పేజీలు

28 మార్చి, 2009

కర్కాటక రాశిలో జన్మించిన వారి జాతకం.

మీరు కర్కాటక రాశిలో జన్మించారు.
http://ramthamedia.in మీ మనస్సు ఒకసారి పరిపూర్ణ ఉత్సాహంతో తొణికిసలాడుతుంది.మరోసారి నిరాశ నిస్ప్రహలు మిమ్మల్ని ముంచి ఎత్తుతాయి.అమవాస్య ,పూర్ణిమలకు సముద్రంలో ఆటుపోట్లు వచ్చినట్లు మీ మనస్సకు నిరంతంర ఆటుపోట్లు ఉంటాయి. కొంతకాలం ఉత్సాహం ,ఆశ,సంతోషము వెల్లివిరుస్తాయి,మరికొంతకాలం విషాదం,నిరాశ,దిగులు కలుగుతాయి.మీ తెలివితేటలు కొంతకాలం సూర్యచంద్రలు ప్రతిబింబించిన సముద్రంలా సమస్తాన్ని చూడగలుగుతాయి.కొద్దిరోజులు కారణం లేకుండానే భయం,నిరాశ,ఒంటరితనంతో ,బంధుమిత్రులతో కలసిఉండలేక చికాకుపడడం జరుగుతాయి.ఇతరుల విషయాలను,ఎదుటి మనస్తత్త్వాలను ,వారి ఆలోచనలు ఇట్టే పసిగట్టగలరు.మీ అంతరంగాన్ని మాత్రం ఇతరులకు ఏమాత్రం తెలియనివ్వరు.వ్యక్తులతో మీరు కొంత కాలం అత్యంత అనురాగంతో ప్రాణంగా కలిసపోవడం, మళ్ళీ వారితో విడిపోయి జీవితాంతం సంబంధం లేకుండా ఉంటారు.మీ మనసుకి ఆవేశమెక్కువ , విమర్శ తక్కువ.ఆవేశం తరుచూ కలుగుతుంటుంది.మనసు స్థిరంగా , ప్రశాంతంగా ఉన్న సమయాల్లో చక్కగా అన్ని తెలుసుకునే జ్ఞానం కలిగిఉండి సూక్ష్మఅంశాలను కూడా గ్రహిస్తారు.ఇలాంటి సమయాల్లో ఏదేని సభలు ,సమావేశాల్లో మీరు ఉపన్యాసకులుగా ఉంటే ఇంతకుముందు ఎరుగని కొత్త విషయాల గురించి ఆగకుండా అనర్గళంగా మాట్లాడుతారు.వక్చాతుర్యం ఎక్కువ.మిమ్మల్ని నమ్మించడం ,మోసగించడం సులభం,కానీ మీరు ప్రశాంతంగా ఉండగలిగితే ఎదుటివారి మనసులోని భావాల్ని ఇట్టే గ్రహించగలరు.కవులుగా,చిత్రకారులుగా,గాయకులుగా,కల్పన గాధల రచయితలుగా మీరు మీ ప్రజ్ఞను ఉన్నత లోకాలకు తీసుకెళ్ళి,మంచివారిని మైమరిపించగలరు.
మీకు చురకుదనం,కోపం ఎక్కువ,కొంత తీవ్ర స్వభావం ఉంటుంది కాని మొండితనం తక్కువ.మీరు ఎప్పడు ఏదో ఒకటి ఆలోచిస్తూ దేనికోసమో త్వరగా పరుగులు తీస్తూ,ఎవేవో పనులుచేస్తూ తిరుగుతుంటారు. పదిమందిలో కలిసి ఉన్నప్పుడు చిన్నవిషయాల్లో కూడా వారి సలహాలను అడుగుతారు.కాని ఆ సలహాలను ఆచరణలో పెట్టక,మీ నిర్ణయం పైనే ఆధారపడుతారు.మీకు ఒక స్థిరమైన అభిప్రాయముండదు.ఎవరితో కలిసుంటే వారి స్వభావంతో ప్రవర్తిస్తారు.కనుక మీ మేలుకోరు వారైన సింహరాశి వారొకరితో మీ జీవితం ముడిపెట్టుకోవడం మంచిది.అప్పడు మీకు స్థిరత్త్వం,సౌఖ్యం,జయం తప్పకుండా కలుగుతాయి.మీకు జ్ఙాపకశక్తి ఎక్కువ.చిన్నతనం నుండి జరిగిని సన్నివేశాలు,కలిసిన వ్యక్తులు సృష్టంగా జ్ఞాపకం ఉంటారు.మీరు ఏపనిని సొంతంగా సాధించలేరు,కాని మరొకరి ప్రోత్సాహం ఉంటే మాత్రం సాధించలేని పనుండదు.చేసే పనుల్లో మీకు అలసట ఎక్కువ.కుటుంబంలోని వ్యక్తుల పట్ల కూడ క్రమశిక్షణ కాల నిర్ణయం పాటించకపోవడంతో వారితో కూడ గొడవలు వస్తుంటాయి.మీకు నచ్చిన వారికోసం మీరు కాలాన్ని ధనాన్ని,వస్తుసంపదని అన్నింటిని సమర్పిస్తారు.మీకు నష్టం కలుగుతున్నా,శ్రమ అనిపించినా అనారోగ్యము కలిగినా లెక్కచేయకుండా వారికి సహాయము ,సేవ సంరక్షణ చేయగలరు.ఇతరుల బాధ్యతలను కూడ నెత్తిన వేసుకుంటారు.అలాగే మీకు కష్టం కల్గించిన వ్యక్తులమీద కూడ దీర్ఘకాలంగా వేచిచూసి కక్షసాదిస్తారు.
ప్రయాణాలకు సంబంధించిన వృత్తులు మీకు అనుకూలంగా ఉంటాయి.సేవా రంగానికి చెందిన విధ్యా,వైధ్య వృత్తులు మీ ప్రతిభకు అవకాశాలను ఇస్తాయి.వాహనాలు,నౌకలు,విమానాలు రైలుబండ్లు మొదలగు
వాటిలో తిరిగే వృత్తుల్లో మీరు రాణిస్తారు.టూరింగ్ ఏజెంట్లు,టూరిస్టు సంఘ నిర్హాహకులు,మెడికల్ రిప్రసెంటీవ్స్ ,పబ్లిసిటి చేసేవారిగా మీరు నైపుణ్యాన్ని పొందుతారు. ఎగుమతి ,దిగుమతుల వ్యాపారం,ధాన్యం,వస్త్రాలు,తినే పదార్థాలు,పానీయాల వ్యాపారాలు మీకు బాగా కలిసివస్తాయి.ఉద్యోగం కన్నా మీకు వ్యాపారం లాభదాయకం.వైద్యవృత్తి గ్రంధాలు అమ్మడం,ఉప్పు పరిశ్రమ మీకు లాబిస్తాయి.ఇతరుల కార్యాలు నెరవేరుస్తు డబ్బు సంపాదిస్తారు.ఇల్లు వదిలి ఎక్కువ కాలం ఉండలేరు.ఇతర ప్రదేశాలు ఎంత అనుకూలంగా ఉన్నా మీకు విశ్రాంతి లబించదు.మీ జీవిత భాగస్వామి గడుసరి,డబ్బు ఖర్చుపెట్టడంలో జాగ్రత్త కలిగి ఉంటారు.మీకు వివాహం తరువాత శరీరం లావెక్కే అవకాశాలు ఎక్కువ.చిన్నతనంలో జలుబు,దగ్గు,ఊపిరి తిత్తులకు సంబంధించిన బాధలు ఉంటాయి.పెద్దయ్యాక అలసట,ఆయాసం,శ్వాసకోశ వ్యాధులు,వృద్ధాప్యంలో మధుమేహం,రక్తపోటు,కడుపు ,జీర్ణకోశం,లివర్,మూత్రపిండాల వ్యాధులు,ఒంటికి నీరు పట్టుట లాంటివి ఏర్పడుతాయి.మత్తు పదార్థాలకు,ఇతర చెడు అలవాట్లకు గురిఐతే జీవితాంతం వాటిని వదులలేరు.అటువంటి అలవాట్లు ఉన్నకూడ వాటిని బయటకు తెలియనివ్వకుండా ఉంచుతారు.ఆహారం ,పానీయాలలో నియమం,పరిమితి మీకు చాలా అవసరం.మనసులో దిగులు పడినప్పుడల్లా మీ ఆరోగ్యం పాడయిపోతుంది.
మీకు లలిత కళల్లో మంచి ప్రావీణ్యం ఉంటుంది.గృహాలంకరణ,గృహోపకరణాల సేకరణ,మీ నైపుణ్యానికి ఉదాహరణ.సంగీతమభ్యసించిన,మీ కంఠధ్వనిలో భక్తి,పారవశ్యం, హృదయ ధృవీకరణ శక్తి కలుగును.మీరు యోగాభ్యాసం, మంత్రోపాసన చేస్తే పలితాలు త్వరగా లభిస్తాయి.జ్యోతిర్విద్య అభ్యసించడం,ధ్యానం మీకు మంచిది మీకు భక్తి యోగ సాధన సులభం.ఆత్మ సమర్పణ మార్గాన పరమ గురువులలో ఒకరికి జీవితమర్పించుకొనుట,వారితో సూక్ష శరీర సంబంధాలు,విచిత్రానుభూతులు,పరలోకాల దర్శనం కలుగవచ్చును.యోగ మార్గంలో వెళితే గురువులను మార్చవద్దు.

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

chala baga unnadi thakq guruvu garu

a v l చెప్పారు...

karektuga ma abbaeki saripoeenadi

pavan చెప్పారు...

meru chapenavi na jevithamlo 90% jarigi

ఆత్మ జ్ఞానం కోసం అన్వేషించేవారికి చివరి మజిలి