పేజీలు

31 మార్చి, 2009

దేవుడు ఎక్కడ ఉన్నాడు?ఎలా ఉంటాడు?

యుగ యుగాల నుంచి దేవుడ్ని తప్పొప్పులను విచారించి తీర్పులిచ్చే సృష్టిలో అత్యున్నత న్యాయమూర్తిగానే వర్ణిస్తూ వచ్చారు. లేదంటే వరాలిచ్చే,శిక్షించే రూపంగానో ఊహించారు. అలాంటి దేవుడు మనుషుల మనుసులోని ఊహల్లోనే పుడుతాడు తప్ప వాస్తవంలో దేవుడు అలా ఉండనే ఉండడు.
సృష్టి మొత్తం సర్వస్వం తానే అయిన ఒక మహా శక్తే దేవుడు. ఈ గాలి, నీరు,ఆకాశం, అగ్ని, భూమి, సమస్త గ్రహాలు,నక్షత్రాలు,అంతా దేవుడే.పసివాళ్ళ కేరింతల్లో,ప్రేమికుల ఆలింగనంలో,అమ్మ ప్రేమలో, సమస్త జీవరాశుల్లో ,ఆ జీవరాశుల క్రియల్లోనూ దైవమే నిండి ఉంది. కనపడే గోచర,అగోచర సమస్త సృష్టే దేవుడు. దేవుడంటే ఎక్కడో ఉన్నత లోకంలో అందరిని చూస్తు మనుషుల పాప పుణ్యాలకు తీర్పునిచ్చేవాడు కాదు. దేవుడు పరిపూర్ణ ప్రేమ మూర్తి.దైవం మిమ్మల్ని శిక్షిస్తుందని అనుకుంటున్నారా?మిమ్మల్ని శిక్షించడం అంటే దేవుడు తన్నుతాను శిక్షించుకున్నట్లే.ఎందుకంటే మీరు ఎవరో అదే దేవుడు కనుక. ఉన్నదున్నట్లుగా దైవం ఉంటుంది.దేవుడికి ఉండడంగా మాత్రమే తెలుసు.
ఆ దేవుడికి ఏ చెడు,మంచి కనిపించదు.అన్నిట్లో అయనకు ఆయన స్వయమే కనిపిస్తుంది. మనుష్యలు సృష్టిస్తున్న దేవుడిలా ఉండక దైవం ఉనికి రూపంగా అనంతంగా,శాశ్వతంగా కొనసాగుతుంటాడు.అసలు దేవుడు అనే లింగ భేద పద వాడకమే తప్పు. దైవం అనడం సరైనది.ఆ దైవమేమనుషులకు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని,అహంకారాన్ని,స్వేచ్చను ప్రసాదించి వారు కోరుకున్నట్లు జీవించే అవకాశం ఇస్తుంది.
దైవం అత్యున్నతంగా ప్రకాశించేది ‘‘ఆలోచన’’లోనే .సృష్టి మొత్తం ఆలోచనలోనే పుట్టింది.ఇప్పుడు ఉన్నదంతా ముందు ఆలోచనగా ఉన్నదే.ఇకపై ఉండబోయేది కూడా ఆలోచననుంచే సర్వస్వం సృష్టింపబడుతుంది.ధైవపు ప్రేమ శక్తే ఆలోచన.దైవం అత్యున్నతంగా ప్రకాశించే మరో స్థితి ‘‘ఆనందం’’.ఆనందమే దైవపు నిజ స్థితి. ఆ ఆనంద అనుభూతికే సమస్త మానవాళి అర్రులు చాస్తుంది.ఆ ఆనందం భౌతిక రూపంలో పొందడానికి నిరంతరం భౌతిక రూపంలో పోరాడుతున్నారు. ఆనంద నిజ స్థితి భౌతిక ఆకారం లేని నిర్గుణ స్థితి.అది భాహ్యంగా భౌతిక రూపంలో లబ్యమవుతున్న అది అశాశ్వతం.శాశ్వత ఆనందం మీ హృదయాంతరంలో వెదికితే దొరకుతుంది.

7 కామెంట్‌లు:

నేను చెప్పారు...

ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు.ఈ సిద్దాంతాన్ని ఎవరు ప్రతిపాదించారో చెప్పగలరు.

నేను చెప్పారు...

ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు.ఈ సిద్దాంతాన్ని ఎవరు ప్రతిపాదించారో తెలియజేయగలరు.

అడపా రవిందర్ చెప్పారు...

మాస్టర్ రామ్తా ఈ భోధన చేసారు.

Unknown చెప్పారు...

చాలా చక్కగా వివరించారు. ఎంతో ఊహాశక్తితో ఇలాంటి ఒక అద్భుతమైన వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ నుంచి మరిన్ని విశ్లేషణాత్మక, మేధో కథనాలు వస్తాయని ఆశిస్తున్నాను.

somu చెప్పారు...

చాలా చక్కగా చెప్పారు. ఈ సంకలనం చూస్తే దేవుడు అంటే భయం పోయి ప్రేమ పుడుతుంది.

అజ్ఞాత చెప్పారు...

ADBHUTAM , AMOGAM INTATI BHEEKARAMAINA WEB SITE NENU MUNUPUENNADU CHOODALEDU SUMI....
ABBA ENTA BAVUNDO......NEEEEEEEEEEEEEEEEEEEEE

అజ్ఞాత చెప్పారు...

mari srustilo inni bhedaalu enduku???

ఆత్మ జ్ఞానం కోసం అన్వేషించేవారికి చివరి మజిలి