పేజీలు

20 ఫిబ్రవరి, 2014

డా.న్యూటన్ గారి సూక్షశరీర ప్రయాణం పాఠం-2

చాప్టర్ 2. మీ అస్ట్రల్ బాడి రిలీజ్ అయిన తరువాత ఏదైతే ముఖ్యమైన గత జన్మల ప్రభావం మొత్తం ఒక్కోక్కటి బయటకు వస్తాయి.తరువాత మనం ఎంతో మంది మాష్టర్స్ ను కలుస్తాము. అస్ట్రల్ బాడి ఆస్ట్రల్ తలలాకు,లోకాలకు వెళుతుంది. లోయర్ , హైయ్యర్ అస్ట్రల్ వరల్డ్స్ అని ఉంటాయి. ఎన్నో ఆస్ట్రల్ వరల్డ్స్ ..అక్కడకు వెళితే మనకు రాబుద్దికూడా కాదు. ఈ ప్రయాణం పూర్తి వినోధంగా, విఙ్ఞాన భరితంగా ఇన్ స్పిరేషన్ గా ఉంటుంది. ఎంతో మంది ఆస్ట్రల్ ఫ్రెండ్స్ ను కలుస్తాము. ఎంతమందిని కలుస్తాం అంటే , మీరెప్పుడు ఒంటరి అని ఫీల్ కానేకారు. ఆ అస్ట్రల్ ఫ్రెండ్స్ ఎంతగా మిమ్మల్ని ఆత్మ స్నేహితుడుగా ఫీలవుతారంటే ఇక్కడి మాదిరిగా దూరాలు ఉండవు. నువ్వు వేరు నేను అనే భావనతో ఉంటాం ఇక్కడ. అక్కడికి మనం వెళ్ళినప్పుడు మనమంతా ఒక్కటే అనే ప్రభావంతో వాళ్థు మీతొ ఉంటారు. అస్ట్రల్ ట్రావెల్ చేస్తే చాలమంది అంటుటాము,ఇంకా అన్ని అస్ట్రల్ వరల్డ్స్ నే కదా..ఇక ఈ భౌతిక ప్రపంచాన్ని మరిచిపోతామని. అలా కాదు.మన భౌతిక ప్రపంచం పట్ల ఇంకా గౌరవం పెరుగుతుంది.మన జీవితం పట్లకూడా రెస్పెక్ట్ పెరుగుతుంది. మన జీవితం ఇంకా అత్యున్నతంగా జీవించవచ్చు అనే ఙ్ఞానం పెరుగుతుంది. ఎంత అధ్బుతంగా ఆనందంగా జివించవచ్చు అనే ఙ్ఞానం మనకు దొరకుతుంది. చాలమంది అస్ట్రల్ ట్రావెల్ ఇక్కడ ఏంలేదు, అంతా అక్కడే ఉంది అనుకుంటారు. కాదు. మనమే ఎంచుకుని ఇక్కడ భూమండలం మీదకు వచ్చామని ఙ్ఞానం కలుగుతుంది.తరువాత ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ లోని వివిధ స్థాయిల గురించి తెలుసుకుందాం. అస్ట్రల్ ట్రావెల్ లో వివిద రకాలైన స్థాయిల్లో ఈ ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది. ఈ భూమండలం మీద అన్ని ప్రపంచదేశాలనుండి అమెరికా,ఐరోపా,అస్ట్రేలియా,ఇండియా అంతాటా కల ఒక 1000 మంది ధ్యానుల అనుభవాలన్ని క్రోడికరిస్తే అందరినుండి ఇదే ఙ్ఞానం వచ్చింది.అందరు కూడా ఇదే విషయం చెప్పారు. నాలుగు స్థాయిల్లో ఈ ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుందని. మొదటి దశ మహ స్పందన స్థాయి. (వైబ్రేషన్ స్టేజి) మీ ఆస్ట్రల్ బాడి రిలీజ్ అయ్యేముందు మీ శరీరంలో ప్రకంపనలు పెరుగుతాయి(బాడిలో వైబ్రేషన్స్). శరీరం తక్కువ ప్రకంపనల స్థాయి నుండి ఎక్కవ స్థాయి ప్రకంపన స్థాయికి వెళుతుంది. మీ ఎనర్జీ లెవల్స్ పెరిగిపోతాయి. ప్రకంపణాల స్థితి వస్తుంది. సాదారణంగా మన కాళ్ళ వేళ్ళ నుండి ప్రకంపణాల స్థితి మొదలయ్యి మొత్తం శరీరం అంతా వ్యాపిస్తుంది.ఆ ప్రకంపనలు అసౌకర్యంగా ఏమి ఉండవు. శరీరంలో సౌకర్యంగానే ఆ ప్రకంపనల సెన్సేషన్స్ ఉంటాయి. ఆ ప్రకంపణాలను చూస్తే ముందుగా భయమేస్తుంది. ఏంటి నా శరీరం ఊగిపోతుంది,ఏదో తిమ్మిరి తిమ్మిరిగా ఉంది,బరువెక్కిపోతుంది అనిపిస్తుంది. చాలమందికి వారి శరీరం వేల కొద్దికిలోల ,టన్నుల బరువు ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ఒక ఏనుగును మీ మీద పెట్టేస్తే ఎంత బరువు ఉంటుంది?అ మొదటి స్థితిలో మీ శరీరం అంతా బరువెక్కిపోతుంది. ధ్యానంలో కూర్చుంటారు.చాలా విపరీతమైన బరువు వచ్చేస్తుంది.శరీరం బరువెక్కింది,తిమ్మిరెక్కింది అని భయమేస్తుంది. స్ప్రహ కోల్పోతామే ఏమో అని కూడా అనిపిస్తుంది. అది ఏమంటే మహా స్పందన స్థాయి.(వైబ్రేషన్ స్టేజి)ఇది మీరు నిద్రపోతున్నప్పుడు కూడా కలుగువచ్చును. మీరు నిద్రపోతున్నప్పడు, సరిగ్గా నిద్రలోకి జారుకునే సమయంలో ఒక సంధి ఆవస్థలో అటూ చైతన్య స్థితినుండి చైతన్యం లేని స్థితిలోకి జారిపోతుంటారు. ఈ రెంటికి మధ్యలో ఒక దశ ఉంటుంది. అటూ పూర్తి చైతన్యం (కాన్షియష్)కాదు, చైతన్యం లేని స్థితి (ఆన్ కాన్షియష్ ) కాదు. మద్యలో ఉంటారు. సూక్షశరీర ప్రయాణంలో అలాంటి స్థితే, మొదటిదైన మహ స్పందన స్థాయిలో ప్రకంపనలు పెరిగిపోయి మీ శరీరం విపరీతంగా బరువుపెరిగిపోతుంది. అప్పుడు మీకు భయమేస్తుంది.మీ చేతులను ఎత్తాలనుకుంటారు.కళ్ళు తెరువాలనుకుంటారు.చేతులు ఎత్తలేరు.కళ్ళు తెరువలేరు.తరువాతఎవరినైనా పిలువాలనిపిస్తుంది.నాకు ఇలా అవుతుంది రండి రండి అని గొంతుతో ఎవరినైనా పిలువాలనిపిస్తుంది.అప్పడు ఎవరిని మీరు పిలువలేరు.ఒక్క మాట కూడా మీ గొంతులోనుండి రాదు. అలాగే మీ చాతి బరువెక్కిపోతుంది.ఎంత బరువెక్కిపోతుంది అంటే ఏదో దయ్యం మొచ్చి కూర్చుంది అని భయమేస్తుంది. అది దయ్యం కాదు మీ సూక్షశరీరమే మీ స్థూల శరీరం నుండి విడుదల కావడానికి సిద్ధంగా కూర్చుంది.చాలమందికి ఆ భయంలో ఏదో అస్ట్రల్ ఘోస్ట్ వచ్చి నా మీద కూర్చుందని, మాములుగా అయితే దయ్యం తొక్కిందని అంటారు. పల్లెల్లో తెలియక నన్ను దయ్యం తొక్కిందని అంటుంటారు. కాదు. ఆదయ్యం మీదే.మీ శరీరం నుండి బయటకు వచ్చే క్రమంలో ముందుగా అక్కడ అతిభారం అయిపోతుంది.కాబట్టి ఇది మహా స్పందన స్థాయి. కాబట్టి ఎవరైతే మహాస్పందన స్థాయి అనే ఈ భయాన్ని అధిగమిస్తారో రెండవ స్థితిలోకి వెళ్ళిపోతారు. రెండవ స్థితిలో స్థూల శరీరం నుండి ఎడబాటు స్థాయి. విడిపడటం. స్థూల శరీరం మరియు సూక్షశరీరం రెండు విడిపోవడం.ఈ స్థితి జరిగేప్పుడు కూడా మనకు కొన్ని వాసనలు,సువాసనలు రావడం శబ్ధాలు వినపడడం జరుగుతాయి. సాదారణంగా శబ్దాలు వినపడుతాయి. ఒక చక్కని మ్యూజికల్ సౌండ్స్ వినిపిస్తాయి. వివరీతంగా గాలి హోరెత్తినట్లుగా,వీస్తున్నట్లుగా అనిపిస్తుంది. లేదంటే అప్పటివరకు బరువుగా ఉన్న శరీరం ఒక్కసారిగా తేలిక అయిపోతుంది. ఎంత తేలిక అయిపోతుందంటే బెలూన్ లాగా పైకి తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ సమయంలో మీరు శరీరం బయట ఉన్పప్పుడు మీకు భయమేస్తుంది. నేను చనిపోయానేమో,మరణించానేమో, ఇక నా పిల్లల గతి ఏంటి అనే ఒక భయమేస్తుంది. సాదారణంగా మనకు ఆ భయం ఎప్పుడు వస్తుందో మనం ఆటోమెటిగ్గా మన స్థూల శరీరంలోకి దూకుతాం(జంప్ చేస్తాం) వచ్చి ధాం..అని పడిపోతాం.ఈ భయాన్ని కూడా జయించాలి...ఈ రెండో స్థితిల కూడా భయం కలుగుతుంది. (అప్పడు ..ఒక సాథకురాలు తనకు ఫూణెలోని ఒషో మెడిటేషన్ సెంటర్లో వచ్చిన అనుభవం చెప్పింది. వేరేలోకంలో ఒక మీటింగ్ కు హజరైన్నట్లు,తరువాత భయమేసి వెంటనే కళ్ళు తెరిచి చూడగానే తిరిగి స్థూల శరీరంలో ఉన్న స్థితికి రావడం వర్ణించింది.) కాబట్టి నేను ఎక్కడ ఉన్నాను అనే భయం కల్గినప్పడు తిరిగి స్థూల శరీరంలోకి వచ్చిపడుతాం.దానిని కూడా మనం అధిగమించాలి.ఇవన్ని మెళుకువలు.సూక్షశరీర ప్రయాణంలో ఇవన్ని నేర్చుకోవాల్సిన మెళుకువలు.వాటిని గుర్తించాలి.ఎరుకతో ఉండాలి.మహ స్పందన స్థాయి వచ్చిందంటే అది మొదటి స్థితి అని వాసనలు,శబ్దాలు,శరీరం తేలిక అయిపోయే స్థితి వచ్చిందంటే అది రెండవ స్థితి అని గ్రహించగలగాలి.కారులో మొదటి గేరు నుండి రెండవ గేరు వేసుకన్నట్లు , రెండవగేరు నుండి మూడవ గేరుకు వేసుకున్నట్లు .. మూడవ గేరుకు వెళ్ళినప్పడు మూడవ స్థితి.. అన్వేషణ స్థాయి.(ఎక్స్ ప్లోరేషన్ స్టేజి). మూడవ స్థితి.. అన్వేషణ స్థాయి.మీ సూక్షశరీరం బయటకు వచ్చిన తరువాత అన్వేషణ స్థితిలోకి వెళ్ళాలి.మీ శరీరం బయట ఉన్నప్పడు మీకు తెలిసిపోతుంది, నా స్థూల శరీరం అక్కడ నిద్రపోతుందా లేదా ధ్యానం చేసుకుంటుంది అని. తరువాత మీగదిలో పక్కన ఉన్న గోడలు చూస్తారు.ఇస్టమున్న ప్రకృతిని చూస్తారు.ఏమేమి ఉన్నాయో అన్ని చూడగలుగుతారు.సూక్షశరరీంతో మీకు ఎలాంటి దృష్టి (విజన్) వస్తుందంటే 360 డిగ్రీల విజన్ వస్తుంది. స్థూల శరీరంతో ఉన్పప్పడు మీరు ఒక్క ముందున్నయే చూస్తారు. సూక్షశరీరానికి అన్నీ కళ్ళే. మొత్తం చుట్టూరుగా ఉన్నదంతా తెలిసిపోతుంది.క్రిస్టల్ క్లియర్ క్లారిటి విజన్ ఉంటుంది.ప్రతీది కలర్స్ తదితరం క్లియర్ గా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆరా కలర్స్ కనిపిస్తాయి. మీ పడక గదిలో గడియారం ఉందనుకోండి. ఆస్ట్రల్ బాడిలో ఆ గడియారంలో టైం చూడడానికి ట్రైచేసారనుకోండి. ఆ గడియారం గడియారం రూపంలో కనిపించదు. దాని శక్తి స్వరూపం(ఎనర్జీ ఫామ్) కనిపిస్తుంది మీకు.వేరే కలర్ లో వేరే రూపంలో దాన్ని చూస్తారు.టైంను క్లియర్ గా చూడగలుగుతారు.ప్రతిదాంట్లో దాని ఆరా కలర్స్ కనిపిస్తాయి. గోడ కలర్స్ చూస్తే దాని ఆరా తెలుస్తుంది మీకు.మీరు భౌతికంగా చూసినప్పడు మాదిరిగా కాక దాని ఆరా కలర్స్ మీకు కనిపిస్తాయి. కాబట్టి ఈ మూడవ దైన అన్వేషణ స్థాయిలో మీరు ఏం చేయవచ్చంటే , మీ శరీరంనుండి బయటకు వచ్చిన తరువాత వెంటనే ఎక్కడికో వెళ్ళిపోకుండా మీ ఎరుకతో ఎక్కడున్నారో చూసుకోవాలి.మీ స్థూల శరీరాన్ని మీరు చూసుకోవాలి.ఆ ఎరుకను మీరు సాధించాలి.మీ సిల్వర్ కార్డును మీరు చూసుకోవాలి.ఆ తరువాత మీరు ప్రయాణం చేయవచ్చును, ఎక్కడికైనా...ఫ్రీ టికెట్.. ఈజిప్ట్ అంటే ఈజిప్ట్..హిమాలయా పర్వాతాలు అంటే హిమాలయా పర్వాతాలు.ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు.నో వీసా..నో పాస్ పోర్టు. ఏ కంట్రీ కైనా మీరు వెళ్ళిపోవచ్చు. అన్వేషణ స్ధాయిలో మనం టూర్ ప్రోగ్రాం సిద్ధం చేసుకోవచ్చు.(ఐటనరి ప్రిపేర్) నేను ఇక్కడికి వెళ్ళి.నా ఆస్ట్రల్ గైడ్ ను కలిసి ,ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి,నా ఫ్రెండ్ కు కూడా బై చేప్పి , అటునుంచి ఇటు వచ్చేస్తాను అని ప్రోగ్రాం సిద్ధం చేసుకోవచ్చు.కాని ఆ ఎరుకను పంపాదించడానికి మీరు ఆరంభంలో చాలా ఆస్ట్రల్ ట్రావెల్ చేసి ఉండాలి.మీ ఆస్ట్రల్ బాడి కనీనం పదిసార్లు తరుచుగా రిలీజైతే తరువాత మీ ప్రొగ్రాం ప్రకారం వెళ్ళగలుగుతారు. మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళగలుగుతారు.లేదంటే మన అస్ట్రల్ బాడి రిలీజ్ కాగానే కొత్తలో దానంతట అదే ఎక్కడికో వెళ్ళిపోతుంది.మీ ప్రమేయం లేకుండానే ఎక్కడికో వేరేలోకంలోకి ప్రయాణిస్తుంది.కొత్తలో అలా జరుగుతుంది.కాని కనీసం ఒక పది అస్ట్రల్ ట్రావెల్స్ చేసాక మీరు నిర్ణయించుకుంటారు.మీరు ఎక్కడికి వెళ్లాలి అనేది చక్కగా మీ నిర్ణయం ప్రకారమే జరగుతుంది.ఈ రోజు అక్కడికి వెళ్ళి నా ఆస్ట్రల్ గైడ్ ను కలువాలి అనుకుంటే ఆ గైడ్ నే కలుస్తారు.ఈ రోజు ఆ మాష్టరు దగ్గరే నేర్చుకోవాలి అని ప్రోగ్రాం సిద్దం అంటే అట్లాగే జరుగుతుంది.కాబట్టి ఇది మూడవదైన అన్వేషణ స్థితి. ఇక నాలుగవ స్థితి ఏమంటే పున ప్రవేశ స్థాయి.(రి ఎంట్రి స్టేజి) మీ అస్ట్రల్ ట్రావెల్ ఆరోజుకు పూర్తయ్యింది.మీరు అనుకున్న ఆప్రయాణంలో నేర్చుకోవాల్సింది నేర్చుకుని పొందాల్సిన అనుభవాన్ని ,అనుభూతిని పొందారు.ఆ అడ్వంచర్ పూర్తయింది.మీ శరీరం దగ్గరకు వెనక్కి వస్తున్నారు.వెనక్కి వచ్చినప్పుడు మీ స్థూల శరీరంలోకి ధన్ మని పడిపోకుండా నెమ్మదిగా చేరుకోవాలి.(స్లో లాండింగ్)ఇంతకు ముందు ఒక జోక్ ఉండేది,లాండింగ్ గురించి, కింగ్ ఫిషర్ ఏయిర్ లైన్స్ కు, ఇండియన్ ఏయిర్ లైన్స్ మద్య తేడాలా..ఇండియన్ ఏయిర్ లైన్స్ విమానం లాండింగ్ అయ్యేప్పడు దడదడమని శబ్దం చేస్తూ ఊగిపోతు లాండ్ అవుతుందని, కింగ్ ఫిషర్ విమానం లాండ్ అయ్యేప్పడు సున్నితంగా లాండ్ అవుతుందని.

కామెంట్‌లు లేవు:

ఆత్మ జ్ఞానం కోసం అన్వేషించేవారికి చివరి మజిలి