పేజీలు

7 ఏప్రిల్, 2009

సూక్షశరీర ప్రయాణం

సూక్షశరీర యానం
సూక్షశరీరం అంటే శరీరం ఏమిటి ?
మన భౌతిక శరీరం ఎలా ఉంటుందో దాన్ని ఆవరించుకునే ఒక తొడుగులా సూక్షశరీరం ఉంటుంది.ఇది యోగుల ధృష్టికే తప్ప మాములు కంటికి కనపడదు.జీవికి భౌతిక శరీరం చనిపోయిన సూక్షశరీరం నిలిచేఉండి ఆ సూక్షశరీరంతోనే మరో జన్మ తీసుకుంటుంది.సూక్ష్మ శరీరం ఉన్నంత కాలం కూడ జీవిత జననమరణ చ్రకం తప్పదు.సూక్షశరీరం కారణ శరీరాన్ని ఆదారం చేసుకుంటుంది.ఆధునిక మనిషి కంటికి కనపడని ఏ విషయాన్ని నమ్మని పరిస్థితుల్లో భౌతిక శరీరాన్ని విడిచి పెట్టి సూక్షశరీరం ద్వార ఎక్కడెక్కడో తిరిగిరావచ్చు అంటే నమ్మడం చాల కష్టం.
సరైన హేతువాదం అంటే దేన్ని నమ్మకపోవడం కాదు.ఒక విషయం నిరూపణకు సిద్దంగా ఉన్నప్పుడు కూడా దాన్ని పరిశోధించిక ఊరికే కొట్టిపడేయడం సరైన హేతువాదం అనిపించుకోదు. ప్రతి ఒక్కరు సాధన ద్వార తమ తమ భౌతిక శరీరాలను వదిలిపెట్టి సూక్ష శరీర యానం చేయవచ్చు అనేది వాస్తవం.
మీలో నిజమైన పట్టుదల ఉంటే మీరే స్వయంగా పరిక్షించుకుని చూడండి.కాని సాధనకు ముందే ఒకే విషయం గుర్తుంచుకోండి.ఒక బ్రిడ్జ్ కట్టడానికి ఇంజనీర్ కోర్సు,ఒక రోగి శరీరాన్ని కొసి పరిక్షించడానికి మెడిసిన్ కోర్సు ఎలాగైతే ఓ నాలుగేళ్ళు చదివి,సాధనచేసి మాత్రమే అందులో ఉత్తీర్ణులవుతున్నారో ,అలాగే ఈ సూక్ష్మ శరీర ప్రయాణానికి తగిన కాల వ్యవది సాధన కోసం వెచ్చించాల్సి వస్తుంది.ఎంతకాలం అనేది మీ యోగ్యత,నమ్మకం,సాధన మీద ఆధారపడి ఉంటుంది.
సాధన : ముందుగా అసలు సూక్షశరీర యానం అనగానే మీకో ఆలోచన వచ్చి ఉంటుంది. మీ ఆలోచన ప్రవాహం మీకో నమ్మకాన్ని ఏర్పరిచి మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళుతుంది.మీకా నమ్మకం లేకుంటే ఇక్కడి వరకు చదువుకుంటూ వచ్చేవారే కాదు. కాబట్టి అసలు ఆలోచన గురించి ఆలోచించండి. ఆలోచనను ఎక్కడ ఉండాలని మీరు కోరుకుంటారో ,అది అక్కడే ఉంటుంది.
మీ ఆలోచనను సూక్షశరీరయానం మీద పెట్టండి.
ఇక సాధన మొదలు పెట్టండి.ముందు ఎవరు ఎలాంటి విఘ్నాలు కల్గించని ఏకాంత ప్రదేశం చూసుకుని ఒంటరిగా బెడ్ రూమ్ లో పడుకోండి.మీరు సూక్షశరీర యానం చేయగలరు అని సంపూర్ణంగా ముందుగా నమ్మకం ఏర్పరుచుకోండి.ఎంతో అద్భుతమైన సూక్షశరీరయానానికి మీరు సిద్దపడుతున్నందుకు టెన్షన్ పడకుండా పూర్తి విశ్రాంతిగా మంచం మీద పడుకుని కళ్ళుమూసుకుని సేదతీరండి.మీ ఆలోచననను ఇక ఒక విషయం మీద పూర్తిగా కేంద్రీకరించండి.మీ భౌతిక శరీరం నుండి సూక్ష్మంగా ఉన్న మరో శరీరం విడిపడుతున్నట్ల పూర్తి ద్యాసను అక్కడే ఉంచి ఆలోచించండి.మీకు ఆ ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఏది మీ మనసులో రాకూడదు.మీ ధ్యాసను అక్కడే ఉంచి మీరు నెమ్మదిగా సూక్షశరీరం ద్వార బయటపడుతున్నట్లు ఆలోచిస్తూనే ఉండండి.అసలు ఇలా సూక్షశరీరయానం సాధ్యమేనా కాదా,ఇది ఊరికే టైమ్ వేస్ట్ ప్రయోగం అని,రోజులో జరిగిన మరేవో ఆలోచనలు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తుంటాయి. పట్టువదలని విక్రమార్కునిలా మాటిమాటికి మీ ఆలోచనలు పక్కదారిలో వెళ్ళిన మీ అసలు లక్ష్యంపైనే కేంద్రీకరించండి. నిముషాలు గడుస్తూనే ఉంటాయి.మీలో నుండి ఎలాంటి సూక్షశరీరం బయట పడడంలేదని అప్పుడే నిరాశ పుట్టిందా? మీ సాధనలో కెల్లా అతిముఖ్యమైన అవరోధం ఇదే..ఓ కరాటే,కుంగ్ ఫూ,బాక్సింగ్ లాంటి సాధనలు చేస్తుండగా మీరెప్పుడైనా చూసారా.శరీరం హూనం అవుతుంటుంది.ఒంట్లో చమట దారలై కారిపోతుంటుంది.శరీరంలో నొప్పులు పెచ్చరిల్లుతుంటాయి.ఊపిరితిత్తులు కొలుములై మండుతుంటాయి.బతికుంటే బలుసాకు తినవచ్చు ఈ సాధన ఇంతటితో ఆపేద్దాం అనిపిస్తుంది. అలా ఓ నాలుగేళ్ళు సాధన చేసి శరీరం వజ్రకాయమైతే తప్ప ఓ బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరుకుంటాం.
అలాంటి సాధనతో పోలిస్తే ఈ సూక్షశరీరయాన సాధన ఎంతో సులభం..కావల్సిన మొదటి అర్హత అల్లా విసుగేసి మద్యలోనే వదిలిపెట్టకుండా ఉండడం..ఇది చదివిన వాళ్ళు నూటికి 90 శాతం మంది ఇలా చదివి ఓహో మనిషికి సూక్షశరీరం అనేది కూడా ఒకటుందా...దాంతో భౌతిక శరీరాన్ని వీడి ప్రయాణం కూడా చేయవచ్చా అని అలా చదివి ఇలా ఊరుకుంటారు,తరువాత ఎప్పడో సాధన చేద్దామని(ఆ తరువాత అనేది ఎన్నేళ్ళు గడిచాక కూడా అలాగే ఉండడం వారినే ఆశ్చర్యపరుస్తుంది).మిగిలిన పదిశాతం సాధన మొదలు పెట్టి
దాంట్లో 8 శాతం ఒకటి రెండు రోజుల్లోనే ఆ విషయమే మరిచిపోతుంటారు.మిగిలిన 2 శాతం మాత్రమే సీరియస్ గా సాధనచేస్తారు.వారిలో 1శాతం తొందరలోనే సూక్షశరీర ప్రయాణం చేసే స్థితి ఖచ్చితంగా వస్తుంది.మిగితా 1 శాతంకు కాల పరిపక్వత మీద సిద్దిస్తుంది.
ఇంకో నమ్మలేని నిజం ఏమంటే మీరంతా సూక్షశరీరయానం చేసిన చేయకున్న ప్రతి ఒక్కరు సూక్షశరీర స్పర్శను,అనుభూతిని ఏదో ఒకనాడు పొందినవారే.ఎలాగంటారా? మీరు నిద్రపోతున్నప్పుడు మీకు ఉన్నట్లుండి ఒళ్ళంతా జలదరించినట్లు శరీరం ఉలిక్కిపడడం ఎన్నడో ఒకరోజు అనుభూతి చెందే ఉంటారు.అదే సందేహం లేకుండా సూక్షశరీర అనుభూతే. మీరు నిద్రపొతున్నప్పుడు మీ భౌతిక శరీరం నుండి విడిబడి బయటపడడానికో ,సర్ధకుపోవడానికో సూక్షశరీరం చేసే ప్రయత్నమే ఒళ్ళ జలదరించే అనుభూతి.మరొక వాస్తవం మనం కలలు అని చెప్పుకునేవి సూక్షశరీర ప్రయాణాలే. మీరు చేసే సూక్షశరీర ప్రయాణాలు మొదట్లో నిద్రపోయిన తరువాత జరుగుతాయి.కాని కలకు సూక్షశరీర ప్రయాణానికి మీకు సృష్టమైన తేడా తెలుస్తుంది.మీరు సాధనలో అత్యున్నత స్థితికి చేరినప్పుడు భౌతికి శరీరం సృహలో ఉండగానే మీరు సూక్ష శరీర ప్రయాణం చేయగలుగుతారు.
మీరు సాధన చేస్తున్నప్పడు కూడా ఇలాగే మీ భౌతిక శరీరం నుండి సూక్షశరీరం బయటపడే సమయంలో ఓ కుదుపు ఏర్పడుతుంది.అదే లక్ష్యంగా సాధనపెట్టుకుని సాధన మొదలు పెట్టండి.

మీ సాధన పలించిన రోజున మీకు సూక్షశరీర ప్రయాణం చేసే శక్తి వచ్చింది.ఆ తరువాత ఏం జరుగుతుంది?మీ శరీరం నుండి మీరు బయటపడి తలతిప్పి పక్కకు చూస్తే ఒక్క సారిగి భయపడేంతా పని జరుగుతుంది. మీ భౌతిక శరీరాన్ని అద్దంలో నుండి చూసినట్లుగా కాకుండా మరోకరిగా మిమ్మల్ని మీరే ఓ కళేబరంలా మీరు మొదటి సారిగా చూడడం నిజంగా భయపడే విషయమే.మీ జీవితంలో ఏనాటికి నమ్మలేని విషయాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు,కాబట్టి నమ్మక తప్పదు.కాని భయపడితే మాత్రం మీరు ఎంతో సాధనతోని పొందిన సూక్షశరీరం వెంటనే మీ భౌతిక శరీరంలో దూరిపోతుంది.బయపడకుండా ముందే సిద్దంగా ఉండండి.మీ సాధన స్థిరత్వం పొందిన తరువాత,మీరు ఏ రోజు కావాలంటే ఆరోజు సూక్షశరీరంతో బయటకు వచ్చిన రోజున చిన్నగా బయట విహరించడం మొదలుపెట్టండి.ఆస్ర్టోనాట్లు అంతరిక్షంలోకి వెళ్ళిన తరువాత భారరహిత స్థితిని పొందినట్లు మీ సూక్షశరీరం కూడా భార రహిత స్థితలోనే ఉంటుంది.మీ భౌతిక శరీరాన్ని వదిలి మీరున్న గదిలో అటు ఇటు కదలడం మొదలుపెట్టండి.మీ శరీరం నుండి సూక్షశరీరంగా బయటపడితే మీ భౌతిక శరీరం ఓ మృత శరీరంలా కనపడవచ్చు.కాని అది సజీవమే.మీ భౌతిక శరీరం,సూక్షశరీరం అనుసంధానంగా ఓ సిల్వర్ కార్డ్ నిరంతరం లింక్ గా ఉంటుంది. ఈ సిల్వర్ కార్డ్ అనుసంధానంగా మీరు సూక్షశరీరంతో ఎంత దూరాలైనా వెళ్ళవచ్చును.
మీరు గదిలోనుండి అటు ఇటు భార రహిత స్థితిలో ఎగరండి.మీ గదిలోని వస్తువులని ముట్టకోండి.మీకు విశ్వాసం పెరిగిన రోజున గది నుండి బయట ప్రపంచంలో అడుగుపెట్టండి.బయటి భౌతిక ప్రపంచంలో మాదిరిగానే కనపడుతుంది.మరికొన్ని ఉజ్వల కాంతులు దర్శనమిస్తాయి.ఇంటి చుట్టుపక్కలా ,పక్కవీదీలోకి,పక్క ఊళ్ళోకి వెళ్ళివస్తూ ఉండండి..క్రమంగా మరింత దూర దూరాలకు వెళుగలుగుతారు.
హాలివుడ్ సినిమా ‘హాలోమాన్’లో మాదిరిగా ఎవరికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు.కాని సినిమాలోని ఇన్విసబుల్ మాన్ కు మాదిరి ఆలోచనలు మీకుంటే మీరు సూక్షశరీర యానం ఏనాటికి చేయలేరు.మీ మనసు పసిపాపలా శుద్దమైనప్పుడే మీకా అర్హత పరమాత్మ కలిపిస్తాడు.
మీరు సూక్షశరీరంతో ప్రయాణాలు మొదలుపెట్టినప్పుడు,ఎల్లలెరుగని,రోడ్లు,భవనాల దగ్గరకు,
పాస్ పోర్టు ,వీసా అవసరం లేని అంతర్జాతీయ ప్రయాణాలకు,సముద్రాలు,ఆకాశంమీదకు తిరిగిరావచ్చు.మీ స్నేహితుల్ని,బంధువుల్ని,మీ ప్రియమైన వారిని చూసి రావచ్చు.సూక్షలోకాల్లో ఎక్కడెక్కడో విహారించి రావచ్చు. మీరు ఎక్కడెక్కడికి ఎంతెంత దూరలకు పోయినా మీ సూక్షశరీరాన్ని భౌతిక శరీరంతో అనుసంధానించే సిల్వర్ కార్డ్ వెండితీగలా సాగుతూ వస్తునే ఉంటుంది.వెనుకటి రోజుల్లో ఈ సూక్షశరీర ప్రయాణాలు అందరు చేయగలిగే శక్తితో ఉండేవారు.కాని ఆ శక్తిని దుర్వినియోగం చేయడం వలన ,మనుషుల నుండి ఆ శక్తులు ఉపసంహరించుకోబడ్డాయి...మీరు ఒక సారి సూక్షశరీర ప్రయాణం చేయడం మొదలు పెడితే మీకు అన్ని విషయాలు అవే అర్థం అవుతాయి.
ఇంకా ఆలస్యం ఎందుకు ఒక శుభ ముహూర్తం చూసుకుని , ఈ సాధన మొదలుపెట్టండి.

6 కామెంట్‌లు:

Siva చెప్పారు...

Aravind Garu, Article is very good. But my doube is have you travelled like this. This is not this much simple as you said. It is possible for any 1 out of Crores. Anyhow, this is a good article.

Rajasekharuni Vijay Sharma చెప్పారు...

మీరు చాలా మంచి విషయాలు రాస్తున్నారు. అందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మీనుండి తెలుసుకోవాలని అభిలషిస్తున్నాను. కనుక నా వంటి వారి కొరకు తరచుగా కొత్త టపాలు రాస్తూ ఉండగలరు.

మీ బ్లాగును ఫాలో అవడానికి అనుచర లింక్ పెట్ట గలరు. :)

Rajasekharuni Vijay Sharma చెప్పారు...

రవీందర్ గారు మీరు నాకు ఒకసారి mail చెయ్యగలరా...

rajasekharuni.vijay@gmail.com

అజ్ఞాత చెప్పారు...

eroju chala manchi roju,intha manchi visyshyamu thelusukovatumu,danyavadamlu

Unknown చెప్పారు...

sukshma sariramtho paga theerchukovacha

అజ్ఞాత చెప్పారు...

సమాధి


మాటలకు అతీతంగా ఆత్మ చైతన్యం సూక్ష్మమౌనంలో ఉండాలి దేవునికి భాషలు తెలియవు. కనుక భాష యొక్క అవసరం లేదు. మనం దేవుని సమక్షంలో పూర్తిగా ఆత్మ చైతన్యం సూక్ష్మమౌనంలో ఉండాలి. మహామౌనమే ప్రార్ధనలోని నిజమైన చైతన్యం సౌందర్యం." ఆత్మ చైతన్యం సూక్ష్మమౌనం ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఎదిగాడా లేదా అని ఎలా చెప్పగలం మనిషికి దేహవాసన,లోకవాసన, శాస్త్రవాసన అని మూడు ప్రతిబంధకాలుంటాయి. వీటిని ఎంతగా తగ్గించుకుంటే అంతగా అంతరిక జీవితంలో ముందుకు పోగలుగుతాడు. తన దేహాన్ని, తన చుట్టూ ఉన్న లోకాన్ని, తనదనుకునే జ్ఞానాన్ని మరచిపోగలిగినవాడు నిజంగా మహాత్ముడే. అట్టివాడే ఆత్మజ్ఞుడు.మానవుడికి గల ఆధిపత్యం, అతడు పొందిన ప్రగతికి కారణం, అతడి మనస్సే అయినా, దానిని గురించి అతడికి అజ్ఞానం, మానవుడికి ముక్తిని బాహ్యాం తరంగ ప్రకృతుల బంధాలనుండి విమోచనం మనస్సుద్వారా సార్థకత పొందటం మనస్సును ఏకాగ్రత తో నిలిపినప్పుడు, ఇది ఆత్మ దర్శనమునకు సూటి దారి గురువు

దారి నిరాకార, నిశ్చల, నిరంజన స్థితి అంటే అదే. ఒక్క క్షణం కనులు తెరిచి చూసాడు. లగ్నంఅవుతుంది. ఒక్క క్షణం కదలకుండా ఉండు” అంటే ఆ క్షణంలోనే ఎక్కడలేని అనవసర విషయాలన్నీ నాకే కావాలి .... మనిషి జీవితానికి ఒక పరమ గమ్యం ఉందని అది ఆత్మ సాక్షాత్కారం అని నమ్ముతాను. ..(దేహమును వదిలే) ఒక్క క్షణంఅంతటా వ్యాపించి వుంది సూక్ష్మము ఆకాశములోకి వెళ్లి ... కేవలం చూపులతో ఆత్మ సాక్షాత్కారం కలిగించిన ఈ సకల చరాచర సృష్టిలో ఏ జీవుల మధ్యా బేధం లేదు, ... ఇది ఆత్మ దర్శనమునకు సూటి దారి ఆత్మ చైతన్యం ఒక్కటే క్షణం మార్గదర్శనం అవుతుంది. ... ఒక్క క్షణంలో దాని రూపమే మారిపోతుంది. ఆ విధంగానే ""నేను'' ""నాది'' అన్న భావం భస్మం కావాలి. ... ఆ దశలో ఆత్మ సాక్షాత్కారం పొందిన జీవికి వేదాలు కూడా అప్రధానములే అవుతాయి. తనను తాను తెలుసు కొన్న మరుక్షణం అతడు ఈ లోకం లో ఒక్క క్షణం కూడా ఉండడు. అందుకే ఆ జ్ఞానాన్ని దాచి .... మనిషి జీవితానికి ఒక పరమ గమ్యం ఉందని అది ఆత్మ సాక్షాత్కారం అని నమ్ముతాను. ఆత్మ సాక్షాత్కారం సద్గురువు కృప వలనే సాధ్యం.భక్తి విశ్వాసాలు, నమ్మకం మాత్రమే ! ఏ మేరకు మనలో భక్తి ప్రవృత్తులు, విశ్వాసాలు చోటు చేసుకుం టాయొ, ఆ మేరకు భగవంతుని అనుగ్రహం అతి శ్రీఘ్రం గా లభిస్తుంది. ఇది సత్యం. ఆత్మ జ్ఞాని ని. కనుక లోకుల మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేయ్యటం ఉత్తమం.మానసిక అని మూడు చెబుతారు కదా. మనసా వాచా కర్మణా అని కూడా అంటారు. మనిషికి ఈమూడు స్థితులలోనూ ఏదో ఒక ఆధారం కావాలి. ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఎదిగాడా లేదా అని ఎలా చెప్పగలం అని సందేహం ఉండేది.మనిషికి ఎంతగా దేహస్పృహ తగ్గుతుందో అంతగా ఆధ్యాత్మికంగా ఎదిగినట్లు అని నా భావన. మీరేమంటారు?మనిషికి దేహవాసన,లోకవాసన, శాస్త్రవాసన అని మూడు ప్రతిబంధకాలుంటాయి. వీటిని ఎంతగా తగ్గించుకుంటే అంతగా అంతరిక జీవితంలో ముందుకు పోగలుగుతాడు. తన దేహాన్ని, తన చుట్టూ ఉన్న లోకాన్ని, తనదనుకునే జ్ఞానాన్ని మరచిపోగలిగినవాడు నిజంగా మహాత్ముడే. అట్టివాడే ఆత్మజ్ఞుడు.దేవునికి భాషలు తెలియవు. కనుక భాష యొక్క అవసరం లేదు. మనం దేవుని సమక్షంలో పూర్తిగా మౌనంలో ఉండాలి. మహామౌనమే ప్రార్ధనలోని నిజమైన సౌందర్యం మన అష్టోత్తరాలు సహస్రనామాల పూజలు చూస్తున్నపుడు పూజారి ఇవి చదువుతూ పూజ చేస్తుంటాడు. పూజ మన బాధ్యత కాదు. అది పూజారి బాధ్యత. తీర్ధం తీసుకోడమే మన పని అనుకుంటాము. ఇది పూజ ఎలా అవుతుంది? మనం కొట్టే కొబ్బరికాయకు దేవుడు కరిగిపోవడానికి ఆయన అంత లేనివాడా? పూజారులు, మధ్యవర్తులు అవసరం లేకుండా మనంతట మనం దేవునితో సరాసరి అనుసంధానం కావచ్చు. దానికి మనస్సును ఆపాలి. ఆలోచనలను ఆపాలి. ఇది చెయ్యగలిగితే, మహామౌనంలో ఉండగలిగితే దేవునితో టక్కున అనుసంధానం కలుగుతుంది. మౌనంగా ఉండు ఉండగలిగేవానికి అసలు నామం యొక్క అవసరం లేదు. భావాతీత స్థితి అదే ప్రాప్తిస్తుంది. మనస్సుతో శరణాగతి పాటించడు. అలా పాటించగలిగిన వానికి ఈ దీక్ష అవసరం లేదు. దీక్షాఫలం తత్క్షణమే వానికి దక్కుతుంది. వానికి ఆ వేషం అక్కర్లేదు. ఈ గోలా అక్కర్లేదు. నిజంగా మనస్సుతో శరణాగతి కాగలిగితే వాని మాటలు తత్క్షణమే ఆగిపోతాయి. వాని ఆలోచనలు టక్కున ఆగిపోతాయి. మహామౌనం ఆవహిస్తుంది. ఆ మౌనంలో శక్తితో అనుసంధానం కలుగుతుంది.
rathnam.sjcc@gmail.com

ఆత్మ జ్ఞానం కోసం అన్వేషించేవారికి చివరి మజిలి