పేజీలు

29 మార్చి, 2009

తులరాశిలో జన్మించిన వారి జాతకం.

మీరు తులరాశిలో జన్మించారు.
http://ramthamedia.in/ మీరు అందరితోని సమన్యాయంగా ఉంటారు.ఇతరులకు చేయవల్సిన పనులు,ఈయవల్సిన వస్తువులు ,డబ్బు,అలాగే మీకు ఇతరులు ఇయాల్సినవి,చేయాల్సినవి బాగా గుర్తుంటాయి.అవకాశాల్ని,కాలాన్ని,డబ్బును,సద్వినియేగం చేసుకోవడం మీకు తెలిసినంతగా ఎవరికి తెలయదు.దాంతో పాటే అనవసర ఖర్చులు కూడ అధికంగానే ఉంటాయి.మీ ఇంటిలో గుండుసూదినుండి మొదలుకుని,టేబుల్లు,కుర్చీలు,ఇంటి సామాగ్రి మొత్తం దేని స్తానంలో అది అలకరించబడి ఉంటుంది.ఇల్లు , ఇంట్లో వస్తువులు సర్దడం, టైం టేబుల్ వేయడం , బడ్జెట్ పథకం వేయడం,పనివాళ్ళకు జీతం లెక్కకట్టడం మీకు సులువుగా ఉంటాయి.కాని ఒకొక్కప్పుడు అతి చిన్న వస్తువు జాగ్రత్త,చాదస్తం చూపే మీరు ఒకోసారి
జీవితంలో విలువైన పెద్ద అవకాశాలను పోగొట్టుకుంటారు.మీరు సామన్యంగా కోప్పడరు.ఇతరుల మంచితనం వలన మీకు చాల ఉపయోగం ఉందని మీకు తెలుసు.లెక్కలు సరిగ్గా చూపి మిమ్మల్ని అధికంగా డబ్బు అడిగినా ఒప్పుకుంటారు గాని లెక్క తప్పు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తే మీరు సహించరు.ఇతరులకు దానాలు ఎక్కువగా చేస్తారు.గాలిమేడలు కట్టడం ఎక్కువగా ఉంటుంది.భవిష్యత్తులో అధికంగా సంపాదించి జీవితంలో సుఖపడాలని నిరంతరం కోరిక ఉంటుంది.కాని వాయుతత్వ రాశిలో పుట్టడం వలన మీ ఆలోచనల్లో,కార్యక్రమాల్లో స్థిరత్త్వం ఉండక నిరంతరం కొత్త పథకాలను ప్రారంబించడంతో మీకు అప్పులు పెరుగుతుంటాయి.వాటిని తీర్చడానికి మరో కొత్త పధకాలను ఆలోచించడం ఉంటుంది.మీరు ఇలా ఇబ్బందులు పడకూడదు అనకుంటే ఒక సంవత్సరం పాటైన ఆలోచించి మీరు ఇష్టంగా,ఎన్ని గంటలు పనిచేసిన అలసిపోని ,విసుగురాని రంగం ఏదో ఒకటి మీ మనసుకు నచ్చింది ఎంచుకోండి.అలా ఒకసారి దీర్ఘంగా ఆలోచించి ఆ రంగంలో అడుగుపెట్టారంటే ఇక జీవితాంతం ఆరంగం నుండి కదలవద్దు.
మీకు శుచి శుభ్రత ఎక్కువ.పూలు పరిచినట్లు చక్కగా ఉండే బెడ్,తీర్చిదిద్దిన ఇల్లు,రుచికరమైన భోజనంలో మీరు ఆకర్షింపబడడంతో పాటు మీ కాలం కూడా కొంత వాటికి వినియోగిస్తారు.మొక్కలు పెంచడం,చక్కని చిత్రపటాలు సేకరించడం మీకు ఆసక్తి ఉంటుంది.లలిత కళల్లో చక్కని అభిరుచి ,నైపుణ్యం ఉండును.కవిత్త్వం,చిత్రలేఖనం,చలనచిత్ర సంబంధాల్లో మీకు ఆదాయం పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి.గ్రామ జీవనం కన్నా నగర జీవనం మిమ్మల్ని ఎక్కు ఆకర్షిస్తుంది.కాని గ్రామ జీవనానికి సంబందిచిన దృష్యాలు మీ మనసును రంజింపచేస్తాయి.నాగరికతలోని వివిధ నవీనాంశాలు మిమ్మల్ని ఆకర్షించును.రేడియో,టెలివిజన్ ,వైర్ లెస్ శాస్త్ర శాఖలలో మీరు ప్రావిణ్యం గ్రహిస్తారు. జనసామన్యంను రంజింపచేయుట,సభా వశీకరణం,అభినయం మీకు గల మానసిక శక్తులు. కాని ఈ శక్తులన్నీ చిన్న పిరికితనం అనే తెరమాటున పడి ఉంటాయి.దాన్ని జయించకపోతే మీరు జనాలకు దూర దూరంగా మెలుగుతారు.మీరు కార్యరంగంలో దిగుట తప్పనిసరైన సందర్భంలో ఒకసారి దిగిన తరువాత అసాధరణముగా రాణించి సాటివారిని ఆశ్చర్యపోయేట్లు చేస్తారు.పరిసరాలను ,మిమ్మల్ని మీరు మరిచిపోయినపుడు జయం పొందుతారు.జనంతో కలిసి ఉన్నప్పుడు మీ మనస్సుకు కంగారు,విసుగు,భయము కలుగుతాయి.అక్కడి నుండి బయటపడడానికి ప్రయత్నిస్తారు.నిర్మలమైన పరిసరాలు ,వాతవరణం,రుచికరమైన ఆహార పానీయాలు,నాజూకైన వేషదారణ మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి.అటువంటి పరిస్థితిలో ఉన్నంతవరకు మీ తెలివి తేటలకు,మేదస్సుకు ప్రభావానికి లొంగని వారుండరు.మంచి మార్గానగాని చెడ్డమర్గాన గాని జన సముహాన్ని ఉత్సాహపరిచి నడిపించగలరు.ఇట్లు నడిపించుట జాతులపైన,దేశములపైన కూడ ప్రభావం చూపవచ్చును.కానీ మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మొండితనం రూపంలో ఉంటుంది.ఎక్కువ భాగం స్వప్న ప్రపంచంలో విహారించడం ఉంటుంది.మీలో వినయ విదేయతలు,చట్టబద్ధంగా సాంప్రదాయ బద్ధంగా జీవితం నడుపవలెనన్న కుతుహలం ఎక్కువ.మీరు తప్పు చేసిన దాన్ని వాక్చాతుర్యంతో చట్టబద్దంగా చెప్పగలరు.ఘన కార్యాలను గొప్పగా ప్రారంభించి చక్కగా నిర్వహిస్తు రక్తి కట్టే సమయానికి విసగుచెంది,చేసేపనినుండి విరమించి ఇంకోక అందని దానికై పాకలాడటం మీ మన:ప్రవృత్తిలో ఉన్న ప్రధాన లోపం.ఈ లోపాన్ని మీరు వెంటనే సరిదిద్దుకోవాలి.జీవితాంతం ఒకే రంగంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చిన మీరు ఒకే రంగం ఎంచుకుని అందులోనే స్థిరపడాలి.ఒక ఉద్యోగం కాని వ్యాపారం,వ్యాసాంగం కాని అలవడనిచో మీరు ఇక ఆపైన స్థిరముగా పనిచేయలేరు.చిన్నతనంనుండి మనస్సు క్రమబద్దమైనచో న్యాయవాద వృత్తికి ,వైద్యవృత్తికి చక్కగా పనికివస్తారు.ధర్మా ధర్మములను సరిగ్గా అంచనవేయగలరు.శాస్త్ర విద్యలో భౌతిక శాస్త్రం,విద్యుత్,శబ్ద ,రేడియో తరంగాలు, పరిశోధనలు చేయు శాఖలలో మీరు రాణిస్తారు.ఒక లలిత కళను అభిమానించి ప్రావిణ్యం వహించడంకన్నా దాంట్లో ప్రఖ్యాతి గాంచడం ఎక్కువగా జరుగుతుంది. మీ అభిమాన విద్యలలో సినిమా రంగం గాని పోరాట విద్యలుగాని తప్పక ఉంటాయి.చిన్నతనంలోన వివాహం జరిగినచో నడివయస్సున మరొక వివాహంగాని ,దానికి సరిపోవు మరో యోగం గాని జరుగవచ్చును.

1 కామెంట్‌:

Damarapalli mahender చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

ఆత్మ జ్ఞానం కోసం అన్వేషించేవారికి చివరి మజిలి