మనిషికి సూక్షశరీరం అనేది కూడా ఒకటుందా...దాంతో భౌతిక శరీరాన్ని వీడి ప్రయాణం కూడా చేయవచ్చా అని అలా చదివి ఇలా ఊరుకుంటారు,తరువాత ఎప్పడో సాధన చేద్దామని(ఆ తరువాత అనేది ఎన్నేళ్ళు గడిచాక కూడా అలాగే ఉండడం వారినే ఆశ్చర్యపరుస్తుంది).మిగిలిన పదిశాతం సాధన మొదలు పెట్టి
దాంట్లో 8 శాతం ఒకటి రెండు రోజుల్లోనే ఆ విషయమే మరిచిపోతుంటారు.మిగిలిన 2 శాతం మాత్రమే సీరియస్ గా సాధనచేస్తారు.వారిలో 1శాతం తొందరలోనే సూక్షశరీర ప్రయాణం చేసే స్థితి ఖచ్చితంగా వస్తుంది.మిగితా 1 శాతంకు కాల పరిపక్వత మీద సిద్దిస్తుంది.
ఇంకో నమ్మలేని నిజం ఏమంటే మీరంతా సూక్షశరీరయానం చేసిన చేయకున్న ప్రతి ఒక్కరు సూక్షశరీర స్పర్శను,అనుభూతిని ఏదో ఒకనాడు పొందినవారే.ఎలాగంటారా? మీరు నిద్రపోతున్నప్పుడు మీకు ఉన్నట్లుండి ఒళ్ళంతా జలదరించినట్లు శరీరం ఉలిక్కిపడడం ఎన్నడో ఒకరోజు అనుభూతి చెందే ఉంటారు.అదే సందేహం లేకుండా సూక్షశరీర అనుభూతే. మీరు నిద్రపొతున్నప్పుడు మీ భౌతిక శరీరం నుండి విడిబడి బయటపడడానికో ,సర్ధకుపోవడానికో సూక్షశరీరం చేసే ప్రయత్నమే ఒళ్ళ జలదరించే అనుభూతి.మరొక వాస్తవం మనం కలలు అని చెప్పుకునేవి సూక్షశరీర ప్రయాణాలే. మీరు చేసే సూక్షశరీర ప్రయాణాలు మొదట్లో నిద్రపోయిన తరువాత జరుగుతాయి.కాని కలకు సూక్షశరీర ప్రయాణానికి మీకు సృష్టమైన తేడా తెలుస్తుంది.మీరు సాధనలో అత్యున్నత స్థితికి చేరినప్పుడు భౌతికి శరీరం సృహలో ఉండగానే మీరు సూక్ష శరీర ప్రయాణం చేయగలుగుతారు.
మీరు సాధన చేస్తున్నప్పడు కూడా ఇలాగే మీ భౌతిక శరీరం నుండి సూక్షశరీరం బయటపడే సమయంలో ఓ కుదుపు ఏర్పడుతుంది.అదే లక్ష్యంగా సాధనపెట్టుకుని సాధన మొదలు పెట్టండి.

మీ సాధన పలించిన రోజున మీకు సూక్షశరీర ప్రయాణం చేసే శక్తి వచ్చింది.ఆ తరువాత ఏం జరుగుతుంది?మీ శరీరం నుండి మీరు బయటపడి తలతిప్పి పక్కకు చూస్తే ఒక్క సారిగి భయపడేంతా పని జరుగుతుంది. మీ భౌతిక శరీరాన్ని అద్దంలో నుండి చూసినట్లుగా కాకుండా మరోకరిగా మిమ్మల్ని మీరే ఓ కళేబరంలా మీరు మొదటి సారిగా చూడడం నిజంగా భయపడే విషయమే.మీ జీవితంలో ఏనాటికి నమ్మలేని విషయాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు,కాబట్టి నమ్మక తప్పదు.కాని భయపడితే మాత్రం మీరు ఎంతో సాధనతోని పొందిన సూక్షశరీరం వెంటనే మీ భౌతిక శరీరంలో దూరిపోతుంది.బయపడకుండా ముందే సిద్దంగా ఉండండి.మీ సాధన స్థిరత్వం పొందిన తరువాత,మీరు ఏ రోజు కావాలంటే ఆరోజు సూక్షశరీరంతో బయటకు వచ్చిన రోజున చిన్నగా బయట విహరించడం మొదలుపెట్టండి.ఆస్ర్టోనాట్లు అంతరిక్షంలోకి వెళ్ళిన తరువాత భారరహిత స్థితిని పొందినట్లు మీ సూక్షశరీరం కూడా భార రహిత స్థితలోనే ఉంటుంది.మీ భౌతిక శరీరాన్ని వదిలి మీరున్న గదిలో అటు ఇటు కదలడం మొదలుపెట్టండి.మీ శరీరం నుండి సూక్షశరీరంగా బయటపడితే మీ భౌతిక శరీరం ఓ మృత శరీరంలా కనపడవచ్చు.కాని అది సజీవమే.మీ భౌతిక శరీరం,సూక్షశరీరం అనుసంధానంగా ఓ సిల్వర్ కార్డ్ నిరంతరం లింక్ గా ఉంటుంది. ఈ సిల్వర్ కార్డ్ అనుసంధానంగా మీరు సూక్షశరీరంతో ఎంత దూరాలైనా వెళ్ళవచ్చును.
మీరు గదిలోనుండి అటు ఇటు భార రహిత స్థితిలో ఎగరండి.మీ గదిలోని వస్తువులని ముట్టకోండి.మీకు విశ్వాసం పెరిగిన రోజున గది నుండి బయట ప్రపంచంలో అడుగుపెట్టండి.బయటి భౌతిక ప్రపంచంలో మాదిరిగానే కనపడుతుంది.మరికొన్ని ఉజ్వల కాంతులు దర్శనమిస్తాయి.ఇంటి చుట్టుపక్కలా ,పక్కవీదీలోకి,పక్క ఊళ్ళోకి వెళ్ళివస్తూ ఉండండి..క్రమంగా మరింత దూర దూరాలకు వెళుగలుగుతారు.
హాలివుడ్ సినిమా ‘హాలోమాన్’లో మాదిరిగా ఎవరికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు.కాని సినిమాలోని ఇన్విసబుల్ మాన్ కు మాదిరి ఆలోచనలు మీకుంటే మీరు సూక్షశరీర యానం ఏనాటికి చేయలేరు.మీ మనసు పసిపాపలా శుద్దమైనప్పుడే మీకా అర్హత పరమాత్మ కలిపిస్తాడు.
మీరు సూక్షశరీరంతో ప్రయాణాలు మొదలుపెట్టినప్పుడు,ఎల్లలెరుగని,రోడ్లు,భవనాల దగ్గరకు,
పాస్ పోర్టు ,వీసా అవసరం లేని అంతర్జాతీయ ప్రయాణాలకు,సముద్రాలు,ఆకాశంమీదకు తిరిగిరావచ్చు.మీ స్నేహితుల్ని,బంధువుల్ని,మీ ప్రియమైన వారిని చూసి రావచ్చు.సూక్షలోకాల్లో ఎక్కడెక్కడో విహారించి రావచ్చు. మీరు ఎక్కడెక్కడికి ఎంతెంత దూరలకు పోయినా మీ సూక్షశరీరాన్ని భౌతిక శరీరంతో అనుసంధానించే సిల్వర్ కార్డ్ వెండితీగలా సాగుతూ వస్తునే ఉంటుంది.వెనుకటి రోజుల్లో ఈ సూక్షశరీర ప్రయాణాలు అందరు చేయగలిగే శక్తితో ఉండేవారు.కాని ఆ శక్తిని దుర్వినియోగం చేయడం వలన ,మనుషుల నుండి ఆ శక్తులు ఉపసంహరించుకోబడ్డాయి...మీరు ఒక సారి సూక్షశరీర ప్రయాణం చేయడం మొదలు పెడితే మీకు అన్ని విషయాలు అవే అర్థం అవుతాయి.
ఇంకా ఆలస్యం ఎందుకు ఒక శుభ ముహూర్తం చూసుకుని , ఈ సాధన మొదలుపెట్టండి.

5 ఏప్రిల్, 2009

సత్యం అంటే?మనస్సు మాయాజాలానికి విరుగుడు సంభవించేదంతా కలగా తలపోయడం

అతిషా భోధన...
జీవితంలో సత్యం అంటే ఏమిటో అన్వేషిస్తున్నారా?సత్యం అనేది ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు,అది ఇక్కడే ,ఇప్పుడే అందుబాటులో ఉంది..సముద్రంలో ఉండే ఒక చేపను సముద్రం ఆవరించుకుని ఉన్నట్లుగానే , సత్యం మన చుట్టు ఆవరించుకుని ఉంది.సముద్రంలో ఉండే చేపకు సముద్రం గురించిన ఎరుక ఎప్పటికి ఉండకపోవచ్చు . సముద్రం గురించి తెలిసిన వెంటనే చేపకు ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది. దేన్ని గురించి తెలుసుకోవాలన్నకూడా ఆ వస్తువుకు , దానిని చూసేవారికి మధ్యన కనీసం కొంత దూరం ఉండాలి.అప్పుడే కనిపించే దానిని గురించిన జ్ఞానం చూసేవారికి కలుగుతుంది. సముద్రంలోనే అంతర్భాగంగా ఉన్న చేపకు అలా సముద్రాన్ని గురించిన ఎరుక ఏనాటికి కలుగకపోవచ్చు.
సత్యం పరిస్థితి ఇదే. సత్యమే దేవుడు. దేవుడి పరిస్థితి కూడా ఇదే.అతను మనకు అతి సమీపంలో,మనల్ని పర్యవేక్షించి ఉన్నాడు.సత్యం,దేవుడు సమీపంలో ఉందనడం కూడా సరికాదు.అది మీరే కనుక.సత్యం,దేవుడు మీరై ఉండి మీలోపల,బయట కూడా పర్యవేక్షించి ఉన్నాడు.
సత్యమే ఉంది అనేది మొదటి సత్యం.

సత్యం,దేవుడ్ని దర్శించకుండా ఉంచే అతి పెద్ద ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.
ఆ మనస్సు మాయలో లీనమైపోయి సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే.
కాబట్టి దేవుడ్ని తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే.

బొధిచిత్తం లేదా బుద్ద చైతన్యం అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ స్థితికోసమే. ఈ స్థితి సాధించడమే
దేవుడ్ని తెలుసుకునే మహాద్వారం.
నాలుగవ సత్యం : సంభవించేవన్ని కలలే అనుకోండి.
సంభవించడం అంటే కనిపించేవన్ని,అనుభవంలోకి వచ్చేవి,ప్రపంచంలోని సర్వస్వం కూడా కలలవంటివే అనుకోండి. మనోస్వప్నాలు మానసికంగా ఉండే రూపాలు, ఆధ్యాత్మిక అనుభవాలు అన్ని కూడా కలలే అనుకోండి.ఎందుకంటే చూడబడేవాడిగా ఉన్నంత కాలం కలలే అని తలపోయండి.నిరంతరం చూసేదంతా కలే అనే చింతనతోని మీరున్నప్పుడు మీకు హఠాత్తుగా ఒక సత్యం అనుభూతమవుతుంది.చూసే దృశ్యమంతా కలే ఐతే చూడబడే వాడు కూడా కలే అవ్వాలి తప్ప నిజం కాదుగదా? అలాగే సాధన చేస్తూ పోండి ....కనపడేదంతా కలే అనే విచారణతో మీరు ఉండగా మీరేదో ఒక రోజు రాత్రి కలకంటున్నప్పుడు ఆ కల కూడ కలేనన్న ఎరుక కల్గుతుంది.
అతి సులువుగా చెప్పాలంటే మీరేరోజైతే కలలో కలగంటూ అది కలే అనే సృహకలగుతుందో మొదటి సారి మీరు జీవితంలోని అతి పెద్ద కలనుండి బయటపడి ప్రజ్ఞావెలుగులోకి వస్తారు.(కల చివర్లో అది కల అని గుర్తుకు వచ్చి మెలుకువ రావడం కాదు.కల గంటున్నంత సమయం కూడా అది కల అనే సృహలో ఉండగలిగే స్థితి) ఆ స్థితి వచ్చిన రోజు ఇకపై చూసేవాడు,చూడబడేవాడుగా మీరుండరు.అదిభావాతీత ప్రజ్ఞా స్థితి.

మీరు కొత్తగా సంపాదించుకున్న ఆ భావాతీత ప్రజ్ఞా స్థితితో ఎరుక స్వభావాన్ని పరిశీలించడి.మీకు ఒక సత్యం అర్థమవుతుంది.అసలు మీరు జన్మించనే లేదని,చావు రానేరాదని.
జనన మరణాలు లేని ఆత్మ చైతన్యం అది. మనస్సు చివరి ప్రయత్నంగా చేసే మాయాజాలంలో పడిపోకుండా మసన్సు సూచించే పరిష్కారాలను సైతం వదిలిపెట్టండి.చివరకు ప్రజ్ఞా స్థితిలో స్థితం కండి.

సత్యం అంటే?మనస్సు చేసే మాయ ..

అతిషా భోధన...
జీవితంలో సత్యం అంటే ఏమిటో అన్వేషిస్తున్నారా?సత్యం అనేది ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు,అది ఇక్కడే ,ఇప్పుడే అందుబాటులో ఉంది..సముద్రంలో ఉండే ఒక చేపను సముద్రం ఆవరించుకుని ఉన్నట్లుగానే , సత్యం మన చుట్టు ఆవరించుకుని ఉంది.సముద్రంలో ఉండే చేపకు సముద్రం గురించిన ఎరుక ఎప్పటికి ఉండకపోవచ్చు . సముద్రం గురించి తెలిసిన వెంటనే చేపకు ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది. దేన్ని గురించి తెలుసుకోవాలన్నకూడా ఆ వస్తువుకు , దానిని చూసేవారికి మధ్యన కనీసం కొంత దూరం ఉండాలి.అప్పుడే కనిపించే దానిని గురించిన జ్ఞానం చూసేవారికి కలుగుతుంది. సముద్రంలోనే అంతర్భాగంగా ఉన్న చేపకు అలా సముద్రాన్ని గురించిన ఎరుక ఏనాటికి కలుగకపోవచ్చు.
సత్యం పరిస్థితి ఇదే. సత్యమే దేవుడు. దేవుడి పరిస్థితి కూడా ఇదే.అతను మనకు అతి సమీపంలో,మనల్ని పర్యవేక్షించి ఉన్నాడు.సత్యం,దేవుడు సమీపంలో ఉందనడం కూడా సరికాదు.అది మీరే కనుక.సత్యం,దేవుడు మీరై ఉండి మీలోపల,బయట కూడా పర్యవేక్షించి ఉన్నాడు.
సత్యమే ఉంది అనేది మొదటి సత్యం.

సత్యం,దేవుడ్ని దర్శించకుండా ఉంచే అతి పెద్ద ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.
ఆ మనస్సు మాయలో లీనమైపోయి సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే.
కాబట్టి దేవుడ్ని తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే.

బొధిచిత్తం లేదా బుద్ద చైతన్యం అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ స్థితికోసమే. ఈ స్థితి సాధించడమే
దేవుడ్ని తెలుసుకునే మహాద్వారం.
నాలుగవ సత్యం : సంభవించేవన్ని కలలే అనుకోండి.
సంభవించడం అంటే కనిపించేవన్ని,అనుభవంలోకి వచ్చేవి,ప్రపంచంలోని సర్వస్వం కూడా కలలవంటివే అనుకోండి. మనోస్వప్నాలు మానసికంగా ఉండే రూపాలు, ఆధ్యాత్మిక అనుభవాలు అన్ని కూడా కలలే అనుకోండి.ఎందుకంటే చూడబడేవాడిగా ఉన్నంత కాలం కలలే అని తలపోయండి.నిరంతరం చూసేదంతా కలే అనే చింతనతోని మీరున్నప్పుడు మీకు హఠాత్తుగా ఒక సత్యం అనుభూతమవుతుంది.చూసే దృశ్యమంతా కలే ఐతే చూడబడే వాడు కూడా కలే అవ్వాలి తప్ప నిజం కాదుగదా? అలాగే సాధన చేస్తూ పోండి ....కనపడేదంతా కలే అనే విచారణతో మీరు ఉండగా మీరేదో ఒక రోజు రాత్రి కలకంటున్నప్పుడు ఆ కల కూడ కలేనన్న ఎరుక కల్గుతుంది.
అతి సులువుగా చెప్పాలంటే మీరేరోజైతే కలలో కలగంటూ అది కలే అనే సృహకలగుతుందో మొదటి సారి మీరు జీవితంలోని అతి పెద్ద కలనుండి బయటపడి ప్రజ్ఞావెలుగులోకి వస్తారు.(కల చివర్లో అది కల అని గుర్తుకు వచ్చి మెలుకువ రావడం కాదు.కల గంటున్నంత సమయం కూడా అది కల అనే సృహలో ఉండగలిగే స్థితి) ఆ స్థితి వచ్చిన రోజు ఇకపై చూసేవాడు,చూడబడేవాడుగా మీరుండరు.అదిభావాతీత ప్రజ్ఞా స్థితి.

మీరు కొత్తగా సంపాదించుకున్న ఆ భావాతీత ప్రజ్ఞా స్థితితో ఎరుక స్వభావాన్ని పరిశీలించడి.మీకు ఒక సత్యం అర్థమవుతుంది.అసలు మీరు జన్మించనే లేదని,చావు రానేరాదని.
జనన మరణాలు లేని ఆత్మ చైతన్యం అది. మనస్సు చివరి ప్రయత్నంగా చేసే మాయాజాలంలో పడిపోకుండా మసన్సు సూచించే పరిష్కారాలను సైతం వదిలిపెట్టండి.చివరకు ప్రజ్ఞా స్థితిలో స్థితం కండి.

1 ఏప్రిల్, 2009

జీవితం ఒక అనుభవం.....

ఈ భూమి మీద జీవాతానికి అర్థం ఏమిటి? అంతులేని బాధల్ని,కష్టాల్ని అనుభవించడానికేనా అని అనుకోని మనిషే ఉండడు.జీవులు శరీరం లేకుండా ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు నాశనం అంటూ ఏనాటికి ఉండదు.ఆత్మ ఓ అనుభవాన్ని పోందడానికే ఓ మాంస నిర్మితమైన శరీరాన్ని ప్రేరేపిస్తుంది.ఈ దేహం మొత్తం కదులుతున్న ఓ ప్రోటోప్లాజపు ముద్ద.దాని సహాయంతోనే ఆత్మ అనేక పాఠాలు నేర్చుకుంటుంది.

31 మార్చి, 2009

మీకు జ్యోతిష్యం ఎందుకు?

దేవుడు ఎక్కడ ఉన్నాడు?ఎలా ఉంటాడు?

యుగ యుగాల నుంచి దేవుడ్ని తప్పొప్పులను విచారించి తీర్పులిచ్చే సృష్టిలో అత్యున్నత న్యాయమూర్తిగానే వర్ణిస్తూ వచ్చారు. లేదంటే వరాలిచ్చే,శిక్షించే రూపంగానో ఊహించారు. అలాంటి దేవుడు మనుషుల మనుసులోని ఊహల్లోనే పుడుతాడు తప్ప వాస్తవంలో దేవుడు అలా ఉండనే ఉండడు.
సృష్టి మొత్తం సర్వస్వం తానే అయిన ఒక మహా శక్తే దేవుడు. ఈ గాలి, నీరు,ఆకాశం, అగ్ని, భూమి, సమస్త గ్రహాలు,నక్షత్రాలు,అంతా దేవుడే.పసివాళ్ళ కేరింతల్లో,ప్రేమికుల ఆలింగనంలో,అమ్మ ప్రేమలో, సమస్త జీవరాశుల్లో ,ఆ జీవరాశుల క్రియల్లోనూ దైవమే నిండి ఉంది. కనపడే గోచర,అగోచర సమస్త సృష్టే దేవుడు. దేవుడంటే ఎక్కడో ఉన్నత లోకంలో అందరిని చూస్తు మనుషుల పాప పుణ్యాలకు తీర్పునిచ్చేవాడు కాదు. దేవుడు పరిపూర్ణ ప్రేమ మూర్తి.దైవం మిమ్మల్ని శిక్షిస్తుందని అనుకుంటున్నారా?మిమ్మల్ని శిక్షించడం అంటే దేవుడు తన్నుతాను శిక్షించుకున్నట్లే.ఎందుకంటే మీరు ఎవరో అదే దేవుడు కనుక. ఉన్నదున్నట్లుగా దైవం ఉంటుంది.దేవుడికి ఉండడంగా మాత్రమే తెలుసు.
ఆ దేవుడికి ఏ చెడు,మంచి కనిపించదు.అన్నిట్లో అయనకు ఆయన స్వయమే కనిపిస్తుంది. మనుష్యలు సృష్టిస్తున్న దేవుడిలా ఉండక దైవం ఉనికి రూపంగా అనంతంగా,శాశ్వతంగా కొనసాగుతుంటాడు.అసలు దేవుడు అనే లింగ భేద పద వాడకమే తప్పు. దైవం అనడం సరైనది.ఆ దైవమేమనుషులకు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని,అహంకారాన్ని,స్వేచ్చను ప్రసాదించి వారు కోరుకున్నట్లు జీవించే అవకాశం ఇస్తుంది.
దైవం అత్యున్నతంగా ప్రకాశించేది ‘‘ఆలోచన’’లోనే .సృష్టి మొత్తం ఆలోచనలోనే పుట్టింది.ఇప్పుడు ఉన్నదంతా ముందు ఆలోచనగా ఉన్నదే.ఇకపై ఉండబోయేది కూడా ఆలోచననుంచే సర్వస్వం సృష్టింపబడుతుంది.ధైవపు ప్రేమ శక్తే ఆలోచన.దైవం అత్యున్నతంగా ప్రకాశించే మరో స్థితి ‘‘ఆనందం’’.ఆనందమే దైవపు నిజ స్థితి. ఆ ఆనంద అనుభూతికే సమస్త మానవాళి అర్రులు చాస్తుంది.ఆ ఆనందం భౌతిక రూపంలో పొందడానికి నిరంతరం భౌతిక రూపంలో పోరాడుతున్నారు. ఆనంద నిజ స్థితి భౌతిక ఆకారం లేని నిర్గుణ స్థితి.అది భాహ్యంగా భౌతిక రూపంలో లబ్యమవుతున్న అది అశాశ్వతం.శాశ్వత ఆనందం మీ హృదయాంతరంలో వెదికితే దొరకుతుంది.

మానవుని జన్మ రహాస్యం ... హాఫ్ కప్ ప్రిన్సిఫుల్

ఆదిలో వున్న ఫ్యూర్ మెమరి ట్రిక్ మెమరి అయి,ఆవరణ యేర్పడిన తరువాత క్రిందకు నెట్టివేయబడుతుంది.నెట్టివేయబడిన ట్రిక్ మెమరి నిర్మాణ స్థితికి వచ్చి ,అక్కడి నుండి ఖగోళ చక్రంలోని మీనరాశికి చేరి,మీనము నుండి , కుంభముకు, మకరముకు,ధనస్సుకు,వృ షభమునకు,మేషమునకు పైనుంచి రాశి యొక్క మొదటి డిగ్రి నుండి భూమిపై మొదటి డిగ్రికి వస్తున్నది.మీనము నుండి మేషము వరకు 360 డిగ్రిలు కాగా ఒక్కక్క ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు ఏర్పడుతున్నవి.ప్రతి రాశిలో ఉన్న 360 డిగ్రీలకు 360 జన్మలు ఉంటాయి.300 నాడి అంశలు కాగా మిగిలిన 60 బ్రీతింగ్ ప్రిన్స్ పిల్స్ గా పనిచేయుచున్నవి.300 నాడి అంశలు కాగా మిగిలిన 60 బ్రీతింగ్ ప్రిన్సిపుల్ గా పనిచేయుచున్నవి.రాశిలోని ప్రతి భాగము గ్రంధియై జన్మను ఇస్తుంది.శుక్ల , శ్రోణిత సంయోగము వలన సృష్టి జరుగుచున్నది.ఇది ఆదిలోని బ్రహ్మ,శక్తుల కలయికలాగానే జరుగుచున్నది.జన్మకు వచ్చు ప్రతి పరమాణు స్వరూపమున ఉన్న జీవి రెండుగా మారి ఈ జన్మల క్రమంను పూర్తిచేసి తిరిగి ఒక్కటై నక్షత్రరూపమున వుండడం జరుగుతుంది.ఇదే హాఫ్ కప్ ప్రిన్సిఫుల్. జన్మకు వచ్చే జీవి పూర్ణ ప్రజ్ఞను కాక రాశి ప్రజ్ఞను మాత్రమే పొందుతున్నది.దీనినే చీఫ్ ఇంటిలిజెన్స్ అంటారు.దీని కార్యకలాప పథకాన్ని ‘‘చీఫ్ లైన్’’ అంటారు.ఇది గ్రహాలు,నక్షత్రాలు,రాశుల వలన ఏర్పడుతుంది.ఈ విధానమును నడిపించు వారిని అగ్నిషత్ పతౄస్,బర్హిషత్ పితౄస్ అంటారు.ఒకరు శరీరంను,శరీర లక్షణాలను రెండవ వారు అహమును,గుణములను ఇస్తున్నారు.ఇది సృష్టి మానవ విధానము.దీనికి లోబడే మానవ జన్మలు ఏర్పడుతున్నాయి.ఈ పరిణామ విధానము విధానము చాల బలమైనది. దీనికి లోబడియే మానవ
జన్మలు యేర్పడుచున్నవి.ఇప్పటి మానవ విజ్ఞానానికి ఈ పరిణామ విధానమే కారణం.ఇది సమిష్టిలో జరుగును.జన్మ పరంపర మేషము నుండి మీనము వరకు జన్మలు పొందిన వారు ధృవకళ,లేక ధాతు కళ అనే స్థితిని పొందుతున్నారు.జీవాత్మ మానవుడిగా సృష్టిలొకి రావడానికి పూర్వం గ్యాసియస్ ఫామ్ లో ఉంటుంది.అది ఎవరికి పుట్టాలో ఏర్పాటు అయిన తరువాత ఆ తండ్రి వద్దకు చేరి,తండ్రి శరీరంలో శుక్లబిందు నిర్మాణం పూర్తి చేసుకుని తల్లివద్దకు చేరుకుంటుంది.తల్లి గర్భంలో పిండోత్పత్తి జరిగిన తరువాత శిశురూపము దాల్చి ,తల్లి గర్భమునుండి బయటకు వచ్చిన తరువాత ప్రథమ శ్వాస ద్వార శిశువులోకి చోరబడి , ఆ శిశువు హృదయ స్థానమున నిలిచి , శిశువు యొక్క వెన్నెముక కింద కుండలినిని నడిపిస్తుంది.ఈ కుండలిని కూడా ఆ దేహ నిర్మాణం అనుసరించే పనిచేస్తుంది.ఈధరిక్ అనేది సూక్ష,భౌతిక (ఆస్ట్రల్,ఫిజికల్) శరీరముల మధ్య సంధానకర్తగా ఏర్పడి పనిచేస్తున్నది.జీవి ఈధరిక్ ను వదిలిన తరువాతనే రాశిచక్రములో ఉన్న ‘‘క్విల్ ’’నుండి పునర్జన్మ యొక్క రూప,నిర్మాణాలు పొందుతున్నది.

29 మార్చి, 2009

మీన రాశిలో జన్మించిన వారి జాతకం.

మీరు మీన రాశిలో జన్మించారు.
http://ramthamedia.in/ మీరు మీ చుట్టు ఉన్న పరిస్థితులతోను ఇతర వ్యక్తులతోను అతిసులువుగా ప్రభావితం అవుతుంటారు.మీకు ఉన్న ఓపిక ఇతర మనుషుల్లో కనపడడం చాల తక్కువ.సమాజంలో ఉన్నతులైన వారిని బాగా నమ్మడం,సంఘంలో ఉన్న నీతి నియమాలను గౌరవించడం ఉంటుంది.మీరు ఎంత సులువుగా ఇతరులకు ప్రభావితం అవుతారో, మీ చుట్టూరుగా ఉన్నవ్యక్తుల మీ పరిస్థితులమీద కూడా మీ ప్రభావం అంతే ఉంటుంది.మీ నోటి నుండి వచ్చే మాటలో,చూసే చూపులో ఒక వశీకరణ శక్తి ఉంటుంది.ఆ వశీకరణకు సాదారణంగా మీ చుట్టూరుగా ఉన్న పరిసరాలు,వ్యక్తులు మీకు కూడా తెలియకుండానే ప్రభావితం అవుతారు.దీన్ని లోకం బాగుకోసం ఉపయోగిస్తే మీ జివితానికి ఒక పరమార్థం దొరకుతుంది.మీ చుట్టూరుగా ఉన్నవారి అంతర్గత మనస్తత్త్వంమీరు చూడగానే ఒక అంచనా వేయగలగుతారు.దీన్ని లోకం బాగుకోసం ఉపయోగిస్తే మీ జీవితానికి ఒక పరమార్థం దొరకుతుంది.మీ చుట్టూరుగా ఉన్నవారి అంతర్గత మనస్తత్వం మీరు చూడగాన అంచనా వేయగలగుతారు.వారి ప్రవర్తనను ఊహించగలుగుతారు.
అదేమాదిరిగా మీ చుట్టూరుగా ఉన్న బలమైన మనస్థత్త్వాలు ఉన్నప్పుడుకూడా అదే మాదిరిగా మీకు తెలియకుండానే మీరు కూడా ప్రభావితం అవుతారు.ఇలా పరస్పర ప్రభావితం అవడంతో మీలో మీదైన ప్రత్యేక వ్యక్తిత్వ స్థాయి తక్కువగా ఉండడంతో పాటు మీకు ద్వంద మనస్తత్త్వాలు ఉంటాయి.మీ మాటల్తో ఎదుటివారిని ఆకర్షించడంతో పాటు వారిని బాదించడం కూడా ఉంటుంది.అతిగా మొండితనం ,మొహమాటం ఉంటాయి.చేయవద్దని ఇతరలు చెప్పిన పనినిచేయడం చేయమన్నపనిని చేయకపోవడం మీకు ఉంటాయి.ఈ విధానం మార్చుకుంటే మీ జీవితం బాగుంటుంది.
మీ మనస్సు చిన్నప్పటి నుండి అతి శుద్ధంగా ఉంటుంది.కాని అంతే స్థాయిలో చంచలంగా ఉంటుంది.మీరు క్రమ శిక్షణతో కూడిన జీవితంతో చివరి వరకు జీవిస్తే తప్ప మీరు చెడు సహావాసాలకు అతి సులువుగా లొంగిపోతారు.మందు కొట్టడం మొదలుపెట్టి అన్ని రకాల అలవాట్లకు అతి సులువుగా లొంగిపోతారు.మీరు ఆలోచించే దృక్పధంలోనే శక్తియుక్తులు దాగి ఉన్నాయి.మీ ఊహాశక్తి అతి పదును తేలి ఉంటుంది.సృజనాత్మకమైన ఏరంగం ఐన మీకు వృత్తి పరంగా బాగా కలసివస్తుంది.ఆ వృత్తిలో మీర అత్యున్నత స్థానానికి ఎదుగుతారు.మీ వృత్తి పరంగా కూడా అందరితో సున్నితంగా వ్యవహరిస్తారు.ఇతరులను
బాధపెట్టినప్పుడు మీరు లోలోపల బాధపడడమేకాని ఎదుటి వారితో సాదారణంగా గొడవలుపడరు.ఎదుటి వారు చెడ్డపనులు చేస్తే వారిని విలైతే మార్చడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వారితో కయ్యాలు పెట్టుకోరు.మీకు ముసలివారితో లేదా రోగస్థులతో సహజీవనం కాని ఉండవచ్చును.
మీ మనస్సు ఆలోచనలు అతి సూక్ష్మమైనవి.మీ మనస్సును శాస్త్రాల అధ్యయనంలోకాని,ఆధ్యాత్మిక ప్రపంచంలో కాని కృషిచేస్తే అందులో లోతైన మార్గాలకు తప్పకుండా చేరుతారు.మీ చుట్టుపక్కల ఉన్నవ్యక్తుల గూర్చి మీ మనసులో మెదిలిన ఊహలు,స్వప్నాలు నిజమైనవి.మీ చుట్టు కదులాడే మనుషులను చూడగానే వారి గురించి చాల వరకు మీకు అర్థంఅవుతుంది.ఆధ్యాత్మికంగా ఏ కొంచెం కృషిచేసిన పరమ గురువుల సందేశాలను ,పరలోకాలను సందర్షించగలరు.మకీు అధ్భుతమైన వాక్చాతుర్యం ఉంటుంది.మీ మాటలతో అందరిని ఆకట్టుకుంటారు.దీనికి తగ్గట్టుగా మీకు వాక్కు శుద్ది ఉంటుంది.మీరు చెడు అలవాట్లకు లోనుకాకుండా ఉంటే మాత్రం మీరు ఒక గొప్పవక్తగా ,కవిగా,సాహీతి వేత్తగా రాణించవచ్చును.మీ మనసులో ఒకసారి సేవాభావము కలిగితే అహోరాత్రులు నిద్రాహారాలు మాని ఇతరులకు సేవచేయగలరు.మీరు స్వతాహ:గా చాలా మంచి వ్యక్తులు.ఏ విషయం కూడా రహాస్యంగా దాచుకోలేరు.ఇతరలుకు అపకారం తలపెట్టలేరు.ఆవేశం వస్తే మాత్రం కొంచెం దుష్ట ఆలోచనలు వస్తాయి.మీ ప్రయత్నం ద్వార ఇతరులను మంచిగా మార్చడానికి అవసరమైతే మిమ్మల్ని మీరే బాధించుకుంటారు.మీరు ముసలివారయ్యోకొద్ది మీ ఇంట్లో వారకి మీరే ఒక సమస్యగా మారుతారు.మిమ్మల్ని ఎవరు సరిగా పట్టించుకోవడంలేదని మీ పట్ల ఇతరులకు శ్రద్ద తగ్గిపోయిందనిఆలోచించడం ఎక్కువయ్యి లేని సమస్యను సృష్టించుకుంటారు.కాబట్టి ఈ విషయమై జాగ్రత్త పడి మీ కుటుంబ సభ్యులకు భారం కాకుండా మీ అంత ట మీరుండి ,వ్యతిరేక ఆలోచనలను రానివ్వకపోవడం ద్వార మీ జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు.
మీకు అనుకూల వృత్తి వ్యాపారాలు ముఖ్యమైనవి ప్రజోపయోగ నిర్మాణాలు, కాంట్రాక్టులు, టూరిస్టు ప్లేసులు,స్వచ్చంద సేవా సంస్థలు,ఆహారం,పబ్లిషింగ్,రేడియో,సినిమాలు.మకు జన్మతా: ఏర్పడిని మానసిక శక్తియుక్తులకు పదునుపెడితే మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత లోకాల్లోకి ఎదుగుతారు.వివాహ జీవితంలో కూడా మీరు చాల సుఖ సంతోషాలను అనుభవిస్తారు.కాని మీ మానసిక భావాలను అదుపులో ఉంచుకోలేకపోతే కారణం లేకుండానే ఉద్రిక్తులుగా మారుతారు,తొందరగా అలసిపోతారు.

కుంభ రాశిలో జన్మించిన వారి జాతకం.

మీరు కుంభ రాశిలో జన్మించారు.
http://ramthamedia.in/మీరు ఒక లక్ష్యాన్ని నిశ్చయించుకుని జీవితం అంతా దాన్నే సాధించడానికి కృషిచేయగలిగ వారు.మీకున్న ఈ శక్తిని జీవితంలో ఎంత తొందరగా గ్రహిస్తే మీ జీవితానికి అంత సార్ధకత ఏర్పడుతుంది.సామాన్య మనిషిలో పాతుకుపోయిన పురాతన భావాలను కరిగించి కొత్త సమాజంగా తీర్చిదిద్దగల శక్తి మీలోఉంది.మీరున్న సమాజం ,కులం,రాష్ర్టం,దేశమే బాగుపడాలని కోరుకోకుండా యావత్తు ప్రపంచం మారాలని మీ కృషి ఫలాలు సమస్త ప్రపంచానికి అందాలనే విశాలమైన విశ్వమానవ జాతికి చెందిన
వారు మీరు.మానవ నిర్మితమైన ప్రస్తుత వ్యవస్థపై మీకు తీరని అసంతృప్తి ఉన్నది.మీకున్న విశ్వజనీన ప్రేమ ఇతరులకు అర్థం అయ్యోది కాదు.మీకు అసలు మీ ప్రేమను ఇతరులకు వ్యక్తీకరించడమే రాదు.మీ ప్రేమ ఇతరులకు ఒకనాటికి అర్థంకాదు.మీది చాల సున్నిత మైన మనస్సు.ఇతరుల విమర్షలు మిమ్మల్ని ఊరకే బాదిస్తాయి.బయటికి చాలా గంబీరంగా కనపడ్డా,లోలోపల చాలా మదన పడడం ఉంటాయి.ఇతరులు మీ ప్రాధాన్యాన్ని గుర్తించాలని ,మిమ్మల్ని సలహాలు అడుగాలని మీకు ఎక్కువగా ఉంటుంది.కాన నిజంగా సహాయం అడిగితే మాత్రం పట్టించుకోరు.ఇతరులను గూర్చి ,జరుగుతున్న సంఘటనల గురించి మీరు మొదట్లో ఏమని అనుకుంటారో అవే సరైనవి.వ్యక్తుల , సంఘటనల గురించి మీకు మొదట తోచిన భావలే సరైనవి.చర్చించి విమర్షించి చేసిన నిర్ణయాలు సత్యదూరంగా ఉంటాయి.ఎక్కువగా ఒంటరిగా ఉండాలని మీరు కోరుకుంటారు.మీకు సమస్యలన్నీ మీరెక్కువగా ఆలోచించడం వలన కలుగుతాయి.మీకు ఆత్మవిశ్వాసం తక్కువ .సరిసరాల వ్యక్తుల భావతరంగాలు మీపై పనిచేసి త్వరగా ప్రభావితులను చేస్తాయి.ఆ పరిసరాలుమీకనుకూలమైతే మీరు శక్తివంతులు.కార్యసాధన సమర్దులుగా తయారవుతారు.అనుకూల్యం లేని వ్యక్తుల మధ్యలో మీకు పిచ్చి ఎత్తినంత పని జరగుతుంది.మీరు నమ్మగలిగితే ఒక అధ్బుత విషయం కొన్ని రహాస్య శక్తులు మీపై పనిచేస్తాయి.మీకు అంతర్వాణి సందేశాలను గ్రహించే శక్తి ఉంటుంది.ఎందుకంటే మీరు విశ్వమానవ సౌబాత్రత్వానికి చెందినవారు.
ఇంట్లో,వీధిలో జరిగే చిన్నగొడవలను సరిదిద్దలేని మీరు దేశీయ అంతర్జాతీయ సమస్యలను అతి సులువుగా పరిష్కరించగలగుతారు.విధ్యాసంస్థల నిర్హహణ మీకు సులభం.కాని వృత్తుల్లో తరుచూ మార్పులు కోరుకుంటారు.మీకు నిత్యం మార్పుకావాలి.ఏదైనా ఒకటి మొదలు పెట్టినప్పుడు ఉన్న ఉత్సాహం మీకు చివరి వరకు ఉండదు.ఈ ఒక్కలోపాన్ని సరిదిద్దుకొని మీ జీవితకాలమంతా ఒకే విషయం మీద కృషి చేసినప్పడుమీ పేరు దేవఆనికంతా పరిచయమవుతుంది.ఒక సిద్ధాంతం ద్వార ప్రపంచాన్ని మార్చగలిగిన కార్ల్ మార్క్ లాగా మీకు ప్రపంచాన్ని మార్చే శక్తియుక్తులున్న కూడా ఇంట్లో ,వీధిలోని మనుషులను మార్చలేకపోతారు.మీ ప్రతిభను గుర్తించి మిమ్మల్ని శాస్త్రసాంకేతిక,సాంఘీక రంగాల్లో మీ మేథకు పదును పెట్టగలిగేవారు మిమ్మల్ని నిరంతరం ప్రోత్సహించేవారు కావాలి.పేదల్ని బాగుచేయాలని మీకు నిరంతరం ఉంటుంది.మీ విశ్వమానవ ఆలోచనలతో మీకు చట్టాలపై మీకు తక్కువగా గౌరవం ఉంటుంది.
మీరు మీ స్వంత ధనంతో ఎప్పడు కూడా ప్రయోగాలు చేయవద్దు.ధనం పోగొట్టుకుంటారు.ఇరుకు మనస్థత్వాల వారితో ఎప్పుడు కూడా సంబందాలు పెట్టుకోవద్దు,దెబ్బతింటారు.మీ కుటుంబంలో కలుతలు ఉంటాయి.మీది ప్రేమను పంచే తత్వం.మీరు ప్రేమతో ఉండడమే తప్ప దానిని ప్రపంచానికి అర్దం అయ్యోలా వ్యక్తీకరించలేరు.మీ సార్వజనీన ప్రేమ ప్రపంచానికి అర్థంకావడం కష్టం.పాత,కొత్త స్నేహితులు,దూరపు బంధువులు అని తేడా లేకుండా అందరితో అప్యాయంగా ఉంటారు.మీగురించి తెల్సిన పరిచయస్తులు మిమ్మల్ని అభిమానిస్తారు.కొత్తవారు గౌరవిస్తారు.మీ చర్య ద్వార ఇతరులకు కొద్దిగా కష్టం కల్గిన కూడా కూడా మీరు బాధపడుతారు.మీరు అపకారికి కూడా ఉపకారం చేస్తారే తప్ప హాని చేయలేరు.మీరు చిన్నతనంలోనే వివాహం చేసుకుంటే మంచిది.లేదంటే మీకున్న జాలిగుణంతో ఏ వికలాంగులనో పెళ్ళిచేసుకుంటారు.మీకు పనిలేకుంటే ఎందుకు పనికి రానివారైపోతారు.మీ ప్రతిభకు తగ్గ పరిస్థితులు మీ మందుకు వస్తేమాత్రం ఒక్కసారిగా దూసుకుపోతారు.
ఇతరుల ఒత్తిడి పర్యవేక్షణ లేకుండా మీరు స్వతంత్రంగా చేసే ఏ ప్రయత్నమైనా మీకు బాగా కలిసి వస్తుంది.సమాజం బాగుపడే వృత్తి ఐతే మీరు మరింత ఉత్సాహంగా పనిచేయగలగుతారు.పరిశోధన రంగాల్లో బాగా రాణిస్తారు.సామాన్య మానవునికి ఉపయోగ పడేట్లు మీ బుద్దితో విశ్లేషణ చేసి ఆ పరిశోధన ఫలితాల్ని వారికి పంచగలరు.అలాగే మానసిక ,ఆధ్యాత్మిక యోగ విధ్యల్లోకూడమీరు తప్పకుండా పైకి వస్తారు.మీ మనసు ఎప్పుడు చూసిన పరిశోధన,కొత్తవిషయాలు కనుక్కోవడం అనే వాటిపైనే నిమగ్నం అవుతుంది.
గ్రహాల వక్రదృష్టి ఉంటే మాత్రం ఇవే లక్షణాలు వికృతరూపం పొంది వ్యతిరేక పలితాలను ఇస్తాయి.నిరంతర ఆలోచన ప్రవాహంతో మీమీద మానసిక ఒత్తిడి ఎక్కువ.నరాల బలహీనత ,నిద్రలేమి,చిరాకు మొదలైనవి ఉంటాయి.మీకు జబ్బు వస్తే వచ్చిన జబ్బు ఏమిటో డాక్టర్లకు అర్థంకాదు.

మకర రాశిలో జన్మించిన వారి జాతకం.

మీరు మకర రాశిలో జన్మించారు.
http://ramthamedia.in/ జాగ్రత్త ,గట్టిపట్టు , అందివచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండుట మీకు గల ముఖ్య లక్షణాలు.కనుక మీ జీవితంలో నిర్ధుష్టమైన కార్యసాధనలు ఉంటాయి.అర్థము కాని ఏ విషయాన్ని మీరు అంగీకరించరు.దేన్నేనా సూక్ష్మ పరిశీలన చేసి దాని గుట్టుముట్టులను చక్కగా అర్థం చేసుకుంటారు.ఎదుటివారి లోతుపాతులను గమనించి ఆలోచనతో ఎటువంటి కార్యాలనైనా సాధించగలరు.మీది ఆచరణ ప్రధానమైన జీవితం.మీ వద్ద జింకపిల్లలాంటి ఆకర్షణ ఉన్నది.మిమ్మల్ని చూచి ముచ్చట పడి ఎవ్వరైనా ఏ పనైనా చేసి పెడుతారు.మీరు స్వార్థాన్ని ప్రయోగించిన దగ్గర కూడా ఇతరులు మీ పనులు చేయడం ఇతరులకు ఆశ్యర్యం కల్గిస్తుంది.మీరు స్వార్ధాన్ని కొద్దిగా పక్కన పట్టినట్లైతే మీ తెలివితేటలు,పలుకుబడి సామర్ధ్యం మానవజాతికి చాలా బాగా పనికొస్తాయి.ఊహాగానాలు చేయడం మీకు నచ్చని విషయం.మీకు మంచి తెలివితేటలు,జాగ్రత్త ఉంటాయి.ఎవరిని కూడ మీరు నమ్మలేరు.కాని అందరినీ నమ్మినట్లు మాత్రం వ్యవహరించగలరు.వారు నమ్మినట్లు వ్యవహరించగలరు.ఈ కారణం వల్లే మీరు జరితపే లోక వ్యవహారాలలో ఎప్పుడు మీదే పైచేయిగా ఉండును.మిమ్మల్ని వెంటాడి వేధించేది ఒంటరితనమే.దీనికి కారణం ఎవరి మీద మీకు ఆత్మీయతలు,ఆపేక్షలు లేకపోవడం,మనసులో ఎవ్వరికి చోటివ్వకపోవడం.
మీరు సామన్య విషయాల్లో కూడా అధికంగా శ్రమించగలరు.ఇతరులు సామాన్య విషయాలని అశ్రద్ధ చేసేవి మీకు ఆసక్తి గొలిపే విషయాలు.కవులయే రచనా సౌందర్యానికి,శబ్దర్థాలకు తప్పులు లేకపోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.మీకు ఏ కళలోనైనా వాస్తవికత ఎక్కువ,కల్పన తక్కువ.దర్శన జ్ఞానం కన్నా తర్కపటిమ ఎక్కువ.
జాగ్రత్త అనేది అనుమానంగా,విమర్షన అనేది తప్పులు ఎత్తిచూపడంగా,తార్కిక శక్తి అనేది దేనినీ నమ్మకపోవుటగా మారకుండా మీరు జాగ్రత్త వహించవలసి ఉన్నది.మీ లౌక్యం మోసానికి దారితీస్తే ఇతరులు గమనించలేరు.కాని మీరు నైతికంగా పతనమయ్యే అవకాశం కలదు.మీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగా,క్రూరలుగా కనిపిస్తారు.కాని మీకు కర్తవ్య నిర్వహణే ముఖ్యం,ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారనేది తరువాత సంగతిగా భావించి ,ఇతరుల విమర్వలను లెక్కచేయరు.
జీవితంలో ఎక్కువ మార్పులంటే మీకు గిట్టవు.స్థిరంగా ఒక మార్గాన అభ్యాస పాటవముతో పరిసర వ్యక్తలను అతిక్రమించగలరు,సమస్యలను పరిష్కరించడంలో మీ తరువాతనే ఎవరైనా. ఈ స్వభావాన్ని అనుసరించి స్థిరమైన మార్పులేని పనులు,ప్రణాళికలు మీరు అలవరచుకొనుట అవసరం.మార్పులు లేని వృత్తుల్లో ఉద్యోగం మీకు జయప్రదంగా ఉంటుంది.స్వతంత్ర వృత్తులలో ఒక న్యాయవాది వృత్తి తప్ప మిగిలిన ఏవికూడా శ్రేయస్కరం కాదు.పౌరుల సౌకార్యాలకు సంబంధించిన వృత్తులు,పురపాలక సంఘాలు,పంచాయితీ,రాయబార శార,రెవెన్యూ,వ్రాతకోతల అధికార ఉద్యోగాలు మీకు అనుకూలము.లలితకళలు ఎట్టి పరిస్థితులోను మీకు జీవనోపాధిగా రాణించవు.అసహాయత,వ్యక్తిగత నిర్బయం ,సాహసం అవసరమైన వృత్తులలోకి మీరు దిగరాదు.
మీకు కామ జీవితం ప్రధానం కాదు.ప్రేమ వివాహములకు మీరు చాల దూరము.ప్రేమ వివాహలకు మీరు చాలా దూరము.ఇతర సదుపాయాలు,లాభం అన్నింటి దృష్టిలో పెట్టుకుని మీరు వివాహాన్ని మలుచుకుంటారు.జ్వర బాధలు,రక్త ప్రసార దోషాలు,రక్త నాళాల వ్యాధలు కలుగువచ్చును.నడివయస్సునుండి మోకాళ్ళు దుర్బలమగును.అతి శ్రమ వలన నరములు బలహీనత ,నిద్రలేమితో కీళ్ళ నొప్పులు,ఆహారం అశ్రద్ద చేయటంతో జీర్ణాశయం ఆమ్లత కలుగవచ్చును.
మీ జీవితం మీ స్వంత కష్టార్జితం పైనే ఆధారపడి ఉంటంది.కొంతకాలం పేదరికం తప్పని సరికావచ్చు.అకస్మిక ధన ప్రవాహాం మీకుండదు.వయస్సు దాటిన కొద్ది ఆర్ధికంగా సాంఘీకంగా లాభించును.స్థిరాస్తులు ఎక్కువగా ఉండవచ్చును.పల్లె జీవితములో మీకు ఎక్కువ సుఖం కలుగును.మీకు 30 సంవత్సరాల వయసు తరువాతనే ఆర్ధికంగా స్థిరత్వం ఏర్పడుతుంది.

ధనస్సు రాశిలో జన్మించిన వారి జాతకం.

మీరు ధనస్సు రాశిలో జన్మించారు.
http://ramthamedia.in/ ఏకాగ్రత,పట్టుదల ,అభిమానం, కార్యదీక్ష మీకు మూల సూత్రాలు.మీరు ఏది సాధించదలచినా ఇంకో ఆలోచన లేకుండా పనులు పూర్తిచేస్తారు.మీకు సూటిగా ప్రవర్తించడం తప్ప లౌక్యంగా వ్యవహరించడం ఉండదు.రహాస్యాలు మీ నోటిలో ఆగవు.మిమ్మల్ని ఇతరులు పొగడ్తలతో పడగొట్టగలరు.కాబట్టి ఈ విషయంలో మీరు జీవితాంతం జాగ్రత్త పడడం మంచిది.ఎక్కడైనా మోసం కనిపిస్తే ఎంత పెద్ద కార్యక్రమంలో ఉన్న కూడా మధ్యలోనే వదిలేస్తారు.చేసే పనుల్లో కూడా ఆ పనిమీద మీకు శ్రద్ద తగ్గినట్లు తోచి ఆ పనితో సంబందం ఉన్న ఇతరలకు కంగారు పుట్టిస్తుంటారు.మందున్న ఉత్సాహం చివరకు వచ్చేసరికి తగ్గిపోతుంది.కాని చివరకు వచ్చేసరికల్లా ఆ పనిని పూర్తిచేస్తారు.మీరు సూటిగా పోగలరు,మిమ్మల్ని మోసపుచ్చేవారి విషయంలో వారిని గుర్తించి జాగ్రత్తపడలేరు.కానిమీలో ఉన్న బలహీనత మిమ్మల్ని మోసపుచ్చిన వారిని కూడా ప్రాదేయపడితే క్షమిస్తారు.దీనివలన జీవితంలో అనేక పథకాలు ప్రారంభించి మధ్యలోనే ఆపేసి మరల కొత్తపథకాలు ప్రారంభిస్తారు.ఈ విషయంలో మీరు మీ ప్రవర్తనను మార్చుకోకుంటే , జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.మంచి వారి మన్ననలను ,పెద్దల ఆశీస్సులను పొందుతారు.మీ మనస్థత్త్వంలో ఉన్న వింతైన విషయం ఏమంటే ఇతరులకు ఏపనైనా చేయనని చెప్పిన పనిని చేస్తారు,చేస్తానని చెప్పినదాన్ని చేయరు.
ఏ పని ప్రారంభించినా ప్రారంభంలోనే విఝయాన్ని సాధించగలరు.మొదట అందరూ మంచిగా ప్రవర్తించి మధ్యలోనే మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశం ఉండును.దీనిని మార్చుకోవాలంటే ఒకే మార్గం అనవసరమైన వ్యక్తిగత నియ నిబంధనలు పక్కన పెట్టడం,తాత్కాలిక ప్రతికూలతతో ఒర్పు వహించి చిరాకు రానివ్వకపోవడం,ఇతరులను ఇతరుల తప్పులను పదిమందిలో నిలదీయకపోవడం,మొండిపట్టుదలలు వదిలేసి పట్టువిడువులు ప్రదర్షించడం మీ విజయానకి అవసరం,న్యాయం,ధర్మం పేర్లతో చిన్న విషయాల మీద పట్టుదల వహించకుండా ఉండడం ఎంతైనా అవసరం.ధర్మం,సాహసం,పట్టుదల మీకు ముఖ్య లక్షణలు.కానీ దీని భిన్నంగా ప్రవర్తించేవారి మీద క్రౌర్యం,విద్వేషం కలిగే అవకాశం ఉన్నది.మీది తాత్కాలిక కోపం.మీకు ఆత్మాభిమానంతోపాటు మంచితనం ఎక్కువ.ఓటమిని అంగీకరించరు.మీలోనే మీరు బాధపడుతూ ఎదుటివారికి సుఖంగా ఉన్నట్లు కనిపిస్తారు.మీ బాధలను ఎదుటి వారికి కనపడనివ్వరు.ఇతరలకు మీ కష్టాలు చెప్పి ఇతరలను బాదపెట్టడం మీకు ఇష్టం ఉండదు.అందువల్ల మీరు మీరున్న స్థాయికంటే ఎక్కువ ధనవంతులని,సుఖవంతులని ఇతరులు పొరబడుతుంటారు.ఇందువల్లే మీరు నడివయస్సు వచ్చేసరికి బంధువలు బాధ్యతలు పైన పడి తప్పించుకొనుటకు అభిమానం అడ్డువచ్చి ఇబ్బందలుకు గురౌతారు.తొందరపాటు తనం వదిలేసి అందరిని నమ్మకపోవడం పొగడ్తలకు లొంగలకపోవడం,మాటల్లో చేతల్లో అతిశయోక్తి తగ్గించడం అనే విషయాల్లో మీరు జాగ్రత్తపడితే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది.
ఒకచోట ఎక్కువ కాలం ఉండి పనిచేటు,ఒకే రకమైన వ్యక్తులతో చిరుకాలం అనుకూలంగా మెలగడం మీకు చాలా కష్టం..మీకు కొత్త చోటు,కొత్త వ్యక్తులు ఎప్పుడూ అనుకూలంగా ఉంటాయి.మీకు వ్యాపారంలో హోటల్,రియల్ ఎస్టేట్,ఆహార ఉత్పత్తులు,పండ్లు పూలకు సంభందించినవి మీకు సరిపోతాయి.ఉద్యోగాల్లో బోధనా వృత్తి ,న్యాయవాద వృత్తి,ప్రకటనల వృత్తి ,రేడియో,ఉపన్యాసకుడి వృత్తులు మీకు బాగుంటాయి.కోశాగారాలకు సంబంధించిన వృత్తులు పోస్టల్,ఎల్.ఐ.సి.ట్రెజరి మరియు వైద్యులుగా కూడా రాణిస్తారు.మీరు అసలు చేయకూడని వ్యాపారాలు చేపలు ,రొయ్యలకు సంభందించిన వ్యాపారం,కోళ్ళు,జంతుహింసకు సంబందించినవి ఎట్టిపరిస్థితిల్లోను చేయకూడదు.
మీకు చక్కిని శరీర సౌష్టవము,బలం కలిగి ఉంటారు.మీరు ఆహార నియమాలు పాటించకపోతే ముప్పై సంవత్సరాల తరువాత శరీరం స్థూలమై జీర్ణకోశ వ్యాధులు,రక్తపోటు,శిరోవేదనలు కలిగే అవకాశముంది.

వృశ్చిక రాశిలో జన్మించిన వారి జాతకం.

మీరు వృశ్చిక రాశిలో జన్మించారు.
పరిసర ప్రాంతాలు,వ్యక్తుల గురించి ఆందోళన,పరిసరాలనుండి మిమ్మల్ని మీరు కాపాడుకొనుటటకై ప్రయత్నించడంలో సునిశితమైన రహాస్య ప్రవర్తన అలవడుతుంది.మీలో ఒక చక్కని జనాకర్షణ శక్తి కూడా ఉంటుంది.మీరు ఇతరులపై ప్రభావం చూపి వారిని సులభంగా మీ మార్గానికి మరల్చుకోగలరు.మీకున్న ఈ ప్రత్యేక లక్షణం కొందరు తమ స్వార్దానికి ఉపయోగించుకుంటారు.మరికొందరు పరోపకానికై వినియోగించిమిమ్మల్ని ఇతరులకు మార్గదర్శకలును చేస్తారు.జీవితారంభంలో ఆవేశ స్థాయినుండి మొదలు పెట్టి జ్ఞానులుగా జీవితాన్ని ముగిస్తారు.ఇంద్రియ సుఖములు,స్వార్థమనే వాటితో మీరు ఏనాటికైనా పోరాడి విజయం సాధించుకోవలసిన బాధ్యత మిగిలిఉంటుంది.వీటిని మీరు జయిస్తే యుగకర్తలు కాగలరు.
మీలో విచిత్రమైన విషయం ఏమంటే మీరువృశ్చిక రాశిలో జన్మించి కీటకాలు,బొద్దింకలు,బల్లులను చూస్తేబయపడుతారు.మీ రాశిలో జన్మించిన స్త్రీలైతే ఈ కీటకాలు కనపడితే భయంతో వాటికి దూరంగా
పోవడం కూడా జరగుతుంది.మీరు ఇతరులతో మాట్లాడే మాటల్లో రాసే రాతల్లో చక్కటి పదాలతో కూడిన భాషను వాడుతారు.ఇంకా ఎలాంటి వ్యక్తులతోనైనా వాతవరణంలోనైనా కలిసిపోవుశక్తి మీకు కలదు.ఏమరుపాటున ఉంటే చెడు స్నేహాల వలన పాడైపోయే అవకాశం కూడా ఉంది.మిమ్మల్ని పెంచడంలో పెద్దలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.దుస్సాంగత్యం,ఇంద్రియవాచలత్వం అనే అంశాలనుండి మిమ్మల్ని కాపాడాలి.లేదంటే మీరు ఆవిషయాల్లో చెడిపోవడానికి అవకాశం ఉంటుంది.మీకు భయం , రహాస్య ప్రవృత్తి అను రెండు విచిత్రమనో ధర్మాలు ప్రాముఖ్యం వహిస్తాయి.మిమ్మల్ని ప్రోత్సహించి మంచివారి సాంగత్యంలో ఏదో ఒక పనిలో మిమ్మల్ని నిమగ్నులను చేయడం,వారితో సమానమైన హోదాలో మిమ్మల్ని వ్యవహరించడం చేస్తే మీకు చక్కటి దైర్యం , స్వతంత్ర ప్రవృత్తి ,విద్యా బుద్దులు అలవడి చాలా గొప్పవారు అవుతారు.
రహాస్య ప్రవృత్తి మీ ప్రత్యేక ధర్మాల్లో ఒకటి.మీ అంతరంగం మరొకరికి తెలియటం మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.మరు ప్రేమ,దయ చూపిన,ఎవరికైనా సహాయం చేసినఆ విషయం ఇతరులకు తెలియడం చాల కష్టం.అనగా గుప్తదానల్లో మీకు విశ్వాసం ఎక్కువ.మీరు మంచి వారని ,మంచిని సంకల్పించి పాటిస్తున్నారనిమీ అనుచరులకు తెలియటకే చాలా కాలము పట్టును.మీరు మనసును,ఇంద్రియాలను జయించలేకపోతే చెడుభావాలు,చెడ్డపనులు,స్వార్థం,కాఠిన్యం,మోసపూరితంగా ఉన్న కూడా మీరు చేసేవాటిని ,మిహృదయాన్ని ఎవరు గ్రహించలేరు.కాని ఒకనాడు సర్వం ప్రకటితమై క్షాళన జరగుతుంది.మీలో మరో విచిత్రమైన విషయం మీ హృదయం లోతు మీకే తెలియదు.ఇతరులకి అంతకన్నా తెలియదు.
మీరు సామన్యంగా ఏదో ఒకపనిలో నిమగ్నులై ఉన్నంతసేపు మీ మనసు పవిత్రంగా ఉంటుంది.పని తక్కువ ఆలోచించడం ఎక్కవ మొదలైనకొద్ది ఇతరుల లోపాలను పట్టకోవడం మొదలుపెడుతారు.మంచిపనలు చేసినా ఎవరికి తెలియకుండా చేయవలెననే పిచ్చిదలతో కొంతకాలం వ్యర్థంగా ప్రయత్నిస్తారు.
అపరాధ పరిశోధక శాఖ,సి.ఐ.డి.మొదలగు విద్యలలో నైపుణ్యం ఉంటుంది.మాదక ద్రవ్యాల రవాణ చేసేవారిని పట్టుకోవడంలో మీరు బాగా రాణిస్తారు.మీరు తీవ్రమైన ,వాడిఐన వాగ్దాటి,రచనా ప్రభావంతో జీవనయాత్ర సాగించే నిపుణత కలవారు.మీకు బాల్యవివాహము జరిగనచో నడివయస్సున కొంతకాలంకు మీ భాగస్వామికి సుధీర్గమైన అనారోగ్యము కలుగవచ్చును.అనూహ్యమైన కారణాలచే రెండవ వివాహం జరుగవచ్చును.మీ స్వాభావం ఉగ్రమైంది.సాహాసాలకు దిగటం ఇష్టం.చిన్నతనంలో తీవ్ర అనారోగ్యాలు ఉంటాయి.ఒక వయస్సువరకు సన్నని శరీరమున్నా దాంపత్య జీవితకాలం నుండి స్థూల శరీరం ఏర్పడి , సుదీర్థమైన స్వల్ప అనారోగ్యం ఉండును.నడుము,మోకాళ్ళు,గొంతు,మూత్ర పురీషావయవములకు సంబంధించిన వ్యాధలు కలుగుచుండును.ముసలితనంలో మూత్ర పురుష వ్యాధులు,మూలవ్యాధి,భగందరము(ఫిస్ఠులా)కలుగవచ్చును.కాళ్ళు,పొట్ట,లివరుకు గుండెకు నీరు పట్టుట, కామెర్లు మొదలైనవి కలుగవచ్చును.

తులరాశిలో జన్మించిన వారి జాతకం.

మీరు తులరాశిలో జన్మించారు.
http://ramthamedia.in/ మీరు అందరితోని సమన్యాయంగా ఉంటారు.ఇతరులకు చేయవల్సిన పనులు,ఈయవల్సిన వస్తువులు ,డబ్బు,అలాగే మీకు ఇతరులు ఇయాల్సినవి,చేయాల్సినవి బాగా గుర్తుంటాయి.అవకాశాల్ని,కాలాన్ని,డబ్బును,సద్వినియేగం చేసుకోవడం మీకు తెలిసినంతగా ఎవరికి తెలయదు.దాంతో పాటే అనవసర ఖర్చులు కూడ అధికంగానే ఉంటాయి.మీ ఇంటిలో గుండుసూదినుండి మొదలుకుని,టేబుల్లు,కుర్చీలు,ఇంటి సామాగ్రి మొత్తం దేని స్తానంలో అది అలకరించబడి ఉంటుంది.ఇల్లు , ఇంట్లో వస్తువులు సర్దడం, టైం టేబుల్ వేయడం , బడ్జెట్ పథకం వేయడం,పనివాళ్ళకు జీతం లెక్కకట్టడం మీకు సులువుగా ఉంటాయి.కాని ఒకొక్కప్పుడు అతి చిన్న వస్తువు జాగ్రత్త,చాదస్తం చూపే మీరు ఒకోసారి
జీవితంలో విలువైన పెద్ద అవకాశాలను పోగొట్టుకుంటారు.మీరు సామన్యంగా కోప్పడరు.ఇతరుల మంచితనం వలన మీకు చాల ఉపయోగం ఉందని మీకు తెలుసు.లెక్కలు సరిగ్గా చూపి మిమ్మల్ని అధికంగా డబ్బు అడిగినా ఒప్పుకుంటారు గాని లెక్క తప్పు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తే మీరు సహించరు.ఇతరులకు దానాలు ఎక్కువగా చేస్తారు.గాలిమేడలు కట్టడం ఎక్కువగా ఉంటుంది.భవిష్యత్తులో అధికంగా సంపాదించి జీవితంలో సుఖపడాలని నిరంతరం కోరిక ఉంటుంది.కాని వాయుతత్వ రాశిలో పుట్టడం వలన మీ ఆలోచనల్లో,కార్యక్రమాల్లో స్థిరత్త్వం ఉండక నిరంతరం కొత్త పథకాలను ప్రారంబించడంతో మీకు అప్పులు పెరుగుతుంటాయి.వాటిని తీర్చడానికి మరో కొత్త పధకాలను ఆలోచించడం ఉంటుంది.మీరు ఇలా ఇబ్బందులు పడకూడదు అనకుంటే ఒక సంవత్సరం పాటైన ఆలోచించి మీరు ఇష్టంగా,ఎన్ని గంటలు పనిచేసిన అలసిపోని ,విసుగురాని రంగం ఏదో ఒకటి మీ మనసుకు నచ్చింది ఎంచుకోండి.అలా ఒకసారి దీర్ఘంగా ఆలోచించి ఆ రంగంలో అడుగుపెట్టారంటే ఇక జీవితాంతం ఆరంగం నుండి కదలవద్దు.
మీకు శుచి శుభ్రత ఎక్కువ.పూలు పరిచినట్లు చక్కగా ఉండే బెడ్,తీర్చిదిద్దిన ఇల్లు,రుచికరమైన భోజనంలో మీరు ఆకర్షింపబడడంతో పాటు మీ కాలం కూడా కొంత వాటికి వినియోగిస్తారు.మొక్కలు పెంచడం,చక్కని చిత్రపటాలు సేకరించడం మీకు ఆసక్తి ఉంటుంది.లలిత కళల్లో చక్కని అభిరుచి ,నైపుణ్యం ఉండును.కవిత్త్వం,చిత్రలేఖనం,చలనచిత్ర సంబంధాల్లో మీకు ఆదాయం పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి.గ్రామ జీవనం కన్నా నగర జీవనం మిమ్మల్ని ఎక్కు ఆకర్షిస్తుంది.కాని గ్రామ జీవనానికి సంబందిచిన దృష్యాలు మీ మనసును రంజింపచేస్తాయి.నాగరికతలోని వివిధ నవీనాంశాలు మిమ్మల్ని ఆకర్షించును.రేడియో,టెలివిజన్ ,వైర్ లెస్ శాస్త్ర శాఖలలో మీరు ప్రావిణ్యం గ్రహిస్తారు. జనసామన్యంను రంజింపచేయుట,సభా వశీకరణం,అభినయం మీకు గల మానసిక శక్తులు. కాని ఈ శక్తులన్నీ చిన్న పిరికితనం అనే తెరమాటున పడి ఉంటాయి.దాన్ని జయించకపోతే మీరు జనాలకు దూర దూరంగా మెలుగుతారు.మీరు కార్యరంగంలో దిగుట తప్పనిసరైన సందర్భంలో ఒకసారి దిగిన తరువాత అసాధరణముగా రాణించి సాటివారిని ఆశ్చర్యపోయేట్లు చేస్తారు.పరిసరాలను ,మిమ్మల్ని మీరు మరిచిపోయినపుడు జయం పొందుతారు.జనంతో కలిసి ఉన్నప్పుడు మీ మనస్సుకు కంగారు,విసుగు,భయము కలుగుతాయి.అక్కడి నుండి బయటపడడానికి ప్రయత్నిస్తారు.నిర్మలమైన పరిసరాలు ,వాతవరణం,రుచికరమైన ఆహార పానీయాలు,నాజూకైన వేషదారణ మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి.అటువంటి పరిస్థితిలో ఉన్నంతవరకు మీ తెలివి తేటలకు,మేదస్సుకు ప్రభావానికి లొంగని వారుండరు.మంచి మార్గానగాని చెడ్డమర్గాన గాని జన సముహాన్ని ఉత్సాహపరిచి నడిపించగలరు.ఇట్లు నడిపించుట జాతులపైన,దేశములపైన కూడ ప్రభావం చూపవచ్చును.కానీ మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మొండితనం రూపంలో ఉంటుంది.ఎక్కువ భాగం స్వప్న ప్రపంచంలో విహారించడం ఉంటుంది.మీలో వినయ విదేయతలు,చట్టబద్ధంగా సాంప్రదాయ బద్ధంగా జీవితం నడుపవలెనన్న కుతుహలం ఎక్కువ.మీరు తప్పు చేసిన దాన్ని వాక్చాతుర్యంతో చట్టబద్దంగా చెప్పగలరు.ఘన కార్యాలను గొప్పగా ప్రారంభించి చక్కగా నిర్వహిస్తు రక్తి కట్టే సమయానికి విసగుచెంది,చేసేపనినుండి విరమించి ఇంకోక అందని దానికై పాకలాడటం మీ మన:ప్రవృత్తిలో ఉన్న ప్రధాన లోపం.ఈ లోపాన్ని మీరు వెంటనే సరిదిద్దుకోవాలి.జీవితాంతం ఒకే రంగంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చిన మీరు ఒకే రంగం ఎంచుకుని అందులోనే స్థిరపడాలి.ఒక ఉద్యోగం కాని వ్యాపారం,వ్యాసాంగం కాని అలవడనిచో మీరు ఇక ఆపైన స్థిరముగా పనిచేయలేరు.చిన్నతనంనుండి మనస్సు క్రమబద్దమైనచో న్యాయవాద వృత్తికి ,వైద్యవృత్తికి చక్కగా పనికివస్తారు.ధర్మా ధర్మములను సరిగ్గా అంచనవేయగలరు.శాస్త్ర విద్యలో భౌతిక శాస్త్రం,విద్యుత్,శబ్ద ,రేడియో తరంగాలు, పరిశోధనలు చేయు శాఖలలో మీరు రాణిస్తారు.ఒక లలిత కళను అభిమానించి ప్రావిణ్యం వహించడంకన్నా దాంట్లో ప్రఖ్యాతి గాంచడం ఎక్కువగా జరుగుతుంది. మీ అభిమాన విద్యలలో సినిమా రంగం గాని పోరాట విద్యలుగాని తప్పక ఉంటాయి.చిన్నతనంలోన వివాహం జరిగినచో నడివయస్సున మరొక వివాహంగాని ,దానికి సరిపోవు మరో యోగం గాని జరుగవచ్చును.

కన్యరాశిలో జన్మించిన వారి జాతకం.

మీరు కన్యరాశిలో జన్మించారు.
http://ramthamedia.in ఇతరులమీద వాత్సల్యం,అభిమానం,బంధుప్రేమ ,మీ బాధలను ,శ్రమను ఇతరులు గుర్తించాలని కోరుకోవడం మీ స్వభావంలో ప్రధానంగా కనపడుతాయి.మీ మనసు సుకుమారమైంది.సున్నితమైన మనస్తత్త్వాన్ని చూపడం,ఇతరుల ప్రోత్సాహాన్ని బట్టి గొప్ప ప్రజ్ఞను ప్రదర్షిండం మీకున్నమంచి లక్షణాలు.పరిస్థితలు అనుకూలించే కొద్ది మీరు రాణించి పదిమందికి ఉపయోగపడగలరు.పెద్ద పెద్ద కార్యక్రమాలను మీరు స్వయంగా ఆరంభించరు.ఇతరులు కనుక ఆరంభిస్తే వారికి సలహాలు చెప్పి,వారితో పాటు ఉండి వారి అండదండల్లో సురక్షితంగా జీవించాలని మీ మనస్సుకోరుతుంది.మీ అంతట మీరే స్వంతంగా కొత్తగా ఏపనైనా ఆరంభించే దైర్యం మీకు ఉండదు.మీరు చేసే పనిలో ఇతరులు మీతోపాటు కలిసిరాకుంటే మీలో పిరికితనం,నిరాశపెరిగి అపజయం కలుగుతుందేమోననే భయంతో మీరు చేసే పనని మధ్యలోనే వదిలిపెడుతారు.అతి ముఖ్యమైన పనుల్ని కూడా ఇలాగే వదిలేయడం,లేదా వాయిదా వేయడం వలన జీవితంలో ఎదురయ్యే ఎన్నో అవకాశాలను పోగొట్టుకుంటారు.మీ గొప్పతనాన్ని గుర్తించేవారు దొరికినపుడు మీకు ధైర్యం , మనోబలం వస్తాయి.మీ తెలివికి తగిన ఆత్మ విశ్వాసం లేక మీరు బాధపడుతారు.
మీ కుటుంబ సభ్యులు మీ క్రింద పనిచేసేవారు మీ మీద ఎక్కువ అభిమానం కలిగి ఉంటారు.ఇతరులను గురించిన ఆలోచనలు మిమ్మల్ని బాధపెడుతాయి.హీ గురించి ఇతరులు ఏమనకుంటున్నారో అీనే కుతుహలం మీకు ఎక్కువ.వీలైనంత త్వరగా చిన్నవయసులోనే ఏదో ఒక ఉద్యోగంలో చేరటం మంచిది.మీకు వ్యాపార రంగం అసలు సరిపడదు. మీ జీవితంలో మీ ఆదర్శాలు,కర్తవ్యాలు ఆచరణలోకి రాక మనసులోనే మూగపోవచ్చు.
మీకు గృహ సౌఖ్యం , చక్కని ధనాదాయ మార్గాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి.నడివయస్సునుండి అతిగా ఆలోచించడం ఇతరులను గురించి చెడ్డగా తలవడం,మీమీద మీరే జాలిపడటం లాంటి లక్షణాలు కలిగే అవకాశం ఉంది. జనంతో ఉన్నప్పుడు బిడియం ,పెద్దవారిని స్వయంగా కలవడంలో సిగ్గు,ఉన్న పరిస్థితిని విప్పి చెప్పుకోవడానికి సంకోచం కలిగిఉంటారు.బంధుమిత్రులకు భయపడి మొహమాటంతో మోయరాని బాధ్యతలను నెత్తిన వేసుకుని చాలకాలంపాటు బాధపడుతారు.
స్వంతవారు,స్వస్థలం అనేవాటి మీద మీకు ఎక్కువ అభిమానం ఉంటుంది.మీరు తప్పులు చేసి వాటిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించి చిక్కులు పడుతుంటారు.ఎవరిని మీరు అభిమానించి కాపాడుతారో వారే మీకు ద్రోహం చేస్తారు.చేయి చాపిన ప్రతి చోట మీకు అప్పుపుడుతుంది.కాని మీరు అప్పులు చేయరాదు.వాటిని మీరు తీర్చడం కష్టమవుతుంది.మీకున్న బాధ్యతలు అప్పులు చేయాల్సిన పరిస్థితులను కల్పించును.వాటిని తీర్చడం కష్టమై ఇతరాత్రత జూదం మొదలైన వ్యవహారాలకు మొగ్గుచూపడం ఉంటాయి.ఒక్కసారి చెడ్డ అలవాట్లకు బానిస ఐతే అవి జీవితాంతం కొనసాగే అవకాశం ఉంది.మీరు జీవితంలో ఉన్నదాంట్లోనే సర్దుకోవడం చాల మంచిది.ఎట్టి పరిస్థితిల్లో మీరు అప్పులు చేయరాదు.మీ మంచికోసం ఇతరులు చెప్పే సలహాలను మీరు వినిపించుకోవాలి.ఆ సలహాలను ఆచరణలో పెట్టినచో మీ జీవితం బాగుపడుతుంది.
అధికంగా ఆలోచించిన కొద్ది మీకు పనిలో అసమర్ధులు అవుతారు.వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లు వదలక వినియోగించడం కోవడం ఎలా అని నేర్చుకున్న కొద్ది మీ జీవితం చక్కగా బాగుపడుతుంది.తెలివితేటలతో చేసే వృత్తులన్నింటిలో మీరు రాణిస్తారు.గణితం,భాష,నిఘంటు నిర్మాణం,
విధ్యా విధానం,శాస్త్రాలు,టైపు,షార్ట్ హాండ్,ప్రింటింగ్ ప్రెస్, కవిత్వం,కాంట్రాక్టు పనులు, ఆరోగ్య పరిశోధన శాలలు,బ్యాంకులు,కోశాగారాలు,ద్రవ్య సదుపాయాలను కనిపట్టు విధానాలు,సహాకార శాఖలు,ఆటోమోబైల్ రంగాల్లో మీరు ఆసాధరణంగా రాణిస్తారు.
చిన్నతనంలో వివాహమైతే మీకు ఆపేక్షలెక్కువగా ఉంటాయి.మీరు ఎక్కువకాల ఇల్లు,ఊరు వదిలిపెట్టి ఉండలేరు.అలా దూరంగా స్థిర పడగలిగితే మాత్రం మంచి అభివృద్ది ఉంటుంది.ఇల్లు దిద్దుకోగల నేర్పుమీకుంటుంది. మీకు గుండెకు ,ఊపిరి తిత్తులకు జీర్ణకోశమునకు సంబంధించిన అనారోగ్యములు కలుగవచ్చును.ఆరోగ్యం గూర్చిన దిగులు మీకు ఎక్కువ.నిరుత్సాహం,మీలో మీరు దుంఖ పడటం,ఇతరులు మీ పట్ల శ్రద్ద చూపటం లేదనే విషాదం కలుగవచ్చును.కొన్ని శాఖలలో విద్యాభ్యాసం సులభం.కంప్యూటర్స్ ,వైద్య శాఖ , గణితం,వాణిజ్య విద్య,జమా ఖర్చుల లెక్కలు,వాటి పర్యవేక్షణ మొదలు వాటిలో మీకు ప్రావిణ్యం సంపాదించే అవకాశం ఎక్కువ.మీలో సేవా భావము కూడా ఎక్కువ.
చిన్నతనంలోనే పెళ్ళిచేసుకోవడం ఉత్తమం.ఆలస్యమైన కొద్ది ప్రేమ వివాహాలు జరుపుకోవడానికి అవకాశం ఎక్కువ.మీ వ్యతిరేక లింగ సభ్యులతో గంటల తరపడి ముచ్చట్లు పెట్టే ఓపిక మీకు ఉంటుంది.ఇతరుల్లో ప్రత్యేకంగా కనపడడానికి అందంగా అలంకరించుకునే అలవాటు ఎక్కువ.సంసార జీవితం మీకు సుఖంగానే గడుస్తుంది.

సింహ రాశిలో జన్మించిన వారి జాతకం.

మీరు సింహరాశిలో జన్మించారు.
http://ramthamedia.in/ మీకు సంకల్పబలం,ఆత్మ విశ్వాసం,అభిమానం,పట్టుదల ఎక్కువ.అందరికన్న ఉన్నత స్థాయిలో ఉండాలనే కోరకి మీ మాట పాటిస్తే ఇతరులు పాటిస్తే వారు బాగుపడుతారనే నమ్మకం,దాంతోపాటు అధిక
చురుకుతనం,తొందరపాటు,కోపం,పశ్చతాపం,విశాల హృదయం,ఇవన్ని మీ స్వభావంలో ముఖ్యంగా కనపడుతాయి.ఒక్కముక్కలో అడవిలో సింహానికి ఏ లక్షణాలు ఉంటాయో అవన్ని మీకు ఉంటాయి.మీరు ఏనాడు ఎట్టి పరిస్తితిల్లోను ఓటమిని అంగీకరించరు.ఇతరులను ఏదో ఒక మంచి మార్గంలో నడపాలనే కోరిక మిమ్మల్ని వదలదు.పరిస్థితులతో ఏనాటికి నిరాశపడకపోవడం మీకు గల మంచి లక్షణాలు.ఆవేశం కొంచెం ఎక్కువ.దాని వల్లే మీరు చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది.మీరు ఇతరుల బాధ్యతలను తలపై పెట్టకుని చిరుకాలం బాధపడుతుంటారు.
మీకు మంచి మాటకారితనం ఉంటుంది.మీ ఆకర్షణకు లోనై ఇతరులు మిమ్మల్ని అనుసరిస్తారు.నేనే గొప్పవాణ్ణనే అహంకారం మిమ్మల్ని వెంటాడుతుంది.ఇతరులు బాగుపడాలని మనస్పూర్థిగా సలహాలిస్తారు.కాని అదే పనిని అంటే ఇతరులు మీకు సలహాలు ఇస్తే మీకు నచ్చదు. ఇతరలు మీ పట్ల వ్యతిరేకంగా మాట్లాడిన ,మిమ్మల్ని మార్చాలని చూసేవారితోని జివితాంతం దూరంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ఎవరిప్రవర్తన నచ్చకపోయిన వారితో గొడవ పెట్టుకోవడం కాకుండా అసలు ఆ పరిసరాలకే పోకుండా ఆవిషయాన్ని అంతటితో వదిలిపెడుతారు.సమాజంలో వారెంత పరపతి కలవారైన కూడ వారిని పట్టించుకోకండా వదిలిపెడుతారు.కావలంటే వారి స్థాయిలో ప్రముఖులు కావడానికి ప్రయత్నిస్తారు తప్ప నచ్చని వారితో ఎలాగో సర్ధకుపోదామని ప్రయత్నించరు.ఇతరుల వస్తువు వాడడానికి కూడ ఇష్టపడరు.పట్టుదలతో స్థిర చరాస్తులు పోయినకూడ లెక్కచేయరు.ఇతరుల దగ్గర నీచత్వం ఎక్కవగా కనిపిస్తే మీ సహనం నశించిన రోజున కొట్టగలరు.కాని వారు కాళ్ళు పట్టుకుంటే వెంటనే మర్చిపోతారు.ఎవరు పరిచయంలేని కొత్త ప్రదేశంలోకి ఫోయిన కూడా అక్కడి వారిని ఆకర్షిస్తారు.మీరు స్వంత వ్యాపారం మొదలుపెడితే ధీర్ఘకాలంలో ఖచ్చితంగా వృద్దిలోకి వస్తారు.వృద్దిలోకి వచ్చేముందు మానసికంగా ఆర్థికంగా అలసట పొందిన కూడా ధీర్ఘకాలం పాటు చేసేపనినే అంటుపెట్టకుని ఉండాలి.మీరు పనిచేసే ఎక్కడైనా ఇతరులకు ఆదర్శంతంగా ఉండేలా వ్యవహరిస్తారు.మీరు చేసిన పని మీ తరువాత ఆ స్థలంలోకి వచ్చేవారికి ప్రమాణికం అవుతుంది.మీకు జీవితంలో అనకోకుండా ధనం,అవకాశాలు,పదవులు,కీర్తి అప్రయత్నంగానే మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి.కాని మీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు,పట్టుదల కారణంగా చాలావరకు మిమ్మల్ని వెదుక్కుంటు వచ్చినవాటిని కోల్పోతారు.అప్రయత్నంగా ఆస్తి లబించడం,విరాళములు,ధనసహాయం లభిస్తుంది.కాని ఇతరులు అవసరాలను గుర్తించి వారిని ఆదుకోవడానికి ఇలా వచ్చినదంతా అలా ఖర్చుపెడుతారు.కాబట్టి డబ్బు ఖర్చుపెట్టే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది.అప్పులు చేయడం విషయంలో మీరు భయపడక పోయిన , చేసిన అప్పలు తీర్చడంలో నిస్సహ్హాయ పరిస్థితుల్లో కూరుకుపోకుండా జాగ్రత్తపడాలి.
మీరు ఏ స్తితిలో ఉన్న మిమ్మల్ని ఆశ్రయించేవారు ,మీపై ఆధారపడేవారు,మీకు లొంగినవారు,మీ అడగుజాడల్లో నడిచేవారు ఎప్పుడు ఉంటారు.మీకు శారీరక బలమే కాక మనోబలం,భావాల తీవ్రత కూడా కూడా చాల ఎక్కువ. మీ తెలివితేటలు చురగ్గా ఉంటాయి.ఇతరులను అతిగా మీరు విమర్షించడం మీకు పనికిరాదు.మీ వేగానికి తట్టుకోలేని వారిమీద క్షణంలో కోపించే దుర్గుణం మీకు ఉంది.దాంతో మీకు చాల నష్టం జరుగుతుంది.మీ దృష్టిలో సమాజంలో ఎక్కువ మంది ఆనరు.మీకు నచ్చని విషయాలుఎక్కవ మందిలో కనిపిస్తాయి. వారిని మీరు తప్పులు పట్టడం,న్యాయం పేరుతో తగాదాలు పెట్టుకోవడం,పోరాడి వెనక్కు మర్లడం,జీవనోపాధి మార్గాలు దెబ్బతినడం లాంటి వాడితో మీ జీవితం కష్టాలపాలు కావచ్చు.ఎవరే తప్పుచేసినా వారది ఒప్పుకుని అంగీకరిస్తే క్షమిస్తారు.మీకు సర్వ నష్టం చేసినవాడినికూడ మీ కాళ్ళుపట్టకుంటే క్షమిస్తారు.మీకు కోపం కలిగించే రెండు విషయాలు..మొదటిది మీకు తెలియకుండా చాటుమాటు తనం చేయడం.రెండు నమ్మక ద్రోహం చేయడం.
ఇతరులతో మీకు ప్రేమో ,ద్వేషమో ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సాధ్యం.మాటల్లో ఇతరులను మభ్యపుచ్చి లౌక్యంతో జీవితాన్ని సాగదీయడం మీకు చేతకాదు.మానవత్త్వం,మంచితనంమీద మీకు అంతులేని అపార నమ్మకం ఉంటుంది.కొత్తవారిని నమ్మకుండా ఉండలేరు.జాలిగొలిపే దృశ్యాలు కనిపిస్తే మాత్రం మీరు కష్టాలపాలైన కూడా వారి బాధ్యత వహిస్తారు.మీ ఉదార గుణాన్ని కనిపెట్టిన కొందరు , మిమ్మల్ని కావాలని మోసం చేసి మీ సహాయ సహాకారాలను అనేక రకాలుగా పొందే అవకాశం ఉంది.
ఇతరులను మోసం చేయడం,నమ్మించి ముంచడం,కపట ప్రేమ చూపడం మీ స్వభావంలో లేవు.అందరూ మీ మాటలకు లోబడాలని ,అందరికన్నా తెలివైన వారమని మీ నమ్మకం.మీ కంఠధ్వని ఇతరులను ఆకర్షిస్తుంది.మీ మాటలు ఇతరులను ఆలోచనల్లో పడేస్తాయి.డబ్బు,ఆస్తిపాస్తులు,అధికారం మీ దృష్టిలో ఏమంత విలువైనవి కావు.కాని పేరు ప్రతిష్టలు,ప్రచార కాంక్ష అనే రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు.
వైధ్య వృత్తికి సంబందించిన అన్ని శాఖలు మీకు అనుకూలం.బాధల్లో ఉన్నవారిని రక్షించే వృత్తుల్లో మీరు బాగా రాణిస్తారు.వ్యాపారాల్లో ప్రచారానికి సంబందించిన పబ్లిసిటి ఏజెన్సి,ఔషదాలు,రసాయయ ద్రవ్యాలు,వస్తు ప్రదర్శన శాలల నిర్హహణ,టూరింగ్ ఏజెంటు లాంటి లాంటి వృత్తులు మీకు సరిపడుతాయి.ఇంకా వాగ్ధాటితో కూడిన భోధన వృత్తుల్లో కూడా మీరు రాణిస్తారు.మొత్తం మీద మీరు ఉద్యోగాల కన్న వ్యాపారలలోనే ఎక్కువగా రాణిస్తారు.ఒకరి కింద పనిచేయు చిన్న చిన్న ఉద్యోగాలలో మీకు సహించదు.అధికారులతో మీకు పొత్తుకుదరదు.ఒకరి క్రింద పనిచేయడం మీ మనస్సుకు కష్టంగా తోస్తుంది.ఈ విషయంలో మీకు నిగ్రహం అవసరం.లేదంటే జీవితంలో సుఖపడే అవకాశాలకు దూరం అవుతారు.దేశానికి అత్యన్నత పదవిలో ఉన్నదేశాధ్యక్షుడైనా ఇంకొకరి ఆధిపత్యంలో (దేశ సార్వభౌమత్త్వం)ఉండాల్సిందేననే నిజాన్ని గ్రహిస్తే మీరు ఇంకొకరి దగ్గర పనిచేయగల్గిన పరిస్థితులు మెరుగవుతాయి.కాని వీలైనంతగా మీరు స్వతంత్ర స్వతంత్ర వృత్తి ,వ్యాపారలకు ముందు పెద్దపీట వేస్తారు.వేరే వ్యక్తి,సంస్థ ఆధిపత్యంలో పనిచేయగల్గినంతకాలం మీకు లోలోపల మీ స్వాతంత్రం కోల్పాయమన్న భావనతోనే పనిచేస్తారు.
ఇతరుల దగ్గర అప్పు తీసుకుంటే తీర్చడం కష్టం.అలాగే మీరు ఇతరులకు అప్పు చేబదుల్లు ఇస్తే తిరిగిరావడం కష్టం.
ఆదర్శంతమైన వారిని వివాహమాడి , వారిని ఆరాధించాలనే కోరిక మీకుంటుంది.కాని ఈ విషయంలో మీకు ఆశాభంగం కలుగవచ్చును.మీరు త్వరపడి ఆవేశంలో వివాహం చేసుకొనుట,వారిలో మీరాశించిన ప్రేమతత్త్వం లబించనపుడు మీ జీవితం కూలిపోయినట్లు బాధపడే అవకాశముంది.మీకు జనాకర్షణ ఎక్కువ.మీ ఆకర్షణలో పడ్డ వారితో సులభంగా ప్రణయ సంబందాలు ఏర్పరుచునే అవకాశం ఉంది.చిన్నతనంలో జ్వరబాధలు,వడదెబ్బకొట్టుట,దెబ్బలు తగిలించుకోవడం,అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు.యవ్వన దశలో జీర్ణకోశ బాధలు,కడుపునొప్పి,తలనొప్పి,కంటిజబ్బులు కలుగవచ్చును.శరీర వ్యాయామం ,ఆరు బయట విహారం మీకు ఆరోగ్యాన్ని కలుగుచేస్తుంది.

28 మార్చి, 2009

కర్కాటక రాశిలో జన్మించిన వారి జాతకం.

మీరు కర్కాటక రాశిలో జన్మించారు.
http://ramthamedia.in మీ మనస్సు ఒకసారి పరిపూర్ణ ఉత్సాహంతో తొణికిసలాడుతుంది.మరోసారి నిరాశ నిస్ప్రహలు మిమ్మల్ని ముంచి ఎత్తుతాయి.అమవాస్య ,పూర్ణిమలకు సముద్రంలో ఆటుపోట్లు వచ్చినట్లు మీ మనస్సకు నిరంతంర ఆటుపోట్లు ఉంటాయి. కొంతకాలం ఉత్సాహం ,ఆశ,సంతోషము వెల్లివిరుస్తాయి,మరికొంతకాలం విషాదం,నిరాశ,దిగులు కలుగుతాయి.మీ తెలివితేటలు కొంతకాలం సూర్యచంద్రలు ప్రతిబింబించిన సముద్రంలా సమస్తాన్ని చూడగలుగుతాయి.కొద్దిరోజులు కారణం లేకుండానే భయం,నిరాశ,ఒంటరితనంతో ,బంధుమిత్రులతో కలసిఉండలేక చికాకుపడడం జరుగుతాయి.ఇతరుల విషయాలను,ఎదుటి మనస్తత్త్వాలను ,వారి ఆలోచనలు ఇట్టే పసిగట్టగలరు.మీ అంతరంగాన్ని మాత్రం ఇతరులకు ఏమాత్రం తెలియనివ్వరు.వ్యక్తులతో మీరు కొంత కాలం అత్యంత అనురాగంతో ప్రాణంగా కలిసపోవడం, మళ్ళీ వారితో విడిపోయి జీవితాంతం సంబంధం లేకుండా ఉంటారు.మీ మనసుకి ఆవేశమెక్కువ , విమర్శ తక్కువ.ఆవేశం తరుచూ కలుగుతుంటుంది.మనసు స్థిరంగా , ప్రశాంతంగా ఉన్న సమయాల్లో చక్కగా అన్ని తెలుసుకునే జ్ఞానం కలిగిఉండి సూక్ష్మఅంశాలను కూడా గ్రహిస్తారు.ఇలాంటి సమయాల్లో ఏదేని సభలు ,సమావేశాల్లో మీరు ఉపన్యాసకులుగా ఉంటే ఇంతకుముందు ఎరుగని కొత్త విషయాల గురించి ఆగకుండా అనర్గళంగా మాట్లాడుతారు.వక్చాతుర్యం ఎక్కువ.మిమ్మల్ని నమ్మించడం ,మోసగించడం సులభం,కానీ మీరు ప్రశాంతంగా ఉండగలిగితే ఎదుటివారి మనసులోని భావాల్ని ఇట్టే గ్రహించగలరు.కవులుగా,చిత్రకారులుగా,గాయకులుగా,కల్పన గాధల రచయితలుగా మీరు మీ ప్రజ్ఞను ఉన్నత లోకాలకు తీసుకెళ్ళి,మంచివారిని మైమరిపించగలరు.
మీకు చురకుదనం,కోపం ఎక్కువ,కొంత తీవ్ర స్వభావం ఉంటుంది కాని మొండితనం తక్కువ.మీరు ఎప్పడు ఏదో ఒకటి ఆలోచిస్తూ దేనికోసమో త్వరగా పరుగులు తీస్తూ,ఎవేవో పనులుచేస్తూ తిరుగుతుంటారు. పదిమందిలో కలిసి ఉన్నప్పుడు చిన్నవిషయాల్లో కూడా వారి సలహాలను అడుగుతారు.కాని ఆ సలహాలను ఆచరణలో పెట్టక,మీ నిర్ణయం పైనే ఆధారపడుతారు.మీకు ఒక స్థిరమైన అభిప్రాయముండదు.ఎవరితో కలిసుంటే వారి స్వభావంతో ప్రవర్తిస్తారు.కనుక మీ మేలుకోరు వారైన సింహరాశి వారొకరితో మీ జీవితం ముడిపెట్టుకోవడం మంచిది.అప్పడు మీకు స్థిరత్త్వం,సౌఖ్యం,జయం తప్పకుండా కలుగుతాయి.మీకు జ్ఙాపకశక్తి ఎక్కువ.చిన్నతనం నుండి జరిగిని సన్నివేశాలు,కలిసిన వ్యక్తులు సృష్టంగా జ్ఞాపకం ఉంటారు.మీరు ఏపనిని సొంతంగా సాధించలేరు,కాని మరొకరి ప్రోత్సాహం ఉంటే మాత్రం సాధించలేని పనుండదు.చేసే పనుల్లో మీకు అలసట ఎక్కువ.కుటుంబంలోని వ్యక్తుల పట్ల కూడ క్రమశిక్షణ కాల నిర్ణయం పాటించకపోవడంతో వారితో కూడ గొడవలు వస్తుంటాయి.మీకు నచ్చిన వారికోసం మీరు కాలాన్ని ధనాన్ని,వస్తుసంపదని అన్నింటిని సమర్పిస్తారు.మీకు నష్టం కలుగుతున్నా,శ్రమ అనిపించినా అనారోగ్యము కలిగినా లెక్కచేయకుండా వారికి సహాయము ,సేవ సంరక్షణ చేయగలరు.ఇతరుల బాధ్యతలను కూడ నెత్తిన వేసుకుంటారు.అలాగే మీకు కష్టం కల్గించిన వ్యక్తులమీద కూడ దీర్ఘకాలంగా వేచిచూసి కక్షసాదిస్తారు.
ప్రయాణాలకు సంబంధించిన వృత్తులు మీకు అనుకూలంగా ఉంటాయి.సేవా రంగానికి చెందిన విధ్యా,వైధ్య వృత్తులు మీ ప్రతిభకు అవకాశాలను ఇస్తాయి.వాహనాలు,నౌకలు,విమానాలు రైలుబండ్లు మొదలగు
వాటిలో తిరిగే వృత్తుల్లో మీరు రాణిస్తారు.టూరింగ్ ఏజెంట్లు,టూరిస్టు సంఘ నిర్హాహకులు,మెడికల్ రిప్రసెంటీవ్స్ ,పబ్లిసిటి చేసేవారిగా మీరు నైపుణ్యాన్ని పొందుతారు. ఎగుమతి ,దిగుమతుల వ్యాపారం,ధాన్యం,వస్త్రాలు,తినే పదార్థాలు,పానీయాల వ్యాపారాలు మీకు బాగా కలిసివస్తాయి.ఉద్యోగం కన్నా మీకు వ్యాపారం లాభదాయకం.వైద్యవృత్తి గ్రంధాలు అమ్మడం,ఉప్పు పరిశ్రమ మీకు లాబిస్తాయి.ఇతరుల కార్యాలు నెరవేరుస్తు డబ్బు సంపాదిస్తారు.ఇల్లు వదిలి ఎక్కువ కాలం ఉండలేరు.ఇతర ప్రదేశాలు ఎంత అనుకూలంగా ఉన్నా మీకు విశ్రాంతి లబించదు.మీ జీవిత భాగస్వామి గడుసరి,డబ్బు ఖర్చుపెట్టడంలో జాగ్రత్త కలిగి ఉంటారు.మీకు వివాహం తరువాత శరీరం లావెక్కే అవకాశాలు ఎక్కువ.చిన్నతనంలో జలుబు,దగ్గు,ఊపిరి తిత్తులకు సంబంధించిన బాధలు ఉంటాయి.పెద్దయ్యాక అలసట,ఆయాసం,శ్వాసకోశ వ్యాధులు,వృద్ధాప్యంలో మధుమేహం,రక్తపోటు,కడుపు ,జీర్ణకోశం,లివర్,మూత్రపిండాల వ్యాధులు,ఒంటికి నీరు పట్టుట లాంటివి ఏర్పడుతాయి.మత్తు పదార్థాలకు,ఇతర చెడు అలవాట్లకు గురిఐతే జీవితాంతం వాటిని వదులలేరు.అటువంటి అలవాట్లు ఉన్నకూడ వాటిని బయటకు తెలియనివ్వకుండా ఉంచుతారు.ఆహారం ,పానీయాలలో నియమం,పరిమితి మీకు చాలా అవసరం.మనసులో దిగులు పడినప్పుడల్లా మీ ఆరోగ్యం పాడయిపోతుంది.
మీకు లలిత కళల్లో మంచి ప్రావీణ్యం ఉంటుంది.గృహాలంకరణ,గృహోపకరణాల సేకరణ,మీ నైపుణ్యానికి ఉదాహరణ.సంగీతమభ్యసించిన,మీ కంఠధ్వనిలో భక్తి,పారవశ్యం, హృదయ ధృవీకరణ శక్తి కలుగును.మీరు యోగాభ్యాసం, మంత్రోపాసన చేస్తే పలితాలు త్వరగా లభిస్తాయి.జ్యోతిర్విద్య అభ్యసించడం,ధ్యానం మీకు మంచిది మీకు భక్తి యోగ సాధన సులభం.ఆత్మ సమర్పణ మార్గాన పరమ గురువులలో ఒకరికి జీవితమర్పించుకొనుట,వారితో సూక్ష శరీర సంబంధాలు,విచిత్రానుభూతులు,పరలోకాల దర్శనం కలుగవచ్చును.యోగ మార్గంలో వెళితే గురువులను మార్చవద్దు.

మిధున రాశిలో జన్మించిన వారి జాతకం.

మీరు మిధున రాశిలో జన్మించారు.
http://ramthamedia.in/ అనేక రకాల మనస్తత్త్వాలతో ,విభిన్నరకాల మనషులతో మీరు కొత్త పాత తేడా లేకుండా కలిసిపోగలరు.ఇతరులను అర్థంచేసుకోవడంలో ,మంచి చెడ్డలను విమర్శించడంలో మీకు మీరే సాటి.కానీ మీరు ఆ సామర్ధ్యాన్ని దురపయోగం చేసకుంటూ ఇతరుల మంచి చెడ్డలను ఆలోచించడం మొదలుపెడుతుంటే మాత్రం మీ జీవితం వ్యర్థం అవుతుంది.మీ పరిశీలన సూక్ష్మంగా ఉంటుంది.కాని మీ అభిప్రాయాలు అస్థిరంగా ఉంటాయి.ఎదుటివాళ్ళను బట్టి మీ స్వభావం మార్చి ప్రవర్తించడం మీకు వెన్నతో పెట్టిన విద్య.ఇతరులతోని ఇచ్చిపుచ్చుకోవడం,మీకు లాబసాటిగా ఉండేలా చేసుకోవడంలో మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు.భిన్న మనస్థత్త్వాలు కల ఇద్దరు వ్యక్తులను ఒక దారికి తీసుకురావడం , అట్లే ఒకే దారిపై నడిచే ిద్దరిని వేరుచేయుట కూడా మీరు చేయగలరు.మీలో సంకలప్ప శక్తి లోపిస్తే చేసే పనిలో అనుమానితులై,కార్యాచరణలో పిరికితనం,ఒక నిర్ణయానికిరాలేకపోవడం లాంటి బలహీనతలు ఏర్పడుతాయి.మంచి మేథా శక్తి,తెలివితేటలు ఉంటాయి.పనులు పూర్తికావడంలో పనులు పూర్తికావడంలో అనేక సులభమార్గాలు వెనువెంటనే తడుతుంటాయి.ఇతరుల లోపాలను పసికట్టడం,సరిదిద్దడం మకీు జన్మతా:వచ్చిన శక్తులైనా మీరు ఆ మార్గంలో పోకుండా శాస్త్రసాంకేతిక రంగాల్లో కొత్తవిషయాలను కనుగొనడానికి కృషిచేస్తే మీ జీవితం స్వార్థకం అవుతుంది.పొగడ్తలకు లొంగిపోయి,పొగిడినవారికి మీ స్వంత పనులు కూడా మనుకుని ఎంతటి పనులనైనా చేసి పెడుతారు.దాంతో మీ ఇంట్లో సహజంగానే మీ పట్ల విమర్షలు వస్తాయి.ఆ విమర్షలను మీ మంచికోసం చెప్పినవిగా తీసుకోకుండా, ఇతరులకు సహాయం చేయడమే నేరమా అనే ఆలోచనా దొరణితో మీ ఇంట్లోవారిమీద మీరు కోపతాపాలు పెంచుకోంటారు.ఇంట్లో వారికంటే బయటి వారికే మీరు అధిక ప్రాముఖ్యం ఇవ్వడంతో మీకు మీ కుటుంబ సభ్యులకు మద్యన దూరాలు పెరుగుతాయి. ప్రేమ,త్యాగం,సేవ ,ఆనందం లాంటి వాటికి మీరు ఎక్కువ విలువ ఇస్తారు.కాలాన్ని ధనాన్ని ,వ్యక్తుల సామర్ధ్యాల్ని మీరు అర్థవంతంతా ఉపయోగించుకుంటారు.పథకాలను అల్లడంలో మీకున్న నేర్పు కార్యాచరణలో ఉండదు.ఇతరులకు సలహాలిస్తారు కాని మీరు ఆచరించలేరు.మీకు సహజంగా సలహాలు ఇవ్వడంలో ,ఇతరుల లోపాలను పసిగట్టడంలో ఉన్ననేర్పు మీరు స్వంతంగా పనిచేయడంలో ఉండదు.మీకు కొంచెం బద్దకం ఎక్కువ.ఉత్సాహంతో ఒకేసారి పదిరకాల పనులను మొదలుపెట్టి అతి ముఖ్యమైన వాటిని వాయిదా వేస్ారు.వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడంలో మీకు విశ్వాసం ఎక్కువ.సంఘంలో మీ హోదా,పరువు ప్రతిష్ట నిరంతరం నిలుపుకోవడానికి తాపత్రాయ పడుతారు.ధాంతో మీ అర్ధిక స్థితి బాగలేకపోయిన ఇతరుల దృష్టలో పలుచన కాకుండా అనవసర ఖర్చుల పెట్టడం జరుగుతాయి.మీకు రూపాయి లేని రోజున నిజంగానే ఇతరులు వచ్చి ఆదుకుంటారా అని లోతుగా ఆలోచించిన రోజున ఈ అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు.ఇతరులను నమ్మి వారికి ఏపనిని అప్పగించలేరు.ఈ విషయంవారిలో అసంతృప్తికి కారణమై ఇతరుల్లో విసుగుదలకు కారణమవుతుంది.మనస్సులో మీరు ఏమి ఉహిస్తారో సరిగ్గా అదే విషయాన్ని ఇతరలుకు తెలియచేయలేరు.ఇతరులకు మీ గుట్టు తెలియనీయక,వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియేగం చేస్తారు.ఇతరలును నమ్మించి మంచి మార్గాన శిక్షణ ఇస్తూ మీరు మాత్రం చిరుకాలం ఎవవ్రిని నమ్మకుండా జీవిస్తారు.ఇరుపక్షాల మధ్య వ్యవహరాలు చక్కదిద్దడంలో జయప్రదంగా వ్వవహరిస్తారు.వృత్తుల్లో మార్పులు మీకు లాభం చేకూరుస్తాయి.న్యాయవాద వృత్తి ,వార్తా ప్రసారం ,పోస్టు,కొరియర్,డెలివరి శాఖలు,టైపు,షార్టుహాండ్ ,ప్రిటింగ్ ప్రెస్ లు, మొదలైన వృత్తుల్లో చక్కగా రాణిస్తారు.గ్రంధరచన,అనువాదం ,పత్రికల్లో రచనలు చేయడంలో మీరు నైపుణ్యం ఉంటుంది.సాహిత్యం ,గణితం ,లెక్కలుకట్టడం,కొలతలకు సంబంధించిన వృత్తుల్లోకూడా మీరు రాణిస్తారు.ధనార్జనకు కావల్సిన తెలివితేటలుంటాయి కాని తెలివితేటలు ఉన్నంత స్థాయిలోధనార్జన ఉండదు.దానికి మీ విమర్శనాత్మక మాటలే కారణం.డబ్బును గూర్చి అసంతృప్తి,భవిష్యత్తును గురిచంిన భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. మీరు పెళ్ళికి ప్రణయానికి కూడా ఒక ప్రయోజనం ఆలోచిస్తారు.దాంతో వివాహా సందర్భంగా మోసపోయే అవకాశం ఎక్కువ.ప్రేమ వివాహం మీకు కలిసిరాదు..మీరు జాగ్రత్తగా ఉంటే వివాహంతో పాటు డబ్బుగాని , ఆస్తిగాని, ఉద్యోగ వ్యాపారాది లాబాలు కానీ కలుగును.మిమ్మల్ని అభిమానించే జీవిత భాగస్వామి మీకు లబిస్తారు.ఐనా కూడా వారిని సందేహించుట,విమర్షించుట ఉంటాయి.జీవితంలో మీకు నిజమైన సుఖశాంతులు లభించాలంటే ఒకరిని నమ్మి వారికి మీ హృదయాన్ని అంకితం చేయాలి.మీకు అనారోగ్యాలు తరుచు కల్గుతాయి.ఎక్కువ శ్రమ చేయడం వలన నరాల బలహీనత కలుగవచ్చును.అనవసరమైన విషాయల గురించి ఎక్కవగా ఆలోచించడం వల్ల మానసి వ్యధ ,నిద్ర పట్టకపోవుట కలుగ వచ్చును.ముసలితనంలో మనస్సు పట్టు తప్పడం,చిరాకు,కారణం లేకుండా కోపం , మీలో మీరు మాట్లాడుకోవడం,వణుకు,పార్కిన్సన్ వ్యాధలు,నరములు వాతం,కడుపులో పైత్య ప్రకోపం,జీర్ణాశయమున ఉంటాయి. మంచి నిద్రకలిగి ,మనస్సులో సంతృప్తి ,ఇతరులను ఆలోచించడం మానితే మీ ఆరోగ్యానికి ఏ లోపం ఉండదు.

వృషభ రాశిలో జన్మించిన వారి జాతకం

మీరు వృషభ రాశిలో జన్మించారు.
http://ramthamedia.in/ స్థిరత్వం, ఆనందం,వాత్సల్యం, ధృడత్వం, అచంచలమైన నిశ్చయత్వం మీకు మూల సూత్రాలు.మీరు ఏ పని చేసిన నిదానంగా ఎంతో ఆలోచించి ప్రణాళిక బద్దంగా చేస్తారు.ఒక సారి నిర్ణయం తీసుకుంటే మార్చలేరు.మీ విశ్వాసాలు,అభిప్రాయాలు,ఇతరులతో సంబంధ బాంధవ్యాలు స్థిరంగా ఉంటాయి.మీరు దయ,దానగుణం, క్షమాగుణం కలవారు.మిమ్మల్ని ఎవ్వరైనా విశ్వసించి , మీపై పూర్తిగా ఆధార పడవచ్చు.నచ్చిన వ్యక్తుల అపరాధాలను క్షమించగలరు గాని,నచ్చని వారిని క్షమించలేరు.మీ అభిప్రాయాలను మార్చుట ఎవ్వరికి సాధ్యము కాదు.అనందంగా జీవించుట మీ స్వభావము.మీరు ఇంటిని తీర్చిదిద్దుకొనుట,మంచి బట్టలు దరించుట,శుచియైన అహారం తినుటలో మీ అభిరుచని గమనించింవచ్చును.అందమైన,కళాత్మకమైన వస్తువులు సేకరించడంలో ెక్కువ కాలాన్ని ఖర్చుచేస్తారు.సంగీతం,కవిత్వం,చిత్రలేఖనం మీ అభిమన కళలు.అలసట లేకుండా ఓర్సుతో కష్టపడి పనిచేయుట మీ జీవ లక్షణం.ముంుదు మీ పనులు , మీ కుటుంబ పనులే చూసుకునే స్వార్ధం మీకు కాస్తా ఎక్కువగా ఉంటుంది.సాధారణంగా మీరు సహనం కోల్పోరు.మీ సహనాన్ని ఎవరైనా పరీక్షీస్తే మాత్రం అంతే తీవ్రంగా ప్రవర్తిస్తారు.మీకు కోపం తెప్పించడం ఎంత కష్టమో , వచ్చిన కోపమును తగ్గించుట కూడ అంతే కష్టం.దృఢమైన మీ నిర్ణయాలు మొండి పట్టుదలగా మారకుండా మీరు జాగ్రత్తపడాలి.మీరు ప్రేమవ్యవహారాలలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మలవుతారు.శారీరక శిక్షణ ,ఆటలు మీకు అవసరం,ఇష్టమైనవి కూడా.ఎంతటి ఘన విజయమైనా మీకు సహజంగా రావలిసిందిగానే మీకు కన్పిస్తుంది.మీరు పొగడ్తలకు లొంగరు.చేసే పనుల్లో మీకు తొందరపాటు ఉండదు.మీరు జీవితంలో తీసుకునే దృడమైన నిర్ణయాలను కాలానుగుణంగా సవరించుకోవాలి.లేదంటే తెలుగు సినిమాల్లో తరాలు గడిచిన మారని కొందరు విలన్ల మాదిరిగా మీరు పేరు పోందుతారు.ఎటువంటి కష్టానైనా తట్టుకుని నిలబడుతారు.అతికోపం గాని సంతోషంకాని మీ మొహంలో కనపడవు.
మీరు వ్యతిరేక లింగ సభ్యుల సాంగత్యమందు అభిలాష చూపినా,అవికేవలం శారీరకంగా కాక మానసికంగా ,భావనా రూపకంగా ఉంటాయి. మీరు మీ వ్యతిరేక లింగ సభ్యలతో కాలము గడిపితే మీలోని కళాత్మక విలువలన్ని మీ పతనానికి కారణాలై వర్తిస్తాయి.మీరు ఈర్ష,అనుమానం,క్రూరత్వం కలవారు.జీవిత భాగస్వాములను అనుమానించి హింసించు స్వభావం కలవారు.శారీరక వాంచలను మీరు నిగ్రహించుకోగలిగితే మీలోని ప్రకృతి శక్తి వికసించి సంగీతం ,చిత్రకళ,కవిత్వం మొదలగు ఉత్తమ మార్గాల ద్వార ప్రకాశించును. మీ మార్గంలో అవరోధాలు మిమ్మల్ని ఆపలేవు.మీరు సాంఘీక కార్యక్రకమాలలో బాగా రాణిస్తారు. పోటోగ్రఫి,చిత్రలేఖనం, ఫోటోలను సేకరించడం మొదలైన వాటిమీద మీకు ఆసక్తి బాగా ఉంటుంది.వకృత్త్వం,న్యాయవాద వృత్తి ,బోధన,నాటక రంగం,వ్యవసాయం,నీటి వనరులు,నగర నిర్మాణ మొదలైన రంగాల్లో మీరు బాగా రాణిస్తారు. క్రమ బద్ధంగా చేయాల్సిన పనుల్లో మీరు మంచి నేర్పును చూపిస్తారు.డబ్బు విషయంలో మీరు అదృష్ట వంతులు.దత్తత,వివాహము,స్నేహం,మొదలైన వాటి వలన మీకు ధనం వచ్చును.విలాసాలకు మీరు డబ్బు విపరీతంగా ఖర్చుచేస్తారు.మీరు పెద్ద వ్యాపారములోగాని,స్పెక్యులేషన్లో గాని నష్టపోయే అవకాశం ఉంది.
మీకు చక్కని శరీర నిర్మాణం,మంచి ప్రాణ శక్తి ఉంటాయి.మీరు ఆరోగ్యవిషయాల్లోమాత్రం చిన్న వయస్సునుండి జాగ్రత్త పడాలి. జాగ్రత్త తీసకుంటే మాత్రం మిగిలిన వారికన్నా చక్కని ఆరోగ్యాన్ని ఎక్కువకాలం నిలుపుకుంటారు.ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ,నిద్రాహారాల మీద శ్రద్ద చూపకపోవడంతో మీ ఆరోగ్యం క్రమంగా క్షిణించే అవకాశం ఉంది.మీకు ఊపిరితిత్తుల ,శ్వాస అవయవములకు సంబంధించిన ధీర్ఘవ్యాధులు వచ్చే అవకాశం కలదు.మీలో మంచి కార్య దీక్ష ఉంటుంది,వేసిన పథకలకు కార్యరూం ఇవ్వడంలో మీరు సమర్థులు.
మీరు చాలా తెలివిగా మాట్లాడుతారు.మంచి ఆఫీసరు పోస్టుకు ఎదుగుతారు. మీ సొంతవావానం కన్నా ప్రభుత్వ వాహనాన్ని ఎక్కువ అనుభవిస్తారు.తండ్రి సంపాదనను అనందిస్తారు.

26 మార్చి, 2009

మేష రాశిలో జన్మించిన వారి జాతకం.

మీరు మేషరాశిలో జన్మించారు.
Visit our website http://ramthamedia.in/ మీ శరీరము చాలా శక్తి వంతమైంది.మీరు దేహదారుఢ్య వృత్తులకు చక్కగా సరిపోతారు.కాని మీరు చేసే పనుల్లో మితిమీరిన వేగం,ముందస్తు ఆలోచనలు లేకుండానే పనులు మొదలు పెట్టడం ఉంటాయి.దాంతో సహజంగానే ఏ పనైనా సరైన ప్రణాళిక లేకుండా మొదలు పెట్టినపుడు ఏంజరుగాలో అది జరిగి, మీపనులు సగంలో ఆగిపోతాయి.దీర్ఘకాలికంగా ఎంతో ముందు ప్రణాళికతో చేసే పనుల విషయంలో మీరు అపజయం పాలైన,వెంటనే పూర్తయ్యే పనుల విషయంలో మీ నైపుణ్యం కనపడుతుంది.నిరంతరం తిరుగుతూ పదిమందిని వెంటేసుకుని చేసే పనుల్లో మీరు ఉత్సాహంగా ఉండి వారికి నాయకత్వం వహించాలని మీకు ఉంటుంది.పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం మీకు సులభంగా అబ్బుతుంది.చక్కటి సంభాషణా చాతుర్యం ,వాగ్దాటితో పెద్దఎత్తున కార్యాలు సాధించగలరు.మీరు చెప్పింది విని మీ వెంట వచ్చే అనుఛరులు మీతో ఉంటారు.మీరు పొగడ్తలకు పొంగిపోతారు.ఎవరితోనైనా తొందరగా కలిసి పోతారు.అంతే త్వరగా విడిపోతారు.స్నేహాలు ఎక్కువగా ఉంటాయి,కాని అంది అనవసర వ్యక్తులతో ఉంటుంది.ఇతరులపై ఉంటే అతిగా ప్రేమాభిమానాలు,లేకుంటే అసలు ఉండవు.మీకు ఓపిక తక్కువ కావడంతో మీరు సంఘంలో క్రమశిక్షణ లేనివారుగా పేరుపొందుతారు.పాపగ్రహ వీక్షణ ఉంటే నిరంతరం గొడవలకై సై అంటూ మొరటుగా ఉంటారు.మీరు ధృడమైన మనస్తత్వం కలవారు.ఏదైనా పట్టుపడితే అది పూర్తయ్యేవరకు దానివెంటపడే నిశ్చయశక్తి ,సాహాసం కలవారు.ఇన్ని మంచి లక్షణాలున్న,కొద్దిగా మూర్కత్త్వం,అంటే మీరు నమ్మందే నిజమనే ఆలోచనతో ఉంటారు.ఆవేశంగా ప్రవర్తించడం,వెనకాముందు ఆలోచించకుండా పనుల్లో దూసకుపోవడమే కాని,ఆయా పనుల్లో ఆలోచించడం కాస్త తక్కువ.కాని మీరు ఏ పని చేయడానికైనా సాహసంతో పదిమందిని కూడబెట్టకుని నాయకత్త్వం వహిస్తు ఉండగలరు.పనులు చేయడంలో మీరు ఎంతటి కఠిన శ్రమ,త్యాగలకైన ముందుంటారు.
మీరు స్వతంత్ర అభిప్రాయాలు కలవారు.మీ స్వాతంత్రానికి ఎవరైన అడ్డువస్తే ఆపనిని పూర్తిగా వదిలివేస్తారు.మిమ్మల్ని స్వతంత్రంగా వదిలితే మాత్రం నిర్దుష్టమైన పథకాలతో దేన్నైనా సాధిస్తారు.అలాంటి గెలుపు మీలో అహంకారం,నిర్లక్ష్యం,మూర్ఖత్వాన్ని పెంచి మీ పతనానికి కారణం అవుతుంది.దీనికి తోడు మీరు పొగడ్తలకు లొంగిపోవు స్వభావం కలవారు.మిమ్మల్ని కన్యారాశిలో జన్మించిన వారు సులభంగా తమ మాటలతో పడగొడుతారు.ఈ విషయంలో శ్రద్ధ వహించకుంటే మీకు పతనం తప్పదు.మీలో ఎప్పుడు కొత్త ఉత్సాహం తొణికిసలాడుతూ,సృజనాత్మకమైన పథకాలకు ఆలోచనలు చేస్తుంటారు.ఇతరుల ప్రవర్తనకు తగ్గట్లుగా ప్రవర్తించే లౌక్యం మీకు లేకపోవడం వలన కన్యారాశి వారు మిమ్మల్ని అతి సులభంగా మోసగించగలరు.మీరు కార్యవాదులు,ఆలోచించడం మీకు పడదు.మనసులో తట్టిన ఏ భావంనైనా కార్యరూపం పెట్టనిదే విడిచిపెట్టరు..ఇతరులను క్రమశిక్షణలో పెట్టడంలో మీరు ఎంతో కఠినంగా ఉంటారు.దీంతో మీ క్రింద పనిచేసే వారు మీ పట్ల భయంతో ప్రవర్తిస్తారే కాని నిజమైన అభిమానంతో ప్రవర్తించరు.కుటుంబంలోకూడా ఇట్లే ప్రవర్తించడం వలన మీ పిల్లలు మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని ఎదురిస్తారు.నాయకత్త్వం వహించటం,ఇతరులను నడిపించుట మీ జీవలక్షణాలు,మీ హృదయం దయామయం.ఎవరిమీదైనా వివరీతమైన ప్రేమ లేక విపరీతమైన కోపం ఉండునే గాని మధ్యేమార్గం ఉవడదు.ఇతరులనుఎంత గాఢంగా ప్రేమిస్తారో,వాళ్ళు మీ పట్ల అంత ప్రేమ చూపకపోతే మాత్రం అదే స్థాయిలో మీరు బాధపడుతారు.దీని వలన మీరు అనారోగ్యానికి మానసికఆందోళనకు గురిఅవుతారు.ఏవైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు ఆలోచనకాక ఆవశమే ప్రధానపాత్ర వహిస్తుంది.దీని వలన అనేక అపజయాలుఎదుర్కోవలసి వస్తుంది.మీరు నాస్తికులు కాకపోయినా చాందసత్వము ,పాత ఆచారాలు మీకు గిట్టవు.శారీరకంగా ,మానసికంగా శక్తివంతులు,ఉత్సాహవంతులు అగుటవలన నిరంతరం మీకు మీ వ్యతిరేక లింగ సభ్యుల సాంగత్యము అవసరమగును.దీంతో వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో మీరు కీలు బొమ్మలగుదురు.యవ్వనంలో వ్యతిరేక లింగ సభ్యులను అర్థంచేసుకోవడంలో పొరపడి మోసపోతార.ప్రమ వివాహాలు మీకు మంచిదిగాదు.వృద్ధాప్యంలో కూడా మీకన్నా చాలా చిన్నవయసుగల వారి వ్యామోహములో పడి జీవితమున పెద్దమార్పును తెచ్చుకుంటారు.వ్యతిరేక లింగ సభ్యుల విషయంలో నియమం,క్రమశిక్షణతో ప్రవర్తించకపోతే అనేక మంచి అవకాశాలను పోగొట్టుకొంటారు.
ఖనిజాలు,వస్తుసామాగ్రి ,శస్ర్ర్తచికిత్సా పరికరాలు మొదలలగు వ్యాపారాలు మీకు లాభిస్తాయి.రాజకీయాలందు సమర్ధులై వ్యవహరించగలరు.మీ తెలివి తేటలు మీకు శతృవులను ఏర్పరిచి వారితో ప్రాణహాణి కూడా కలిగించవచ్చును.క్రీడలలో కూడా మీరు బాగా రాణిస్తారు.వివాహ జీవితంలో క్రమశిక్షణ అవసరం ఆవేశంలో మీరు తీసుకునే నిర్ణయాల వలన జీవితాంతం మీరు జీవితాంతం బాధపడే అవకాశాలు ఉంటాయి.చిన్నవయస్సులోనే వివాహంకానిచో వ్యాయామం మొదలైన వాటిల్లో దేహశక్తిని వృద్ధి చేసుకుని మీరు వయసు మీదపడిన తరువాత మీ జివిత భాగస్వామితో వ్యామోహంతో ప్రవర్తించడం జరుగవచ్చును.మీ ఆందోళన ,ఆవేశం మీకు అసహనాన్ని,అనారోగ్యాన్ని సృష్టించవచ్చును.వయసు దాటిన తరువాత రక్తపోటు,రక్తనాళములు బ్రద్ధలవుట,మెదడుకు సంబందించిన పక్షపాతం కలుగవచ్చును.శస్త్రచికిత్స మీకు అవసరంపడవచ్చు.సహనము ,ఓర్పు ,వినయం,లౌకిక జ్ఞానం మీరు అలవాటుచేసుకుంటే మీకు జీవితంలో అపజయం అనేదే ఉండదు.

25 మార్చి, 2009

ఈ సృష్టి నిర్మాణం ఎలా జరిగింది?

మాష్టర్ సి.వి.వి. భ్రిక్త రహిత తారక రాజయోగం

ఆది బ్రహ్మ తత్వంలో ఘనీభవించిన శీతలత్వం ఉంది.దానిలోనే సర్వ పూర్ణతత్వములు గుప్తంగా ఉండును.వాటినే ‘‘హిడ్డెన్స్’’అనవచ్చును. ఈ హిడ్డెన్ లో ఏర్పడ్డ ఒక స్థితిని ‘‘హింట్’’ అనగా ఒక సూచన.ఈ హిడెన్స్ ఎక్కడి నుండి పనిచేస్తున్నదో దానిని ‘‘పిట్యూటరి’’ అన్నారు.ఈ పిట్యుటరి అనేది బ్రహ్మండముల సృష్టి జరుగుతున్న స్థలం లేదా బ్రహ్మీ స్థితి.ఈ సృష్టి యావత్తు బిందువులో ప్రారంభమూ నిలిచినది.ప్రతి అండములో ఆకాశము కలదు. ఆకాశము అంటే స్పేస్.అది సంకోచ వ్యాకోచముల వలన
కలుగుతుంది.అతి చిన్నదైన స్థితిలో అది శ్వాన్ , పూర్ణ విస్తరణ తరువాత అదే బ్రహ్మండములక విరాటు రూపము అగుచున్నది.ఈ సంకోచ , వ్యాకోచముల వలన శ్వాస ఏర్పడుతుంది.ఆదితత్వం నుండి ఈ శ్వాస లోకాలోకాలకు బహిర్గతమైనప్పడు నిశ్వాసము అవుతుంది.ఉచ్చాస్వము ద్వార అంతర్గతమైనప్పడు గుప్తం అవుతుంది.ఈ ఉచ్చ్వాస్వ ,నిశ్వాసములో ఉన్నదే ప్రాణము.ఇదియే సృష్టికి ఆధారము.అనంత ప్రాణము విస్తరించి బహిర్గతమై లోకాలోకములను సృష్టిస్తుంది.ఈ ప్రాణమునకు మూల స్థానము ఆది బ్రహ్మ తత్త్వమే.
ఆ బ్రహ్మతత్త్వమే అనేక లోకాల నిండా అనేక రూపాల్లో ,దేహాల్లో పనిచేయుచున్నది.మాష్టరు గారు మొదట చేసిన ప్రయోగాల్లో ప్రయత్నించి సపలమైంది ఈ ప్రాణ విషయంలోనే.
ఒక చతుర్ముఖ బ్రహ్మ సంకల్పం వలన ఈ సృష్టి యేర్పడింది.ఈ సృష్టి గ్రహాలు,నక్షత్రాలు,పితృదేవ మరియు దేవ వర్గాలపైన అదారపడి ఉంది.వీరిలో వేటికి పరిపూర్ణత్వం లేనందువలన ఈ సృష్టికి పరిపూర్ణత రాలేదు.ఈ చతర్ముఖ బ్రహ్మకూడ మహా పకృతిలోని భాగమే.మార్పు అనేదే లయము.మార్పు అనేదే పున: సృష్టి.మార్పు అనేదే లోకాలోకాలకు,కాల ప్రమాణమునకు కారణం.ఆది స్థితిలో ఉన్న పూర్ణత్త్వం మనకు సంక్రమించడంలేదు. ఈ సృష్టికి మూలమైన కేంద్రస్థానం ఆదిశక్తి.కాని అది బ్రహ్మకాదు. ఆదిశక్తికి మూలం ఆదిబ్రహ్మ తత్వం. సృష్టిలో పూర్ణత్వం రావాలంటే ఆదిశక్తి(పకృతి)నుండి కాక
ఆది బ్రహ్మతత్త్వం(పురుష)కు మూల కేంద్రం మారాలి.
సృష్టి ఏర్పాటు : 1)ఇక్కల్డ్ -పరమ శీతలమైన ఘన స్థితి (2) అక్కల్డ్ -వేడి-దీంతో శీతల ఘన స్థితి నుండి ద్రవరూపంలోకి మారుతుంది (3) గ్యాస్ ఏయిర్ -అలా ద్రవమైంది వాయురూపంలో నిలుస్తుంది(4) స్పిరిట్ -అనంత వాయుతత్వం నుండి ఖండికలై,త్రుంపులై ఒక పరిమిత విస్తిర్ణం కల్గిన స్పిరిట్ అవుతుంది.
(5) బిందు(స్పిరిట్ సంకోచ స్థితిలో బిందువు అవుతుంది (6) అణువు -ఈ బిందువు ఘనిభవించి ఆరవ స్థితి అగు అణువు అగుచున్నది.(7) పరమాణువు - ఈ అణువు బద్దలై ఏడవ స్థిత ఐన అనేక పరమాణువులు అగుచున్నది.(8) జీవ- ఈ పరమాణువులు ఇంకా సూక్షములై ప్రాణస్థితిని పొంది ఎనిమిదవ స్థితి అగు జీవులు అగుచున్నవి.
ఆది బ్రహ్మ స్థితినుండి బయలుదేరింది ఆది ప్రకృతిస్థితిలోకి రావడం ప్రథమ సృష్టి.ఇది వరుసగా
1)ప్రవేశ , 2) వ్యాపక 3) గతి 4) కిరణ 5) ఆరోగ్య 6) భ్రిక్త 7) రహిత అను ఏడు స్థితుల్లో జరిగింది.సృష్టి ఒకసారిగా
ఏర్పడలేదు.ఈ అనంత తత్త్వంను ఒక అనంతమైన స్పేస్ గా తీసుకుంట అటువంటి అనంతములు ఆదిలో అనంతంగా కలవు.ఈ చర్య కాల ప్రమాణికానికి అందేది కాదు.కాలము అనేది స్థలం తోనే ఎర్పడ్డది.అంటే స్పేస్,టైమ్ రెండు ఒకేసారి ఏర్పడ్డవి.ఆది బ్రహ్మ తత్త్వం నుండి సగుణ బ్రహ్మతత్వానికి (భౌతిక ప్రపంచం) వచ్చులోపల ఒక ఖాళి ఏర్పడి ఈ సృష్టికి ఆ ఆదికి మద్యన ఒక అడ్డం లేదా ఒక కందకంగా యేర్పడింది.దీనినే నిర్గుణము అన్నారు.ఈ సృష్టిలో ఏది కూడ నిర్గుణమును దాటిలేదు.అందుకే ఆదినుండి వచ్చిన మాష్టరు గారు ఆది బ్రహ్మతత్త్వంలో ఒక కేంద్రంను నిర్మించి అక్కడి నుండి నిర్గుణ తత్త్వంకు ఒక వంతెనను నిర్మించినారు.
మనం చూస్తున్న గ్రహములు,నక్షత్రాలు,అన్ని ఒక అండములో వున్నవి.ప్రతి అండములో కూడ ఒక చతురస్రము కలదు.వ్యాసంకు పైన ఒక త్రిభుజము,కింద ఒక త్రిభుజము కలిసి చతురస్రము అవుతుంది.పైనుంచి కింది వరకు 14 లెవల్స్ ఏర్పడగా క్రింద ఉన్న ఏడులోకములలో 6వదగు బుద్దిక్ లెవల్ నుండి ఈ సృష్టి జరుగుచున్నది.దీన్నంతా ఒక వృత్తంలో అమరిస్తే మనకు కొంత అవగాహన ఏర్పడుతుంది.పైనుండి కిందివరకు ఇటువంటి వృత్తములు 100 వరకు ఉన్నాయి. ప్రతి వృత్తంలో చతురస్రంల కలదు.దీనినే విరాట్ అంటారు. ప్రస్తుత సృష్టి అంతా ఒక మహావిశ్వంలోని 6వ విరాట్ లో బుద్దిక్ లెవల్ లో జరుగుచున్నది.ప్రస్థుత సృష్టికి మూలము ఫ్రణవము.అనగా ‘‘ఓం’’.ఈ బుద్దిక్ లెవల్ లోని విరాటులన్నింటిలో సృష్టి పూర్తయినచో బుద్దిక్ లెవల్ పూర్తి అవుతుంది.ఆతరువాత మెంటల్ లెవల్లో సృష్టి ప్రారంభం అవుతుంది.ఇటువంటి మహా విశ్వములు ఇప్పటికి 84 జరిగినవి.ఈ 84 మహా విశ్వముల అధిపతులను బ్రహ్మలు అనవచ్చును.ఇపుడు వారందరు వారికై ఏర్పరిచిన స్థానాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇలాగే ఈ మహా విశ్వములన్ని కుండలినీలుగా కూడా చెప్పబడ్డాయి.ప్రస్తుత సృష్టి నాల్గవది.దీనికి పూర్వం ధాతు,వృక్ష,జంతు వర్గములు ఏర్పడినవి.ప్రతి పరమాణువుకు ప్రథమ దశ ఒక బిందువు అని అనుకొంటె దానికి కేంద్రము ,పరిధి రెండు వుండును.ఈ బిందువును నిలువుగను ,అడ్డంగాను విభజిస్తే అది నాలగు భాగములగుచున్నది.మొదటి భాగము యొక్క ప్రధమ స్థితిలో ఏం ఉండదు.కాని అది కూడ ఒక సూక్ష్మ బిందు స్థితియే.బిందువు వెంట బిందువు పరిదిరేఖలో పయనించిన తిరిగి ప్రధమస్థితికి చేరదు.ఎందుకంటే బిందువు దానికి వృత్తాకారము ఇచ్చిఉన్నది.ఆ ప్రథమ బిందువును లేక పాయింటును ఆ పరిధిలేని చివరి పాయింటును తాకుచూ పోవునే కాని దానిలోనికి జోరబడలేదు.కనుక అక్కడ్నుండి ఆ చివరి బిందువు టాన్జెంటుగా పైకిపోవునే కాని ఈ పాయింటునుగాని,దాని కేంద్రమునుగాని చేరలేదు.ఆ రెండు పాయింట్లు కలిసిన చోట మనము సత్యం అనే దానికి వూహించిన , ఆ సత్యము టాన్ జెంట్ గా పోయి మోషన్ అనగా చలనమును యేర్పురుచునుగాని మరోరకంగా కాదు.ఆ పాయింటు దగ్గర యేర్పడిన చలనమును ట్రూత్ మోషన్ అందురు.ఈ చలనము ఈథరులో జరుగుచున్నది.ఇది ఈధర్ ను చీల్చుకునిలైనుగాపోతుంది.పోను పోను ఈ చలనములో సత్యం తగ్గిపోయి మాయగా మారతున్నది.అందుకే ఆది బ్రహ్మతత్త్వంనుండి విడిపడిందేది తిరిగి ఆ స్థానము చేరలేదు.ప్రకృతిలో భాగముగనే వుండిపోయింది.

24 మార్చి, 2009

శ్రీ రమణ మహర్షి భోధన .... ( నేనెవరు మీద ధ్యాసపెట్టి నీవెవరో తెలుసుకో ..సమస్తం తెలుస్తుంది)

please visit our website . http://ramthamedia.in/ నిత్యజీవితంలో మనుష్యలు నిరంతరం ఏవో కొన్ని ప్లాన్లు వేస్తూనే ఉంటారు.వాస్తవానికి భగవంతుడు ఒక ప్లాను ప్రకారమే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు.మనుషులు నిరంతరం ప్లాన్లువేయడం రైలులో ప్రయాణించే ప్రయాణికుడు తన లగేజిని నెత్తిన పెట్టకుని మోయడంలాంటిది.మనుష్యలు ప్లాన్లు వేయడం మాని భగవంతుడికి పరిపూర్ణ శరాణగతి చెందడమే ఉత్తమమైన ప్లాను.నీవు పరిపూర్ణ శరణాగతి చెందిన నాడు నీకు ఏది మంచిదో భగవంతుడికి సరిగ్గా తెలుసు.మీరే బాధ్యతలు పెట్టుకోకండి.అఖిలాండ కోటిని కనిపెట్టే భగవంతుడు పరిపూర్ణ శరణు చెందిన మిమ్మల్ని మర్చిపోతాడా?కష్టాలు తొలిగిపోవాడానికి రోజులా ,సంవత్సరాల,జన్మలా అని మాత్రం ఎదురుచూడవద్దు.భగవంతుడు మిమ్మల్ని చూడడం అంటే ధనికునిగా చేయడంగా మీరు ఆలోచిస్తున్నట్లయితే మీలో అహంకారం ఇంకా బుసలు కొడుతున్నదనే అర్థం. భగవంతడు ప్రతి ఒక్కరిని కనిపెడుతూనే ఉన్నాడు.నీకేది అవసరమో అది ఆయన ఇస్తూనే ఉంటాడు. శరణాగతి రెండింటిమీద ఆదారపడిఉంటుంది.ఒకటి మీరు చేసే ప్రయత్నం,రెండు ఈశ్వరానుగ్రహం. ‘‘నేను’’ అనేది ఒక మహా మంత్రం.ఇది ఓంకారం కన్నా శక్తివంతమైనది.ఇది భగవంతుని మొదటి నామం. ఈ నామం ద్వార ‘‘నేనెవరు’’మీద ధ్యాసపెట్టి ధ్యానం చేయండి.ధ్యానం చేయడం మీ స్వప్రయత్నం, ‘‘మీరెవరో ’’తెలియడం ఈశ్వరనుగ్రహం.మీకు ఆత్మన్వేషణకు బుద్దికలుగడమే ,ఈశ్వరనుగ్రహానికి బండ గుర్తు.ఇది మీ హృదయంలో ప్రకాశిస్తు మిమ్మల్నిలోపలికి గుంజుతుంది.మీరు చేయాల్సిన ప్రయిత్నం అంతా నేనెవరు అంటూ విచారించడమే,ధ్యానం చేయడమే.మనం భగవంతున్ని స్మరించాం అంటే అది భగవంతుని అనుగ్రహం.అనుగ్రహం అనేది భగవంతుడికి ఒక గుణం కాదు.అనుగ్రహమే భగవంతుడు.ఆయన అందరిని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు.పక్షి తన రెక్కలతో గుడ్డును రక్షించినట్లుగా,తల్లి పాలు తాగే పాపాయిని కంటికి రెప్పలా చూసుకున్నట్లుగా అయన రక్షిస్తూనే ఉంటాడుమీ పాపాయిని మీరెంత శ్రద్దగా చూసుకుంటున్నారో ఆపాపాయికి తెలియకపోవచ్చుఅలాగే మీరు..అయితే ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా నమ్మాలి.నమ్మడం అంటే భక్తితో ఉండడం కాదు.భక్తికి శరణాగతికి మూలంలోనే తేడా ఉంది.భక్తిలో ‘‘నేను,నీవు’’అనే ధ్వైత్వంతో కూడిన తేడా ఉంది.శరణాగతిలో ధ్వైత్వం లేదు.అంటే మాటవరుసకు నోటితోనో,మనసులోనే ‘‘ఈశ్వరా...నా భారమంతా ఇకపై నీదే’’అంటే చాలదు.సుఖ దుఃఖాలు,చివరకు ‘‘నేను’’కూడ మాయమవ్వాలి.భగవంతుడు తప్పతానులేడు.ఇట్లా అహం చనిపోయినప్పుడే పూర్ణ శరణాగతి సాథ్యం.భగవంతుడున్నాడని,ఆయన నీకు సర్వస్వము చేసి పెడుతాడని గట్టిగా నమ్మినపుడే మీరు పరిపూర్ణ శరాణగతి చెందగలరు.మీకు అటువంటి నిశ్చలమైన నమ్మకంలేకుంటే భగవంతుణ్ణి అతని దారికి అతన్ని వదిలేసి నీవెవరివో తెలుసుకోవడానికి ప్రయత్నించడండి.శరణాగతి మార్గం లేదా ‘‘నేనెవరు’’విచారణ ద్వార సమస్త శక్తిని అక్కడ కేంద్రీకరించి, ‘‘నేను’’ను తెలుసుకోవడమే జ్ఞాన మార్గం.విచారణ,శరాణగతి ఒకే పలితాన్ని ఇస్తాయి.ఇక్కడ రమణుల ఉద్దేశ్యం బయట లోకంలో కోట్లాది మంది అసలు ఎందుకు పుట్టారో,పెరిగారో తెలియకుండానే మరణిస్తున్నారు.ఈ శరీరం ఈ జన్మలో నిలబడి ఉండగానే మీరెవరో తెలసుకోవడమే ఏకైక జీవిత లక్ష్యంగా పెట్టకోండి.ఈ శరీరం, ఈ జన్మ గతి తప్పిందా మళ్ళీ మరణం,ఏక కణజీవి నుండి బహుకణ జీవిగా రూపాంతరం,నవమాసాలు మరొక తల్లి గర్భంలో పెరిగి పెద్దయి,జన్మతీసుకుని మళ్ళీ జీవితంలో ఒక దశ వచ్చినప్పడు ఈ జీవితం అంటే ఏమిటి,నేనెవరు అనే చింతన మొదలు పెడుతారా?ఎంత బహుదీర్ఘ ప్రయాణం?రాజకీయవేత్తలు,అధికారులు,ధనవంతులు బాహ్య ప్రపంచంలో భౌతికంగా ఎంతో సాధించవచ్చు. వారెవ్వరో తెలుసుకోకుండానే వారి జీవితాలు ముగిసిపోతుంటాయి. కర్త జీవుల ప్రారబ్దానుసారం వారిని ఆడించును.జరుగబోయేది ఎవరెంత అడ్డుపడిన జరుగును.జరుగబోనిది ఎవరెంత ప్రయత్నించిన జరగును.‘‘ఒక పనిచేస్తాను లేదా చెయ్యను’’ అని ముందే నిర్ణయించుకోవడం మంచిదికాదు.మీరు పనిచేయవలసిన విధిలేకపోతే మీరు పనికై ప్రయత్నించిన లబించదు.పనిచేయవలసిన విధి ఉంటే కాదని తప్పించుకోవాలని ప్రయత్నించిన నీకై వెంటాడి వేటాడి బలవంతంగా చేయిస్తుంది.కనుక ఏదేని ఒక పనిచేయడానికి ఛేయకుండా ఉండడానికి సంసిద్ధుడుగా ఉండండి.ప్రతి వారు ఒక పనిచేయడానికే ఈ భూమి మీదకు వచ్చారు.మీరు ఇష్టపడ్డా పడకపోయినా మీకు విధించబడిన పనిని ,భగవంతుడు మీ చేత బలవంతంగా చేయించి తీరుతాడు. కర్మయోగ రహస్యం తాను కర్తను కాదని తెలుసుకోవడమే ధ్యానం అంటే ఏమిటి? మనల్ని నిరంతరం వెంటాడే శతకోటి అలోచనల ద్రుష్టి మరల్చి ఒక్క ఆలోచనపైనే ద్రుష్టి పెట్టడమే ధ్యానం.ఇలా అభ్యాసం చేయగా చేయగా మనస్సుకు శక్తి కలుగుతుంది.రమణ మహర్షి చెప్పే ధ్యానంలో ప్రత్యేకత ఏమంటే ధ్యానించే వాడినే ధ్యానించాలి.అంటే ధ్యానించేవాడు,ఎవరికి వారే అయిన‘‘నేను’’ కనుక, ఆ ‘‘నేను’’ను పట్టకోవాలి.ఆ నేను ఎక్కడుందో ఆమూలాన్ని పట్టుకోవాలి. ఆత్మ విచారణకు సాంప్రదాయకంగా అనేక మార్గాలు ఉన్నాయి. ఈ విచారణలో ఆత్మను, అనాత్మను గురించి విచారించడం జరుగుతుంది.ఈ సాంప్రదాయమార్గాలకు మనసు ఒక పరికరం.అసలు దోషి అయిన ‘‘నేను’’ ఈ విచారణలో భధ్రంగా ఉండి ఎటు తేలదు..రమణులు చెప్పిన విచారణ అయిన ‘‘నేనెవరు’’ఇందుకు పూర్తిగా విభిన్నమైనది ‘‘నేనెవరు’’అని తనను తాను వేసుకునే సూటి ప్రశ్న సకల దోషాలకు మూలమైన ‘‘నేను’’పైనే గురిపెడుతుంది.ఇక్కడ ఇక ‘‘నేను’’ తప్పించుకోవడానికి వీలులేదు.అంటే ‘‘నేనెవరు’’అనే సూటి ప్రశ్న నేను పైనే నిలబడుతుంది.దాంతో ఇక్కడ అసలు దోషి ‘‘నేను’’దొరికిపోతాడు. ‘‘నేనెవరు’’ అనే విచారణతో మనస్సు అణుగుతుంది. ఈ ‘‘నేను’’ అనే ఆలోచన మనసులో విచారించే ఇతర ఆలోచనల అన్నింటిని అణగదొక్కి చివరకు మనసే తన ఉనికిని కూడా కోల్పోయి అణిగిపోతుంది.‘‘నేను’’ అనే ఆలోచన అన్ని ఆలోచనలను నశింపచేసి,తాను నశించును. ‘‘నిజమైన నేను’’ఆది అంతంలేని అనంతసాగరం లాంటిది. ఈ అనంత సాగరంలో ‘‘మాయా నేను’’ నీటి బుడగలా ఏర్పడుతుంది.ఈ నీటి బుడగనే జీవుడు(మొదటి ఆలోచన)లేదా వ్యక్తిగత ఆత్మ అంటారు. నిజానికి ఈ బుడగకూడ నీరే,నీరులో బాగమే. ఇది బద్దలైనపుడు పూర్ణసాగరంలో కలిసిపోతుంది. ఈ జీవుడు బుడగగా ఉన్నప్పుడు కూడ సాగరంలో ఒక భాగంగానే ఉన్నది. ఈ సరళ సత్యాన్ని విస్మరించి - ఎన్నో సిద్దాంతాలు రూపుదిద్దుకున్నాయి. ఆత్మజ్ణాన అన్వేషికి ‘‘నేను’’ను విచారించడమే సూటి అయిన మార్గం.అన్నింటికి కారణమైన ‘‘నేను’’ను విచారించకుండా మనసు,బుద్ది,ఇంద్రియాలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తే లాబం లేదు. ‘‘నేను’’ పోయిందా ,‘‘నేను’’ను ఆదారం చేసుకుని బతుకుతున్న ఇవన్ని ఎగిరిపోతాయి.‘‘నేను’’ అనేది మహా మంత్రం. ‘‘నేను’’ అనేది దేవుడి మొదటి పేరు.ఇది ‘‘ఓం’’కారం కన్నా మహా శక్తి వంతమైనది. ‘‘నేను’’ అనే ఆలోచన పుట్టిన తరువాతే, క్షణం , క్షణం మారే వేలకొద్ది ఆలోచనలు పుడుతున్నాయి.ఇన్ని ఆలోచనలకు మూలమైన , ఇన్ని ఆలోచనలను ఆలోచిస్తున్న ఈ ‘‘నేనెవరు’’ ను నిరంతరం ఆలోచిస్తే ఆ నిజమైన ‘‘నేను’’అనుభవమవుతుంది. నిద్రపోయే ముందు ,నిద్రనుండి మేల్కొన్నవెంటనే ‘‘నేనెవరు’’ను ప్రశ్నించుకోవాలి.ఈ రెండు సమాయాల్లో అఖండ విశుద్ద ప్రజ్ణ ఒక్క తృటి కాలం పాటు ఉంటుంది.ఇవి ధ్యానానికి ఉత్తమ సమాయాలు. మనస్సు అప్పుడు పరిశుద్దంగా ఉంటుంది. ఇతర సాధనలలాగ ‘‘నేనెవరు’’అంటూ ధ్యానం చేయడం ఒక భావన మాత్రం కాదు. ప్రత్యక్ష అనుభవం నుండి సూటిగా ఆత్మకు ప్రయాణించడం.‘‘నేను’’అని మాట్లాడటం,ఆలోచించడం,వ్యవహరించడం అందరికి నిత్యం ఉండే అనుభవంలోకి వచ్చేదే.ఈ నేను అనేది సాక్షాత్తు ‘‘ఆత్మ’’నుండి నుండి పుట్టకు వస్తుంది.నేనెవరు అని ధ్యానం చేయండం ఆత్మలోకానికి వెళ్ళే సూటి అయిన మార్గం. జన్మతేథిని పుట్టని రోజు వేడుక జరుపుకోవడంలో పెద్ద విశేషం లేదు.శరీరం పుట్టిన రోజుని కాకుండా ‘‘నేను’’పుట్టిన ఆత్మజన్మస్థానం తెలుసుకున్న రోజే నిజమైన పుట్టిన రోజు. నేను అనే మొదటి ఆలోచనపైనే పంచకోశాలతో కూడిన మూడు దేహాలు ఉన్నాయి.మొదటిది రక్త మాంసాలతో కనపడే స్థూల శరీరం.రెండవది ఈ స్థూల శరీరాన్ని ఆవరించుకుని తొడుగులా ఉండే సూక్ష్మశరీరం.మూడవది జీవికి జన్మలు ఏర్పడడానికి మూల బీజమైన కారణ శరీరం. ‘‘నేను’’ పుట్టుక స్థానానికి చేరుకుంటే ఈ మూడు దేహాలు కూలిపోతాయి. కోర్కెలను తీర్చుకోవడం ద్వార మనకు ఎన్నడు శాంతి లబించదు.ఒక కోరిక తీరిన తరువాత మరొక కోరిక ఇలా అనంతంగా వస్తూనే ఉంటాయి.కోర్కెలను బలవంతంగా అణిచిపెట్టడం వలన ఎలాంటి ఉపయోగం లేదు.కోర్కెల్లో ఉన్న మూల స్వభావం వాటిని అణిచి పెట్టిన కొద్ది రెట్టించిన బలంతో విరుచుక పడుతాయి.కోర్కెలను అణిచి పెట్టడానికి ఒకే దారి ఉంది.ఇన్ని కోర్కెలు కోరుతున్నది ఎవరు,ఎవరికి అని ప్రశ్నించుకుంటే నేను,నాకు అనే సమాదానం వస్తుంది. అప్పడు ఆ నేను పైన దృష్టి పెట్టి నేనెవరు తెలుసు కోవడానికి ప్రయత్నించాలి.ఆ నేనెవరు తెలుసుకున్న రోజున అన్ని కోర్కెలు వాటంతట అవే నశించిపోవడమే కాదు కోరుకోవడానికే ఏమి ఉండని ఉత్తమ స్థితికి చేరుకొంటారు. ప్రతి ఒక్కరు ప్రతి క్షణం కూడ నేను అనుభూతిలో ఉంటున్న కూడ , ఆ నేను బయటి ప్రపంచంతో వ్యవహరించడానికి బాహ్యముఖంగా ఉండడంతో ప్రాపంచిక నేను మాత్రమే అనుభవంలోకి వస్తుంది.అంతర్ముఖంగా తిరిగి లోని నేనును తెలుసుకోవడమే జ్ఞానోదయం.మనిషి జీవనానికి పరమావధి ఏమిటి? అజ్ఞానాన్ని జయించి తానెవరో తెలుసుకుని పూర్ణజ్ఞాని కావడమే మానవుని జీవితానికి ఏకైక పరమావది.తానెవరో తెలసుకోనంత కాలం సముద్ర తరంగాల్లా జన్మలు వస్తూపోతునే ఉంటాయి.దీపం ఉండగానే ఇల్లు చక్కపర్చుకోవడం అంటే ఈ జన్మలో కనీసం ఈ సృహ ఉన్న జీవితాన్ని వ్యర్థం చేయకుండా నేనెవరును తెలుసుకోవడానికి ప్రయత్నించామా జన్మ పరంపరలనుండి ఈజన్మలోనే విముక్తి లబిస్తుంది. ఈ శరీరమే నీవా?నేను అనే ఆలోచన పుట్టిన తరువాతే శరీర సృహ అనుభవంలోకి వస్తుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా శరీరం సృహ లేకుండా కూడ నేను ఉంది.కాబట్టి మొదటిది నేను,రెండవదే శరీరం. భగవంతుడికి శరణాగతి చెందడం ,నియమాలతో కూడిన శరణాగతి కాదు.మృత్యువు చుట్టుముట్టినప్పుడు మృత్యువు పరిపూర్ణ శరణాగతి చెందినట్ట్ల, ప్రథమ ఆలోచన ఐన నేను శాశ్వతంగా చనిపోయినపుడే మృత్యువు శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుంది. శాస్త్రాలను మితిమీరి చదవడం వలన లాభం లేదు.ఆత్మజ్ఞానానికి నేనెవరు అని విచారించాల్సిందేగాని,శాస్త్రాలను చదివి లాభంలేదు. శరీరం జడం, ఆత్మ చైతన్యం.ఈ రెంటికి నడుమ నేను అంటు ఒక అహంకారం తలెత్తుతున్నది. అహంకారం ఉన్నంతవరకు పురుష ప్రయత్నం ఉండవలసిందే.అహంకారం పడిపోగానే , కర్మలు సహజంగా సాగిపోతుంటాయి.ఆత్మ తన శక్తి ద్వార ఈ అనంత మైన విశ్వాన్ని సృష్టించింది.అయినప్పటికి ఆత్మ ఏమి చేయనిదిగానే ఉంది.శ్రీకృష్ణుడు భగవద్గీతలో సృష్టంగా చెప్పాడు ‘‘నేను ఏమి చేయని వాడినే.అయినప్పటికి అనంతమైన కర్మ నానుండి వెలువడుతుంది’’అని.ఈ అహంకార పూరిత మిథ్యానేను పోగొట్టుకోవడం కోసం ఏలాంటి కష్టపడనవసరం లేదు.ఈ మిథ్యానేను ఎక్కడినుండి పుడుతుందో ఆచోటును వెదకడానికి నేనెవరు అని విచారించడమే.ఆ తరువాత ఇక ఆత్మానుగ్రహమే పనిచేస్తుంది.ఇక అక్కడ చేయాడానికి అసలు ఏ ప్రయత్నం అవసరం లేదు.ఏ పురుష ప్రయత్నం ఆత్మానుగ్రహ పరిధిని తాకలేదు. ఒకటి తప్పని మరొకటి ఒప్పని ఎవరిని విమర్షించ వద్దు.విమర్షలవలన ఎవరు మారరు. ఆత్మయే భగవంతుడు.‘‘నేను ఉన్నాను’’అన్నదే భగవంతుడని బైబిల్ చెప్పింది. ‘‘నేను ఆత్మనై ఉన్నాను’’ అని గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు.పంచేంద్రీయాలతో ద్వార(కన్ను,ముక్కు, చెవి,నోరు,స్పర్శ) అందే ఇంద్రియ జ్ఞానాన్నే సాదారణంగాప్రత్యక్ష జ్ఙానం అనుకుంటారు. ఇంద్రియాల సాయం లేకుండా ఆత్మ స్వయంగా నేను నేను అంటు అందరికి ప్రత్యక్షఃజ్ఞానాన్ని ఇస్తుంది.మేధస్సు కూడ ఆత్మ యొక్క ఒక ఉపకరణే. పరమాత్మ తాను మారకుండానే తనను తాను చూచేవాడుగా, చూడబడేదిగా, చూచేక్రియగా మారుతుంది. ప్రారబ్దాన్ని జయించడానికి మార్గాలు ఉన్నాయి.ప్రారబ్దం ఆత్మ కాకుండా అహంకారమే అనుభవిస్తుంది. అహాంకారాన్ని చంపడానికి ఉత్తమోత్తమ మార్గం పరిపూర్ణంగా భగవంతునికి శరాణాగతి చెందడం.అనుక్షణం చేసే పనుల్లో ‘‘నేను చేసేది ఏమిలేదు ఈశ్వరా.చేయించేది అంతా నీవే.నేను కేవలం ఒక పరికరాన్ని మాత్రమే.సర్వం ఈశ్వరార్పణం ’’అనుకుంటు అహంకార రహితంగా క్రియలు చేస్తు అహంకారాన్ని నశింప చేయడం ద్వారా ప్రారబ్దాన్ని జయించవచ్చును.అహంకారం వదిలేసి ఈశ్వరుడు నీతో ఏం చేయించదల్చుకున్నాడో అదిచేయడానికి నీవు సిద్దంగా ఉండాలి.ఇప్పటి వర్తమానం లేకుండా భూత భవిష్యత్తులు లేవు.ఆత్మ కాలాన్ని,ప్రదేశాన్ని దాటిఉన్నది.సత్యం ఇంతే సులువుగా ఉండాలనుకుంటున్నారా? మరింత జఠిలంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారా?జ్ఞాని అయినవాడు మాత్రమే నిజమైన కర్మయోగి కాగలడు.నిష్కామ కర్మను భోదించిన శ్రీ శంకరాచార్యులు కూడ దేశాటనం చేసి వ్యాఖ్యానాలను రాసాడు.ఇక్కడ కర్మ చేయడమా చేయకపోవడమా అనేది ముఖ్యం కాదు.కర్మ చేస్తున్నదెవరు అని నిరంతరం ప్రశ్నించుకోవాలి.కర్మ చేస్తున్నప్పుడు నేను కర్తను అనే భావనతో చేస్తే కర్మ ఫలితాలను తప్పక అనుభవించి తీరాలి.చేసే కర్తను నేను కాదు,ఒక దివ్య శక్తి తనరూపకంగా ఆపని చేయిస్తున్నదని స్వయంగా తెలుసుకున్నప్పుడు ,జ్ఞాని ఎంతటి కర్మ తనద్వార తనద్వార జరుగుతున్న నిశ్చలంగా ఉంటాడు.తాను కర్తను కాను అనే జ్ఞానం కలవాడే నిజమైన సన్యాసి.కర్మ ఫలితాలు అతనిని తాకనైనా తాకలేవు. ‘నేను’ అనే సృహే ఆత్మ . నేను అనే సృహలేకుండా ఉన్న వారెవ్వరు లేరు కాబట్టి అందరిలో ఆత్మ వ్యాపించి ఉంది.కాకపోతే అజ్ఞాని ఈ శరీరమే నేను అనుకోంటాడు,ఈ శరీరం ఆత్మకంటే భిన్నం కాదని జ్ఞాని తెలుసుకొంటాడు.జ్ఞాని అయినవారికి ఆగామి,సంచిత కర్మలే (భవిష్యత్తులో అనుభవించే,జమ ఐన కర్మలు) కాదు ప్రారభ్ద కర్మ కూడ మిగలదు. హృదయం(ఆత్మ స్థానం) నుండి శిరస్సులో ఉండే సహస్రారానికి (మనస్సు) అమృత నాడి ఉంది. ఆత్మశక్తి హృదయం నుండి అమృతనాడి ద్వార సహస్రారానికి చేరి అక్కడినుండి నాడులద్వార శరీరమంతా దశేంద్రియాల ద్వార బయటకు రావడం ద్వారనే నిత్యం వ్యవహరించే లోకానుభవాలు ఏర్పడుతున్నాయి. ఈ అనుభవాలు ఆత్మ శక్తి తప్ప మరొకటి కాదని గ్రహించడమే జ్ఞానం. సుఖం అనేది కూడ ఆత్మకు మారు రూపమే.మనస్సు బయటి ప్రపంచంలోని భౌతిక సంపదలతో లయం చెందినపుడు భౌతిక సుఖాన్ని అనుభవిస్తుంది.మనస్సు లోనికి వెళ్ళి ఆత్మవైపు తిరిగినప్పుడు అది ఆత్మ సుఖాన్ని అనుభవిస్తుంది.ఆత్మ సుఖం శాశ్వతం.బయటి ప్రపంచ సుఖాలు శరీరం నిలబడి ఉన్నంతవరకు మాత్రమే ఉండే తాత్కాలిక మిథ్యాసుఖాలు. మనసును బయటికి రానివ్వక ఆత్మలో నిలకడగా ఉండేటట్లు చేయడమే అన్ని సాధనల అంతిమ ధ్యేయం. హృదయమే శక్తి కేంద్రం. ఇది అజ్ఞానిలో మూతపడి ఉంటుంది. జ్ఞానిలో తెరుచుకుని ఉంటుంది.ఇది తెరుచుకోవడమే జ్ఞానం,మోక్షం. మౌనం నాలుగు రకాలు.అందరు అనుకునేట్లు మాట్లాడకపోవడం మౌనం కాదు.మౌనంలో వాక్ (నోటి)మౌనం,నేత్ర(కంటి)మౌనం,కర్ణ(చెవి)మౌనం,మానసిక మౌనం.మానసిక మౌనమే శుద్దమౌనం. మౌనమే ఆత్మకు మారుపేరు.కొన్నివందల ఉపన్యాసాలు,గ్రంథాలు చేయలేని పనిని జ్ఞాని కొన్ని క్షణాల మౌనం ద్వార సాధకునిలో వివేకాన్ని నింపగలడు.ఎన్ని శాస్త్రాలభ్యసించినా,ఎన్ని సాధనలు ,పుణ్యకర్మలు ఆచరించినా ఒక మహాజ్ఞాని చూపుకు సాటిరావు.జ్ఞానితో సాహచర్యం సాథనలోకెల్లా గొప్పసాధన. ఆత్మసాక్షాత్కారం కలిగినపుడు ప్రపంచంలో మీరుండే బదులు,మీలో ప్రపంచం ఉంటుంది. మాయ అసత్యం కాదు.ఇది ఆత్మయొక్క క్రియారూపం.ఈ మాయే నామ రూప బేధాలను కల్పిస్తుంది.మయాను విచ్చిన్నం చేసి తనను తాను తెలుసుకోవడమే జీవితాశయం,ఈ విషయం మర్చిపోవడమే మాయ.ఆత్మ జ్ఞానానికి అవరోధాలు మనసులో ఉండే వాసనలు.ఇవి నిరంతర ప్రయత్నపూర్వకంగా,దైవానుగ్రహంతోను దూరమవుతాయి.దైవానుగ్రహం వలనే ఎవరికైనా నేనును తెలుసుకోవాలనే వాంచ పుడుతుంది.భగవంతునికి,అనుగ్రహానికి,ఆత్మకు తేడాలేదు.అంతా ఒకటే. అగ్నినుండి నిప్పుకణం బయటకు వచ్చినట్లు ఆత్మనుండి అహంకారం బయటకు వచ్చి శరీరంతో తాదాత్మ్యం చెందుతుంది.దేహమనే అలంబన లేకుండా అహంకారం నిలువదు.అహంకారం,జన్మాంతరాలుగా ఏర్పడ్డ మనో సంస్కారాలు ఒక్కసారిగా అరికట్టలేము.మనం శరణు చెంది స్వప్రయత్నంగా సాధన చేస్తుండగా తగిన సమయం వచ్చినప్పడు ఈశ్వరుని కటాక్షం లబిస్తుంది.ఈశ్వరుని కృపకై ఎదురుచూస్తు సాధన అశ్రద్ద చేయవద్దు.అది ఆయనకు జ్ఞాపకం చేయనవరంలేదు.అయన మనం చేసేదంతా చూస్తూనే ఉంటాడు. వేదాంత సారమంతా ఒక్కమాటలో చెప్పాలంటే భగవంతుడు మనిషితో అంటున్నాడు.‘‘ఓ మానవుడా నేను నీ హృదయంలోనే వున్నాను.నీవెవరివో తెలుసుకో’’. మనస్సు చంద్రుని లాంటిది , ఆత్మ సూర్యుని లాంటిది.ఆత్మనుండి వచ్చిన వెలుగుతో మనసు ప్రపంచాన్ని చూస్తుంది,వ్యవహరిస్తుంది.జీవితంలో సాధన చేయాల్సిందంతా మనస్సును స్వాధీనం చేసుకోవడంలోనే ఉంది.మనసు ఆడించి నట్లు మనిషి ఆడకుండా దానిని ఆధీనం చేసుకోవడంలోనే మనిషి లక్ష్యం.దురభ్యాసాలు,పూర్వజన్మ వాసనలు,మధ్యలో వచ్చే ఆటంకాలు ...వీటిని ఎదుర్కోవడానికి పురుష ప్రయత్నం అవసరం.అసలు ప్రయత్నం లేకుండా ఈశ్వర కటాక్షం దొరకదు. .‘‘నేను’’ అనే అహంకారం ఉన్నంతవరకు జ్యోతిష్యంతోపాటు అన్ని నిజమే.ఆ అహం నశించినప్పుడు ఏదీ నిజంకాదు.చూచేవాడుంటేనే చూడడం ఉంటుంది. శ్రీ రమణ మహర్షి జీవితం. తమిళనాడులోని మధురైకు దగ్గరలో తిరుచ్చలి గ్రామంలో సుందరమయ్యరు అలగమ్మ దంపతులకు క్రీ.శ.1879 డిసెంబర్ 30 వతేథి తెల్లవారు జామున ఒంటి గంటకు శ్రీరమణులు జన్మించారు.పుట్టినపుడు అతనికి వేంకటేశ్వరన్ నామం ఉండేది.చిన్నతనంలో అతనిని బడిలో చేర్చినపుడు అతని పేరు వెంటట్ రామన్ గా మారింది.ముద్దుగా రమణ పేరు వాడుకలోకి వచ్చి అదే పేరు నిలబడింది.రమణుల పెదనాన్న కూడ అతని 18వ ఏటనే సన్యసించి దేశాటనం పట్టాడు.రమణుల తండ్రి సుందరమయ్యరు తన 48వఏట చనిపోయారు.అప్పుడ రమణులకు 12 సంవత్సరాలు.రమణునితో పాటు మొత్తం నలుగురు సంతానం.అతని కంటే పెద్దఅన్ననాగస్వామికి 16 సం.లు.మూడవ కుమారుడు నాగసుందరానికి 6 సం.లు.నాలుగవ సంతానం పసిబిడ్డ.తన పెదనాన్న సుబ్బయ్యరు ఇంట రమణులు పెరిగాడు.రమణునికి 16 ఏడు వచ్చిన తరువాత 1896 జూలైలో ఎటువంటి గురపదేశం లేకుండానే ఆత్మానుభూతి పొందాడు.అప్పడు రమణులు మెట్రికులేషన్ చదువుతున్నాడు.అతనికి తిరువాణ్ణమాలైలోని అరుణాచల గిరి అంటే చిన్నప్పటి నుండి ఎడతెగని ఆకర్షణ.ఎప్పుడైతే అతనికి ఒకసారి ఆత్మానుభూతి అనుభవించాడో ఆపై చదువులు,జీవితం వ్యర్థంగా తోచి 1896 ఆగష్టులోనే ఇంట్లో ఎవరికి చెప్పపెట్టకుండా అరుణాచలం చేరుకున్నాడు.రమణులు అరుచాచలంలో 11 సంలు మౌనదీక్షలో ధ్యానం చేసారు.(1896-1907) రమణులు 1896-1922ల మద్య కొండపైనున్న విరుపాక్షగుహ,స్కందాశ్రమంలో గడిపాడు.1923 నుండి కొండకింద ప్రస్తుత ఆశ్రమంలో నిర్యాణం అయ్యో వరకు అనగా 1950 ఎప్రిల్ 14వతేధి శుక్రవారం రాత్రి 8.47 నిముషముల వరకు అక్కడే జీవించారు.

ఆత్మ జ్ఞానం కోసం అన్వేషించేవారికి చివరి మజిలి