పేజీలు

31 జనవరి, 2014

డా.న్యూటన్ గారి సూక్షశరీర ప్రయాణం పాఠం-1

డా.న్యూటన్ గారు 2014 జనవరి మొదటివారంలో సాధకులను ఉద్దేశించి భోధించిన సూక్షశరీర ప్రయాణం పాఠం-1 .... మనం అనంతమైనటువంటి శక్తితో ఉన్నటువంటి ఙ్ఞానవంతులము.మన గురించి మనం తెలుసుకుందాం. నేను ఙ్ఞానవంతున్ని అని కొంత గుర్తిస్తున్నాం అంతే.మౌళికంగా అందరు ఙ్ఞానవంతులే. మనం ఇప్పటికే ఙ్ఞానవంతులం, కాకపోతే నిద్రపోతున్నాం . ఒకసారిగా నిద్రలేచి ఆ.. నేను ఙ్ఞానవంతున్ని అని తెలుసుకుంటాం అంతే. ధ్యానం అంటే ఇది తప్ప మరేమి కాదు. మనం మేలుకోనాలి. దీన్నే నీజేబులోనే వజ్రం ఉందని చెపుతుంటారు. మీరు వజ్రం కోసం ప్రతి దగ్గర అన్వేషిస్తుంటారు.నా వజ్రం ఎక్కడ? నా వజ్రం ఎక్కడ ఉంది అని. కాన అది నీ జేబులోనే ఉంది. ఆత్మ ఙ్ఞానం,బ్రహ్మ ఙ్ఞానం అని మనం ఏదైతే వెతుకున్నామో అది అప్పటికి సిద్దంగా నీదగ్గరే ఉంది.నువ్వే అది.దాంట్లోనే నీవు జీవిస్తున్నావు. కేవలం మనం దాన్నిగుర్తించలేదంతే. దాన్ని గుర్తించడానికి ఇప్పుడు సమయం వచ్చింది. మరి సిద్ది కూడా అంతే. అందుకే ఎన్ లైటెన్’మెంట్ మెంట్ అనేది ఒక విధ్యుత్. మనం ఇప్పటికే ఙ్ఞానులం,కాకపోతే మేలుకోంటున్నాం అంతే. ఒకానొక రోజు మీ అంతటే మీరు నవ్వుతారు. ఇంత వరకు ఎంత వెదుకులాట చేసాను నేను అని ఒక నవ్వు వస్తుంది మీకు. నేను ఇప్పటికే అది అయ్యి ఉన్నానని, అదే నేనని ,ఆరోజున మీరు తెలుసుకుంటారు. పాలో కోయిలో రాసిన అల్ కెమస్ట్రి పుస్తకాన్ని మీరు ఎందరు చదివారు?తెలుగులో కూడా పరుసవేది అనే పేరుతో అనువాధం వచ్చింది.చక్కటి పుస్తకం.అందరు చదువాల్సిన పుస్తకం.బ్రెజిల్ దేశానికి చెందిన పావో కోయిల్’వో ఆ పుస్తక రచయిత. ఆపుస్తకంలోని కథా సారంశం ఏమిటంటే కథానాయకుడు ఒక నిధికోసం ఎన్నో దేశాల్లో అంతా వెతుకుతాడు.ఆ సంపద అతనికి ఎక్కడ దొరకదు.అంతా తిరిగి చివరకు ఇంటికే వస్తాడు. అతని ఇంట్లోనే ఆ సంపద ఉంది. దాని అంతరార్థం ఏమంటే ఆత్మ ఙ్ఞానం అంతా వెతుకుతాం, చివరకు మళ్ళీ మన దగ్గరకు మనం రావల్సిందే. ఈ గురువు అని, ఆ గురువు , ఆపుస్తకాలు అని , అది ఇది, ఎంతో ఆరాట పడి,ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు మన దగ్గరకు మనం రావల్సిందే. అంతా మనదగ్గరే ఉంది.మన అత్మ సంపద మనదగ్గరే ఉంది. మీరు దాన్ని మర్చిపోయారంతే. మనం ఈ మధ్యాహ్నం సూక్షశరీర యానం గురించి తెలుసుకుందాం. మన అందరికి తెలుసు,చాలమంది ఇప్పటికే చక్కటి అనుభవాలు ఇప్పటికే పొందారు.(క్లాసుకు వచ్చిన ధ్యానులు)కాని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఆధ్మాత్మిక ఙ్ఞాన సముపార్జనలో అత్యుత్తమైన అనుభవాల్లో సూక్షశరీర ప్రయాణం అతిముఖ్యమైనది.ధ్యానం కొత్తగా మొదలుపెట్టిన వారినుండి మొదలుకుని సీనియర్ ధ్యానుల వరకు అందరికి ఈ అనుభవాలు కలుగుతుంటాయి,వస్తూఉంటాయి. వాటినుండి మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాం.ఈ అనుభవాల గురించి మనం ఎంతో చెప్పుకోవాలి. ఇక్కడ ఎంత మందికి మీ బాడినుంచి సూక్షశరీరం బయటకు వచ్చింది?(క్లాసుకు వచ్చిన ధ్యానులను ఉద్దేశించి అడిగిన ప్రశ్న. ఆ అనుభవం వచ్చిన కొందరు చేతులు ఎత్తారు) వెరిగుడ్.చాలమందికే అనుభవాలు ఉన్నాయి...ఏదో ఒక అనుభవం. కొందరికి ధ్యానంలో ఆ ఆనుభవం వచ్చి ఉండవచ్చును.లేదా మీ కలలలో మీ స్థూల శరీరం నుండి సూక్షశరీరం విడిపడడం జరిగి ఉండవచ్చును.లేదంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక్కోసారి ఒక్క క్షణిక కాలంలో ఆ అనుభవాలు కలుగుతాయి.అతి స్వల్ప వ్యవధి సూక్షశరీర ప్రయాణాలు అప్పుడు జరుగవచ్చును. ఒక సారి నేను ధ్యానంలో ఉండగా మరొక స్థలంలో ఉండి అకస్మాత్తుగా నాశరీరంలోకి తిరిగి వచ్చాను.అలాంటి అనుభవాలు జరిగి ఉండవచ్చును.కాని ఎరుకతో సూక్షశరీర ప్రయాణం చేయడం అనేది నేర్చుకోవాలి.దాని యెక్క దశలను,మెళుకువలను నేర్చుకోవాలి. ఇప్పుడు సైకిల్ తొక్కడం అనేది ఉంది.ఆ సైకిల్ తొక్కడం లోని మెళుకువలు నేర్చుకోవాలి. సైకిల్ తొక్కడం ఎలా వస్తుంది?సాధన తోనే సైకిల్ తొక్కడం వస్తుంది.సైకిల్ తొక్కడం ఎలా అని ఒకరు పుస్తకం రాసారు. ఆపుస్తకం ఎన్నాళ్ళని చదువుకునేది?ఎన్నాళ్ళు చదివినా సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం అలా అని రెండురోజుల పాటు ఒక పెద్ద వర్క్ షాపు పెట్టారు.ఆవర్క్ షాపులో సైకిల్ తొక్కడం ఎలా అని ఒకాయన ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు దంచుతున్నాడు.అయిన విన్న వారికి సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ ఎక్కి డైరెక్టుగా తొక్కాల్సిందే. ఈ సూక్షశరీర ప్రయాణం కూడా అలాంటిదే.అందుకే ఎక్కువ మాట్లాడకూడదు మనం. ఎంత పరిశోదించారో కేవలం అంతే చెప్పగలిగితే చాలు. నేను ఎంతైనా చెప్పనీవ్వండి మీకు. అది మీరు స్వయంగా చేస్తే గాని తెలియదు. నాకు కలిగినటువంటి కొన్ని అనుభవాల్లో ముఖ్యమైన అనుభవం సూక్షశరీర ప్రయాణాలు. నాకు ఇష్టమైన అనుభవాలు అవి. నాకు మొదటిసారి ఆ అనుభవం జరిగినపుడు , ఇలా కూడా జరుగుతుందా అని నాకు ఒక ఆనందం వేసింది.ఆ అనుభవం బలే ఉంది శరీరం తేలికైపోయి , పైకెళ్ళిపోయి గది గోడకు అతుక్కుంటున్నాను.నా శరీరం బెలూన్ లాగ తేలి ఆడుతుంది. నేను ఏంటి ఇలా తేలి ఆడుతున్నాను. కింద చూస్తే నా బాడి ధ్యానంలో కూర్చుని ఉంది. పైనుంచి నా శరీరాన్ని నేను చూసుకుంటున్నాను. చాల మంచి మధురానుభూతి అది. స్థూలము, సూక్షము విడిపడడం,వేరు కావడం.అవి రెండు వేరు పడడం అనే ఈ ప్రక్రియ ఉందే , అది చాల అందంగా ఉంటుంది. ఎన్నో జన్మల సాధన లేకపోతే, ఈ జన్మలో ఎంతో సాధన చేస్తేగాని సాదారణంగా ఈ జన్మలో ఆస్ర్టల్ ట్రావెల్ రాదు. ఇంత క్రితం ఎన్నో జన్మల సాధన చేసిన వారికి కూర్చోగానే సూక్షశరీర ప్రయాణం వస్తుంది.కూర్చోగానే థర్డ్ ఐ విజన్స్ మొదలవుతాయి. మనకు మూఢు శరీరాలు ఉన్నాయి.అన్నమయ కోశం, (స్థూల శరీరం)ప్రాణమయ కోశం,మనోమయ కోశం(అస్ట్రల్ బాడి) ఈ మూడు శరీరాలు వేరు పడడానికి , విస్తరించడానికి మన యొక్క గత జన్మల్లో చేసిన సాధనలు అన్ని కలిసివస్తాయి.ఇక్కడ మళ్ళీ మొదటి నుండే నేర్చుకొంటారు.ముందు ధ్యానం నేర్చుకుంటారు.నాకు ఏం తెలియదనట్లే సాధన చేస్తారు.కాని కొందరికి గత జన్మల్లో చేసిన సాధనల వలన చాలా తొందరగా ఆ అనుభవాలు కలుగుతాయి. చాల త్వరగానే వారి స్థూల శరీరం నుండి సూక్షశరీరం విడుదల అవుతుంది. అకస్మాత్తుగా ఈ విజన్స్ మొదలవుతాయి. కాని ఎందుకు వస్తున్నాయో ఈ విజన్స్ ముందుగా అర్థంకావు.చిత్త భ్రమలని,ఊహలని అని అనుకుంటాం. కాని తరువాత కొన్ని తిరుగులేని నిదర్శనాలు కనిపిస్తాయి.నేను చూసేది ఊహ కాదు, నా శరీరం బయటే ఉన్నాను, నిజంగానే సూక్షశరీరంలోనే ఉన్నానని అని మీకు అర్థం అవుతుంది. ఈ రెండు శరీరాలకు మద్యలో ఒక సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది.ఆ సిల్వర్ కార్డును చూడడం కూడా చాల బాగుంటుంది. మొదట్లో మనకు చాల తొందరగా సూక్షశరీర ప్రయాణాలు జరుగుతాయి.వాటిని మీరు గుర్తించను కూడా గుర్తించలేరు.తరువాత మీరు పునర్ ఆలోచన చేసుకుంటే అర్థం అవుతుంది.’’ఔను నేను నా శరీరం నుండి బయటకు వచ్చాను,గిర్రున తిరిగింది , అలా బొంగరంలా తిరిగింది నా సూక్షశరీరం, దాని తరువాత వేరే దృష్యం కనిపించింది. అంటే నేను అక్కడ సూక్షశరీరంతో ఉన్నానని మీకు అవగతం అవుతుంది. కొందరు స్థూల శరీరానికి తిరిగి వచ్చేప్పుడు ఒక జర్క్ తో తమ శరీరంలోకి వచ్చిపడుతారు.మరికొందరికి శరీరం బయటకు వచ్చిన తరువాత సువాసనలు తెలుస్తాయి.మరికొంతమంది శబ్దాలు వినపిస్తాయి.ఆ శబ్దాలు ఎన్నడు విననటువంటి శబ్ధాలు,మధురంగా ఫ్లూటు శబ్దాలు,గంటలు మోగినట్లు,శంఖాలు ఊదిన శబ్దాలు వినిసిస్తాయి. సూక్షశరీరం విడిపడినపుడు సర్వ సాధరణంగా వినపడే శబ్ధం ఏమంటే ’’వుష్ ‘‘ శబ్ధం వస్తుంది. ఆస్ట్రల్ బాడి రిలీజ్ అయినప్పుడు ఆ ప్రకంపనాలతో వచ్చే శబ్దం ’’వుష్‘‘ శబ్ధం.ఒక విమానం, జెట్ ప్లేన్ వెళ్ళేప్పుడు వచ్చే ఎలాంటి శబ్ధం వస్తుందో అలాంటిదన్నమాట. అత్యధిక స్థాయి ప్రకంపనాలతో కూడిన శబ్ధం వస్తుంది.మనం సూక్షశరీరంలో ఉన్నాను అనడానికి ఇవన్ని మనకు కొన్ని చిహ్నలు. ఈ సూక్ష శరీర అనుభవాలు వివిధ స్థితుల్లో , వివిద పద్ధతుల్లో మనకు వస్తాయి. మొదటి పద్దతి ధ్యానంలో. సూక్షశరీరయానానికి ధ్యానం అనేది అత్యున్నత మార్గం. సర్వసాదారణంగా ధ్యానం చేసేవారందరికి ఏదో రకంగా సూక్షశరీర అనుభవాలు కలుగుతాయి.ధ్యానం చేసేవారందరు ఏదో ఒక రోజున తమ శరీరం నుంచి బయటపడుతారు. రెండవది స్వప్నం నిద్రాస్థితిలో. మన స్వప్నాల్లో మన శరీరం నుండి బయటకు వెళుతుంటాం.స్వప్నావస్థలో మన శరీరం నుండి బయటకు వెళ్ళడం. మూడవది మృత్యు సమీప అనుభవాలు. మృత్యువు చేరువగా వెళ్ళి రావడం.డాక్టర్స్ చెక్ చేసినపుడు వాళ్ళ నాడి , గుండె స్పందన, రక్తపోటు , ఇ.జి.యేస్ అన్ని ప్లాట్ మీదకు రావడం చూస్తారు.ఇవన్ని కూడ సైన్స్. అలాంటి స్థితిలో డాక్టర్లు లీగల్లీ అతను చనిపోయాడని సర్టిఫై చేస్తాడు.అలాంటి కేసుల్లో కూడా చాలమంది కూడా వెనక్కి రావడం జరుగుతుంది.అలాంటప్పుడు మళ్ళి అన్ని వేవ్స్ కదలిక మొదలవుతుంది. సినిమాల్లో చూపిస్తుంటారు వాళ్ళ(హీరో)ఇ.సి.జి. మానిటర్ మీద ప్లాట్ గా అయిపోతుంది. అవతల హీరోయిన్ ప్రేమతో పిలుస్తుంది.దాంతో ఒక్కసారిగా అతని హార్ట్ కొట్టుకోవడం మొదలవుతుంది.(నవ్వులు)అంతా కామన్ గా చూపిస్తుంది. వాస్తవంగా అట్లాగే జరుగుతుంది. అత్యంత ప్రేమించే వ్యక్తులతో ఎవరికైతే అతి గాఢమైన ఆత్మస్థాయి అనుభందం ఉంటుందో,తల్లి- బిడ్డ, భార్య-భర్త,ఫ్రేయసి-ప్రియుడు అలాంటి సంధర్బాలో అవతలి వారి ఆత్మ వెనక్కి తిరిగి వస్తుంది.దీని గురించి మరోసారి వివరంగా తరువాత టాపిక్ లో తెలుసుకుందాం. తరవాత గాయాలు బలంగా తగిలినప్పుడు కలిగే శరీర విర్మరణ-విస్మరణ. అంటే ఎవరైకైనా అక్సిడెంట్స్ జరిగినప్పుడు తాత్కాలికంగా తమ శరీరం నుండి బయటకు వస్తారు.బయటకు వచ్చి తమ శరీరాన్ని తాము చూసుకుంటారు.వాళ్ళ కాళ్ళు విరిగిపోయింటాయి,నొప్పుంటుంది,రక్తం కారుతుంటుంది.కాని వాళ్ళకి ఆ నొప్పి తెలియదు.ఎందుకంటే వారు తమ శరీరం బయట ఉన్నారు కాబట్టి. తమను ఆసుపత్రిలో చేర్పించడం,ఆర్థోపెడిషియన్ వచ్చి విరిగిన ఎముకలన్ని తిరిగి సక్రమంగా అమర్చడం ఇదంతా కూడ వారు పైనుండి చూస్తుంటారు. శరీరం లోపలికి రాగనే మాత్రం నొప్పి ఉంటుంది. తమ శరీరం బయట ఉండటం వలన వారికి ఆ నొప్పి తెలియదు.ఇలాంటి సందర్బాల్లో కూడా ఈ అనుభవాలు వస్తాయి. చాలమందికి ఈ అనుభవాలు వస్తాయి.ట్రోమా కేర్ సెంటర్స్ లో, హస్పటిల్స్’లో ఎమర్జెన్సీ వార్డుల్లో ఇవి చూడవచ్చు. నేను కర్నూలు లొని హస్పటిల్లో ఎమర్జెన్సీ కాజువాలిటిలో డాక్టర్’గా జాబ్ చేస్తున్నప్పడు , వారికి నేను ట్రీట్ మెంట్ చేయడం కంటే ఎక్కువగా వారికి కలిగే అనుభవాల మీద ఆసక్తి చూపించేవాణ్ని.తలమీద బలంగా గాయమైన వారిని నీకు అప్పడు ఎలా అనిపించింది అని అడిగేవాణ్ని. ఎవరైనా చనిపోతున్నప్పుడు కూడ దాన్ని క్లోస్ గా చూసేవాణ్ని.క్లినికల్ గా వాళ్ళు చావు దగ్గరకు వెడుతున్నప్పడు వారి ఆస్ర్టల్ బాడిలో ప్రాణమయ కోశంలో ఏమార్పులు సంభవిస్తున్నాయి?భౌతిక శరీరంలో ఏమార్పులు వస్తున్నాయి? అని వారికి అతి సన్నిహితంగా ఉండి గమనించేవాణ్ణి. సూక్షశరీర ప్రయాణానికి మరొక పద్దతి సృహ తప్పించే వినియోగ స్థితి.అంటే కొంత మంది డాక్టర్లు సర్జరి చేయడానికి ముందు పేషెంట్లకు అనెస్థేషియా ఇస్తుంటారు. అలాంటప్పుడు కూడా ఇలా శరీరం నుండి బయటకు వచ్చే అనుభవాలు కలుగుతాయి.పేషెంట్స్ తమకు డాక్టర్స్ చేసే సర్జరినంతా శరీరం బయట నుండి చూస్తుంటారు. ఆసమయంలో వారికి నొప్పి ఏం తెలియదు. వారు సర్జరి తరువాత డాక్టరుకు అంతా చెప్పగలుగుతారు. ఆ సమయంలో డాక్టర్ , నర్స్ ఏమేం మాట్లాడుకున్నారో, ఆ డాక్టర్ కు ఏమేం ఎమోషన్స్ కలిగియో అంతా చెప్పేయగలరు.అవి విని డాక్టర్స్ ఆశ్యర్య చకితులు అవుతారు. ఒకసారి ఒక డాక్టర్ సర్జరి చేస్తూ పేషెంట్ మీద ఒక స్థాయిలో జోకులు వేస్తున్నాడు.సర్జరి తరువాత పేషెంటును ఆపరేషన్ తరువాతి కేర్ వార్డులో ఉంచినప్పుడు , ఆ డాక్టర్ పేషెంట్ దగ్గరకు వెళ్ళగానే సృహలో ఉన్న పేషెంట్ డాక్టర్ ను అడిగాడు.’’ ఎందుకండి డాక్టర్ , నేను సృహలో లేనప్పుడు నామీద అలా జోకులు వేసారు?నేను చాలా బాదపడ్డాను ‘‘ అని . ఆమాటలు విన్న డాక్టర్ షాకైపోయాడు. ’’మేము నీకు అనెస్థేషియా ఇచ్చాము కదా? నికేలా వినపడింది?ఎవరైనా చెప్పారా నీకు ?‘‘ అని డాక్టర్ అడిగాడు. పేషేంట్ ’’నేను పైనుండి అంతా చూసాను.మీరు ఎమేం మాట్లడారో నేను అంతా విన్నాను‘‘ అన్నాడు. సూక్షశరీరం అంతా వినగలుగుతుంది, చూడగలుగుతుంది. అనెస్థేషియా ఇచ్చినప్పుడు మాత్రం స్థూల శరీరం రిలాక్స్ అయిపోతుంది. డా.న్యూటన్ : ’’ఈ గ్రూపులో అలాంటి అనుభవాలు ఎవరికైనా కలిగాయా?సర్జిరి చేసినప్పుడు శరీరం బయటకు రావడం లాంటివి?‘‘ ఒక సాధకురాలు తనకు వచ్చిన అనుభవాలు చెప్పింది.’’నా డెలివరి సమయంలో సిజేరియన్ అపరేషన్ అని చెప్పారు.పడుకోబెట్టారు. పేయిన్స్ మొదలైనాయి. అనెస్థేషియా ఇచ్చారు.తరువాత కొద్దిసమయానికే మత్తులో ఎవరో వచ్చారు. ఇలా రా అమ్మా అని తీసుకు వెళ్ళారు.నేను మొత్తం వైట్ గా ఉన్నాను. అతను మొత్తం చూపిస్తున్నాడు. అతనెవరో నాకు తెలియదు. ఈలోపల నాకు డాక్టర్స్ అన్ని మాట్లాడుకునే మాటలు వినపడుతున్నాయి.అటు చూస్తున్నాను,ఇటు డాక్టర్స్ మాట్లాడే మాటలు వింటున్నాను.చివర్లో మాత్రం అతను నీ పని అయిపోయింది, ఇక నువ్వెళ్ళు అని నా శరీరం దగ్గర తీసుకువచ్చి వదిలేసాడు.‘‘ డా.న్యూటన్ : ’’వండర్ ఫుల్ అనుభవం..సాదారణంగా ధ్యానంలో ఈ అనుభవాలు వస్తుంటాయి‘‘ అన్నారు. అప్పడు మరో సాధకురాలు తన పిరమిడ్ ధ్యాన అనుభవాలు చెప్పింది. మరో సాధకురాలు తనకు అనెస్తేషియా ఇచ్చినప్పడు వచ్చిన అనుభవాలు చెప్పింది. డా.న్యూటన్ : మీలో ఎవరికైనా మృత్యు సమీపంలోకి వెళ్ళి వచ్చిన అనుభవాలు కలిగాయా? ఒక సాధకురాలు తన చావు అనుభవాన్ని చెప్పింది.’’ఆసమయంలో నేను చనిపొతున్నానని అందరికి చెపుతున్నాను.కాని బతికే ఉన్నాను.’’ డా.న్యూటన్. కాబట్టి మృత్యు సమీప అనుభవాలు కూడా సర్వ సాదారణం.మనదేశంలో మరీ ఎక్కువ.మనం అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో కూడా చుస్తుంటాం.ఒక సారి ఒక స్త్రీ శవాన్ని దహన సంస్కారాల కోసం శ్మశానం వరకు తీసుకువెళ్ళారు.తీరా అక్కడికి వెళ్ళాక ఆమె అకస్మాత్తుగా లేచి పోయింది. తన శరీరాన్ని గుర్తుపట్టి ’’నేను కాదు,పక్కవీధిలో ఉండే లక్షమ్మను తీసుకువెళ్ళాలి.పొరపాటున నన్ను తీసుకువెళ్ళరు ‘‘ అని. ఈమె పేరు కూడా లక్షమ్మ కావడంతో ఆస్ర్టల్ గైడ్స్ అక్కడ కొద్దిగా అయోమయం చెందారు.. ఇలాంటి సందర్భాలు చాల ఉన్నాయి. ఒక్కోసారి ఆస్ర్టల్ వరల్డ్ లో కూడా పొరపాట్లు జరుగుతుంటాయి.దాంతో ఒకరిని బదలు ఒకరిని తీసుకువెళ్ళడం జరుగుతుంటాయి. షిరిడి సాయిబాబా తాను జీవించి ఉండగా చక్కటి ఆస్ర్టల్ ట్రావెల్స్ చేసేవాడు.ఒక సందర్భంలో మూడు రోజుల ఆస్ర్టల్ ట్రావెల్ చేసాడు. అంతకు ముందే తన చుట్టు ఉన్నవారికి ‘‘నేను మూడు రోజుల తరువాత తిరిగి వస్తాను, నా శరీరాన్ని ఏమి చేయవద్దు’’అని. మన అందరికి తెలిసిన విషయమే,ఏమంటే ఒక ధ్యాని సాదారణంగా గంటన్నర వరకు తన స్థూల శరీరాన్ని వదిలి బయట ఉండగలడు. మూడు రోజులు శరీరం బయటే ఉండడం అంటే ఒక పరకాష్టకు చెందిన ఒక మాష్టర్ కే అదిసాధ్యం.దానిపై ఉన్నత స్థాయి ఎరుక స్థాయి ఉండాలి. సాధన చేస్తే మనం కూడా మూడురోజుల పాటు చేయగలుగుతాం.కాని మీ గది బయట ‘‘నేను సూక్షశరీరం ప్రయాణంలో ఉన్నాను అని మీ గది బయట బోర్డు పెట్టాలి’’.(నవ్వులు) అస్ట్రల్ ట్రావెల్ లో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు.ఇతరులతో ఎలాంటి స్పర్శ,ఎలాంటి శబ్దాలు,మిమ్మల్ని ఎవరైనా పేరుపెట్టి పిలవడం లాంటివి ఏం ఉండకూడదు. ఒకసాధకుడు: ఆస్ట్రల్ ట్రావెల్ చేసేప్పుడుశరీరం స్ట్రెచ్ అవుతుందా? డా.న్యూటన్ : ఔను స్ట్రెచ్ అయిపోతుంది.మినిమం మెటబాలిజం(కనీస శరీర విధ్యుక్త ధర్మాలు) జరుగుతుంటుంది. మన యొక్క ఆస్ట్రల్ బాడి ఒకానొక శరీరం మాత్రమే.ప్రాణమయ కోశం అక్కడే ఉంటుంది. కేవలం మనో మయ కోశం మాత్రమే బయటకు వెళుతుంది.శ్వాస నడుస్తుంటుంది.చాల కనీస మొత్తంగా సూక్ష స్థాయిలో శ్వాస నడుస్తుంది. చాలమంది బయటి నుండి చూసే వాళ్ళు బ్రీతింగ్ నడవడం లేదు ఆగిపోయింది అనుకుంటారు.ఒక శవం మాదిరి స్థితే ఉన్నప్పటికి పల్స్,బ్లడ్ ప్రెషర్ అన్ని మినిమం స్థాయిలో పనిచేస్తుంటాయి. ఒక సాధకురాలు : షిర్డి సాయిబాబా ఆస్ట్రల్ ట్రావెల్ చేసినపుడు డాక్టర్స్ టెస్ట్ చేస్తే అప్పుడు బాబా నాడి కొట్టుకుందా? డా.న్యూటన్ : షిర్డిసాయిబాబకు నాడిపరిక్ష చేస్తే , నాడి దొరకలేదు,దాంతో డాక్టర్ సాయిబాబ తన శరీరంలో లేరు అనుకున్నారు. షిర్డి బాబా అసలు వాస్తవానికి చేసింది కేవలం సూక్షశరీర ప్రయాణం కాదు , ఆత్మ ప్రయాణం, తన అన్ని బాడీస్,పంచ కోశాలు,విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశంతో పాటే అయన వెళ్ళారు. షిర్డిబాబా కేవలం సూక్షశరీర ప్రయాణం కాకుండా సోల్ తో కాస్మిక్ ట్రావెల్ చేశారు. శంకరాచార్యకూడా ఆస్ర్టల్ ట్రావేలే,సోల్ ట్రావెలే కాకుండా పరకాయ ప్రవేశం కూడా చేసారు. జగద్గురు ఆదిశంకరచార్య కొత్త సినిమాలో సుబాష్ పత్రిగారు కూడా ఆ సినిమాలో నటించారు,ఆది శంకర చార్య గురువుగా,ఎంత చక్కగా నటించారో. పరకాయ ప్రవేశంలో బయటకు వచ్చేసి ఇంకోక శరీరంలో ప్రవేశిస్తారు. టిబెట్,హిమాలయాల్లో ఉండే యోగులు చాలమంది ఇది చేస్తారు.అక్కడ చనిపోయి పడిఉన్న దేహాల్లోకి వరకాయ ప్రవేశం చేస్తారు. ఎందుకంటే వారి శరీరం అప్పటికే రెండు మూడు వందల ఏళ్ళుగా చిక్కి శల్యమై ఉంటుంది.అనుకోకుండా లబించే 40,50 ఏళ్ళలోపు యవ్వన డెడ్ బాడీస్ లోకి వాళ్ళు ప్రవేశించి,తాము చేయాల్సిన తదుపరి ఆధ్యాత్మిక జీవిత ప్రణాళికను కొనసాగిస్తారు.కాబట్టి మనకు ఈ శరీరం కేవలం ఒక వాహనం మాత్రమే. నాకు ఒక్క అనుభవం ఉంది. హస్పెట్ (కర్ణాటక)ఋష్య మూక పర్వతం దగ్గర ధ్యానం చేస్తున్నాము. అదొక గొప్ప శక్తి కేంధ్రం.హనుమంతుడు తన వానర సేనను అంతా అక్కడ జమచేసేవాడు.హాస్పెట్ అతి గొప్ప శక్తి క్షేత్రం. రామాయణ కాలంలో జరిగిన చాల సంఘటనలు కిష్కంద కాండతో సహా అక్కడే జరిగాయి. ఆ ప్లేస్ ఒక గుహ ఉంది.చాలామంది యోగులు ఆ గుహలో ధ్యానం చేసారు.ఆగుహను ఇప్పుడు ముసేసారు.ఆరోజున మేము బయటే కూర్చుని ధ్యానం చేస్తున్నాము. మొదటి దృష్యంలో ఒక కోతి కనిపించింది.నాతో ఆ కోతి ’’నా శరీరాన్ని వదిలేస్తున్నాను, నువ్వు నా శరీరంలో ప్రవేశించు ’’ అని. ఆ కోతి తన శరీరం వదిలేసింది.నేను దాని శరీరంలో సూక్షశరీరంతో ప్రవేశించాను.నా కోతి శరీరంలోకి ప్రవేశించాక, చిన్న కోతిలాగ, చెంగు చెంగున ఎగరుకోవడం,నా తోక, నా మూతి కోతిలాగ చాలా తమాషగా అనిపించింది. ఆతరువాత ఆగుహలోని చిన్న ద్వారంలోనుండి ఆ కోతి అవతారంతో లోపలికి వెళ్ళిపోయాను.మనిషైతే దూరడం కష్టం.చాలా సునాయసంగా లోపలికి వెళ్లిపోయాను.అక్కడ చూస్తే నిజంగా లోపల కోతులు ఉన్నాయి.అవి ఏంచేస్తున్నాయా అని పరిక్షగా చూసాను.అన్ని నిశబ్దంగా ఉన్నాయి.ఇంకా ఆశ్యర్యం అనిపించింది.కోతులు నిశబ్దంగా ఉండడమా?ఎక్కడ చూడని విడ్డూరమే అని చూస్తే అక్కడ హనుమంతుల వారు కూర్చున్నారు.ఆ కోతులన్నింటికి శిక్షణ ఇస్తన్నారు.ఆనాపానసతి.మంచి మనుసును కలిగి ఉండడం, మనుసును నిశ్చలం చేసుకోవడం ఎలాగో వాటికి శిక్షణ ఇస్తున్నాడు. హనుమంతుడి దగ్గరకు వెళ్ళాను. హనుమంతుల వారు ‘‘మన మనస్సు కోతి లాంటిది,దాన్ని అభ్యాసం,శిక్షణ తో ఎలా నిశ్చలం చేసుకోవాలని చెపుతూ,దాని కోసమే కోతులన్ని అక్కడకు వచ్చాయని, అందుకే ఆ శిక్షణ అక్కడ నడుస్తుందని,రామయణ కాలంలో కూడా తాను చేసింది అదే అని, అన్ని కోతుల్ని,కోతుల లాంటి మనుషుల్ని వానరసేనగా చేసాను’’ అని చెప్పాడు. ‘‘శిక్షణ ద్వారానే వాటిలోని శక్తిని సరిగ్గా వెలికితీసి,రావణసూర వధకు సమాయత్తం చేయడం జరిగిందని’’ అను ఆంజనేయులు చెప్పారు. ఈ అనుభవం అంతా గంటన్నర పైనే జరిగింది.ఆ గంటన్నర సమయం నేను కోతి శరీరంలో ఆగుహలో , ఆ కోతిమూకతో అక్కడే ఉన్నాను. తరువాత బయటకు వచ్చాను. ఫూర్తి శక్తితో అప్పడు ఉన్నాను. మొదటి సారి అప్పట్లో అనిపించేది ఇది కూడా ఒక పరకాయ ప్రవేశం అని. కాబట్టి ఆదిశంకరాచార్యుల వారికి ఒకసారి చప్పట్లు కొడుతాం.(అందరి చప్పట్లు)ఇది ఒక ఉదాహరణ. సూక్షశరీరయానంలో ఉండే అపోహల గురించి కొన్ని తెలుసుకుందాం.చాలమందికి అపోహలు ఉంటాయి. మొదటి అపోహా : అస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడల్లా వారి యొక్క జీవిత కాలం తగ్గిపోతుంది అని.ఇది కొంతమంది నుంచి విన్నాను నేను. కాని అది ఏం నిజం కాదు. వాస్తవానికి అస్ట్రల్ ట్రావెల్ చేసినప్పడల్లా మీ జీవితకాలం ఇంకా పెరగుతుంది. అస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడల్లా పదేళ్ళు జీవితకాలం తగ్గిపోతుందని నాతో ఒకరు చెప్పారు.(నవ్వుతో) వాస్తవానికి ఆస్ట్రల్ ట్రావేల్ చేసినప్పుడల్లా పదేళ్ళ జీవితకాలం పెరుగుతుంది. అంతా ఆస్ట్రల్ ఎనర్జీ మీరు అపుడు తీసుకోగలుతుతారు. రెండవ అపోహ: అస్ట్రల్ ట్రావెల్ అనేది చాల కష్టమైనది.ఇది కూడ కేవలం అపోహం.సైకిల్ తొక్కడం,బైక్ నడపడం,ఈత కోట్టడం ఎంత సులభమో అస్ట్రల్ ట్రావెల్ చేయడం అంత సులభం. ఇది ఒక చాకచక్యం.దాన్ని మీరు పట్టుకోవాలి. ఈత కొట్టడం కూడ మీకు ఎవరు నేర్పించలేరు.ఆ నీళ్ళల్లో ఎలా ఈత కొట్టడం అనేది మీకే తెలుస్తుంది. స్విమ్మింగ్ పూల్లో ఈత శిక్షకుడు మీకు సీతాకోక చిలుక రెక్కల్లా చేతులు కదిలించమని,శ్వాస ఎలా ఆదీనంలో పెట్టుకోవాలో అని కేవలం సలహాలు చెపుతాడు.అలాగే ఆస్ట్రల్ ట్రావెల్ కూడా అంతే. సూక్షశరీర ప్రయాణంలో ఉన్నప్పుడు , నీవు ఏయే మెళుకవలు కలిగి ఉండాలో,ఎలా ఎరుకతో ఉండాలో గుర్తుంచుకోవాలి. స్థూల శరీరం బయట సూక్షశరీరంతో ఉన్నప్పుడు నువు ఎమేం చేయాలో గుర్తుంచుకుంటే నీవు శరీరం బయట చాల సమయం ఉండవచ్చును. ఆస్ట్రల్ ట్రావెల్ లో ఉన్నప్పుడు నీవు ఏంచేయాలో కూడా తెలుసుకుంటే నీవు చాల చాలా చేయవచ్చును. మూడవ అపోహ: నేను శరీరం బయటకు సూక్షశరీరంతో వెళ్ళిపోయిన తరువాత , వేరే అత్మ వచ్చి నా శరీరంలో దూరితే , నేను వెనక్కి వచ్చిన తరువాత నా స్థూల శరీరంల లేకుంటే కష్టమని కొంతమందికి భయం ఉంటుంది. కాని అదేం జరగదు.మీ శరీరం ప్రకంపనాల పరంగా వేరే వాళ్ళకు సరిపోదు.కేవలం అత్యున్నత ఆత్మ చైతన్యం ఉన్నవారు , కనీసం ఆరవ శరీర చైతన్యం సాధించిన(లేదా ఆరవ తలంనుండి వచ్చిన)అత్యున్నత మాష్టరు ఆత్మలు(బుద్దుడు లాంటి)మాత్రమే మీలో ప్రవేశించగలరు. ఆలాంటి మాష్టర్ ఆత్మలు మీరు ఎలాంటి ప్రకంపనాల స్థితిలో ఉన్న కూడా మీశరీరంలో ప్రవేశించి మీద్వారా చానెలింగ్,వీడియోషిప్ చేయగలుగుతారు.అంతే తప్ప మిగితా వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని చికాకు పెట్టరు. నాలుగవ అపోహ: నేను అస్ట్రల్ ట్రావెల్ చేసినపుడు ఏ రాక్షసలోకానికో,దయ్యాల లోకానికే, నాగలోకానికో వెళ్ళిపోతాను, అక్కడి నుంచి రాలేను అని. అప్పడు దయ్యం అత్మలన్ని నన్ను అక్కడ అటాక్స్ చేస్తాయి అని భయపడుతారు.అదేం జరగదు.నిజంగా అక్కడి కంటే మనలోనే పెద్ద దయ్యం ఉంటుంది.(నవ్వులు)మన యొక్క ఆలోచనలు బట్టే మన సూక్షశరీరం ప్రతిస్పందిస్తుంది.మీరు భయంతో ఉండి నేను నాగలోకానికి వెళుతాను అని భయపడుతు ఉన్నారనుకోండి అలాగే జరిగినట్లు అనిపిస్తుంది.జరుగుతుంది కూడా.మీరు ఆస్ట్రల్ ట్రావెల్ లో ఉండి మీరు వెలువరించే ప్రతి ఆలోచన అక్కడ వెనువెంటనే ప్రత్యక్షం అవుతుంది. అందుకే సూక్షశరీరాన్ని ఆలోచన శరీరం(థాట్ బాడి) అంటాం.ఆలోచనతో అది ప్రయాణిస్తుంటుంది. మీరు ఆస్ర్టల్ బాడిలో ఉన్నప్పుడు ఏ ఆలోచన వెలువరిస్తారో,ఆలోచిస్తారో వెనువెంటనే అక్కడ జరుగుతుంటుంది. మీరు పులి వస్తుంది అని అనుకుంటే అక్కడ ఆస్ట్రల్ పులి తయారయిపోతుంది.అది మిమ్మల్ని అటాక్ చేసి తినేస్తుంది అని మీరు భయపడితే అదినిజంగానే అటాక్ చేస్తుంది.అక్కడ అంతా వెనువెంటనే జరుగుతాయి.కాబట్టి మీ ఆలోచనలన్ని వెంటనే అక్కడ వాస్తవరూపం పొందుతాయి.అలాంటి వాటితో విసుగనిపించిందా అందుకే ఈ భౌతికతలం. ఐదవ భయం : అస్ట్రల్ ట్రావెల్లో నా వెండితీగ(సిల్వర్ కార్డ్) తెగిపోతుంది అని. స్థూల శరీరంనుండి సూక్షశరీరంగా బయటకు వెళ్ళనప్పడు నిరంతరం అనుసందానం అయ్యి ఉండే ఈ సిల్వర్ కార్డ్ తెగిపోతే ఎట్లా ? మరణమే కదా అని. అలా ఏం జరుగదు.ఎవరి సిల్వర్ కార్డ్ తెగిపోవడం అనేది జరుగదు, మీ అంతట మీరే తెంపగొట్టాలనుకుంటే తప్ప. ఇచ్చామరణమే, అన్ని మరణాలు ఇచ్చా మరణాలే.ప్రతి మరణం కూడా . అత్యన్నత మాష్టర్స్ ధ్యాన సమయంలో తమ స్థూల శరీరాన్ని వీడి,మరణించే శక్తి సామర్ధ్యాలు కలిగి ఉంటారు. వాళ్ళ సిల్వర్ కార్డును వాళ్ళే తెగ గొట్టుకోగులుగుతారు.వాళ్ళ సిల్వర్ కార్డును వారే తెగగొట్టి , వారి హైయ్యర్ సెంటర్స్ నుండి తమ శరీరాన్ని విడుదల చేసుకుంటారు.సాదరణంగా దీన్నే జీవ సమాధి అంటారు. జీవబ్రహ్మ స్వామి,వీర బ్రహ్మేంద్ర స్వామి తదితర ఎంతో మంది మాష్టర్స్ ఇలా చేసారు.హస్పేట్ దగ్గర చాలమంది మాష్టర్స్(ఏడుగురు)అలా జీవసమాది చేసారు.అలాగే సదానంద యోగి గారు..తదితరులు ..ఇచ్చామరణం ..చెప్పిన టైముకు వాళ్ళు ఖచ్చితంగా తమ శరీరాన్ని వదిలిపెడుతారు. మరో భయం ఏంటంటే మరెవ్వరో మీ సిల్వర్ కార్డును తెంపగొడుతారని.అలా ఎప్పటికి జరగదు. ఆరవ అపోహా: ఇంకో భయం ఏమిటంలే నేను ఆస్ట్రల్ ట్రావెల్ లో ఉన్నప్పుడు ,వారి సిల్వర్ కార్డ్స్.నావి పెనవేసుకుపోయి ట్రాఫిక్ జాం లో ఇరుక్కుపోయినట్లు ఇరుక్కపోతాయని.(నవ్వులు)మళ్ళా ఎక్కడికే వెళ్ళిపోయి,నా రూం మర్చిపోతే వెనక్కి తిరిగి రావడం కష్టమని.అలా ఏం జరుగదు.ఆస్ట్రల్ ట్రావెల్ కు జి.పి.ఎస్ అనేది ఉంటుంది. (నవ్వులు)(జీవకణ పొజిషన్ సిస్టం.)గూగుల్ వాళ్ళది ఉంది కదా అలా. మన ఆత్మలో సహజ సిద్ధంగా ఈ సమాచారం అనే ది అంతా ఉంటుంది. మీ శరీరంలోకి తిరిగి ఎలా రావాలో దానికి క్లియర్ గా తెలుసు. మీరు అస్ట్రల్ బాడితో శరీరం బయట ఉన్నపుడు మీ స్థూల శరీరంలో ఏ అసౌకర్యం ఏర్పడిన కూడా సిల్వర్ కార్డ్ ద్వారా సూక్షశరీరానికి తెలుస్తుంది.మీకు మూత్రంకోశం నిండి మూత్రం వచ్చే పరస్థితి ఉన్నా కూడా వెంటనే సూక్షశరీరాన్ని వెనక్కి రమ్మని సిగ్నల్స్ వెళుతుంటాయి.ఏలాంటి ఇబ్బంది వచ్చినా సిల్వర్ కార్డుద్వార వెంటనే సూక్ష శరీరానికి సిగ్నల్స్ వెళుతుంటాయి. కాబట్టి ఇవన్ని కూడా మనం భయపడనవసరంలేని అపోహాలు. అస్ట్రల్ ట్రావెల్ అనేది ఒక సరదా కార్యక్రమం. అస్ట్రల్ ట్రావెల్ ఒక సహసపూరిత యాత్ర. అస్ట్రల్ ట్రావెల్ అనేది మీ అత్మోన్నతికి దోహదపడే చర్య.మీ అత్మ యొక్క అమరత్వానికి అది చిహ్నం.ఒక్క సూక్షశరీర ప్రయాణం మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక ప్రకటన ఉంది..ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అని (నవ్వులు) అలాగే నిజంగా అస్ట్రల్ ట్రావెల్ కూడా అందరు చేయదగ్గ అనుభవం ఇది. జీవితం పట్ల మీకు ఇప్పటి వరకున్న దృక్పధం పూర్తిగా 360 డిగ్రీల్లో మారిపోతుంది. మీకు తెలుస్తుంది అప్పుడు నేను ఈ స్థూల శరీరాన్ని కాదు,సూక్షాన్ని అని.అదొక్కటి చాలు. మనకు తెలియనటువంటి అవిధిత యధార్థం ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది. ఆ ఒక్కటే మిమ్మల్ని పైకి తీసుకువెళుతుంది. కాబట్టి పై అపోహలనుండి ముందుగా బయట పడాలి.అస్ట్రల్ ట్రావెల్ చేయాలని , ఆకాంక్షించే వారు, కోరుకునే వాళ్ళు, ఆశించేవారు, ఆశయం ఉన్నవారు. కనీసం వీటిల్లో ఒక్క భయం ఉన్నా కూడా మీరు మీ శరీరం నుండి భయటకు రాలేరు.అస్ట్రల్ ట్రావెల్ అనేది ఒక సరదా విషయం అనేది మీకు తెలియాలి.అస్ట్రల్ ట్రావెల్ ఒక ఆనందం.అస్ట్రల్ ట్రావెల్ ఒక మధురమైన సాహసయాత్ర. అస్ట్రల్ ట్రావెల్ అనేది ఒక అధ్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. ఒక సాథకుడు లేచి తన అనుభవం చెప్పాడు.ఒక యోగి అత్మకథ పుస్తకం చదివి అర్జెంటుగా మహావతార్ బాబాను కలుద్దామని బయలుదేరి చివరకు అనంతపురం జిల్లా లోని ఉరవకొండ పిరమిడ్ ధ్యానకేంద్రంలో పదిరోజుల మౌన ధ్యానం చేయడం,ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం , దాంతో తన తనకున్న ఎన్నో భయాలు తొలిగిపోయి అప్పటినుండి ధ్యాన ప్రచారంకు దిగడం,వేల కొద్ది ధ్యానం క్లాసులు తీసుకోవడం అన్నీ వివరించాడు.(చప్పట్లు) డా.న్యూటన్ : చూడండి ఒక్క అనుభవం జీవితాన్ని ఎంతగా మారుస్తుందో. ఒక్క సూక్షశరీర ప్రయాణం మీ జీవితంపట్ల సంపూర్ణ అవగాహనను, అవలోకనాన్ని, దృక్కోణ్ణాన్ని , దృక్పదాన్ని మార్చివేస్తుంది. వేలమంది ధ్యానుల అనుభవం కూడా ఇదే చెపుతుంది. ఇది ఒక రకంగా హనిమూన్ ఎక్స్ పీరియన్స్ లాంటిది.అంతా అధ్బుతంగా ఉంటుంది.మరొక దానితో పోల్చలేనటువంటుంది.హనిమూన్ ఎక్స్ పీరియన్స్ అనేది ఒక ప్రాథమిక స్థాయి అనుభవం. దానికంటే ఇది లక్షల రెట్ల ఉన్నత మైనది. అతి మధురమైన అనుభవం ఇది.మీరు ఎరుకతో ఉండి సూక్షశరీర ప్రయాణం చేస్తే వచ్చే ఆ అనుభూతి అత్యంత మధురమైనది,అత్యున్నతమైనది.దాని కోసం ఎంత ప్రయత్నాలు చేస్తారంటే , హిమాలయా యోగులు కూడ గుహాల్లో కూర్చొని ధ్యానం చేసుకుంటారు,ఎరుకతో సూక్షశరీర ప్రయాణం చేయడానికి. కాబట్టి మితృలారా ప్రతి రాత్రి మనం స్వప్నావస్థలో ,తురియ అవస్థలో , ధ్యానులైతే వారి జాగృతావస్థలో సూక్షశరీర ప్రయాణాలు చేస్తుంటాం.వీటినే ఒ.బి.ఇ స్ అంటాం. ఔట్ ఆఫ్ బాడి ఎక్స్ పీరియన్స్ అంటారు. మనం పడుకున్న తరువాత ఫ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది.ఇక్కడ ఎంత మందికి నిద్రలో అలాంటి అనుభవం కలిగింది? ఒక సాధకురాలు తన అనుభవం చెప్పింది. డా.న్యూటన్ గారు , ఔను అది అందమైన అనుభవం అని విడమర్చి చెప్పారు. మెడిటేషన్ లో అస్ట్రల్ ట్రావెల్ అనుభవం రాని వారికి కలలో జరుగుతుంటుంది.వాళ్ళకప్పుడు ఆస్ట్రల్ అనుభవాలన్ని కలల్లో జరుగుతుంటాయి. చాల వరకు కలలన్ని సూక్షశరీర ప్రయాణాలే.దాదాపుగా పదిశాతం మాత్రమే మాముల కలలు. మిగితా తొంబై శాతం కలలన్నీ మన సూక్షశరీరంతో,లేదా ఇతర హైయ్యర్ బాడీస్ తో సంబంధం ఉండే సూక్షశరీర ప్రయాణాలే. కాబట్టి ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. కొన్ని సాదారణ కలలు మాత్రమే ఇందుకు మినహాయింపు.మనకు ఎవరిమీదో కోపంగా ఉంది. ఆ కలలో ఆ కోపం వ్యక్త పరుచబడుతాం.ఆకోపాన్ని ఆవ్యక్తిమీద వ్యక్తపరుస్తాం.లేదంటే ఆరోజు మీరు ఏం అహారం తినలేదు .కలలో మంచి బోజనం చేస్తుంటారు.రైలు తప్పిపోవడం, బస్పు తప్పిపోవడం,పరిక్షాపేపర్ రాయలేకపోవడం ఇట్లాంటవన్నిసాదారణ కలలు. కాని ఇతర చాలవరకు కలల్లో స్వప్నావస్థలో సూక్షశరీరం విడుదల అవుతుంది.కొంత మందికి ఎరుకతో జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్న ఎన్నో అనుకూల , వ్యతిరేక గుణాలు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ లోఉన్నాయి. ఎంతో మంచి మార్పు అనేది మనలో జరుగుతుంది. ఇందాక మీరు చెప్పినట్లుగా (ఉరవకొండలో ధ్యానం చేసిన సాధకున్ని ఉద్దేశించి) మీ నిర్ణయం మార్చుకున్నారు.హిమాలయ పర్వతాలకు ఇప్పడు మీరు వెళ్ళనక్కరలేదు.హిమాలయ వర్వతాలే మీ దగ్గరకు వస్తాయి.మహాఅవతార్ బాబాజే మీరు రెడిగా ఉన్నప్పుడు అయనే మీ దగ్గరకు వచ్చి కలుస్తాడు.మీరు చేయాల్సింది ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చారు మీరు.కాబట్టి ఆ మెసేజి ట్రాన్సఫర్మేటీవ్ మేసేజ్. మీరు చక్కగా మీ ధర్మాన్ని మీరు నేరవేర్చారు. వేలకొద్ది క్లాసులు తీసుకోగలిగారు. అది అందమైన ట్రాన్సఫర్మేషన్. అలాగే హీలింగ్ ఎక్స్ పీరియన్స్. నాలుగురోజులు పిరమిడ్ లో ఉంటే మాష్టర్స్ అంతా వచ్చి ఆమె మీద సర్జరి చేయడం. ఆస్ట్రల్ బాడిలో ఆవిడకు ఎనర్జీ కరెక్షన్స్ అన్నీ చేసారు.వీటిని హిలింగ్ ఎక్స్ పీరియన్స్ అంటారు. మన అస్ట్రల్ ట్రావెల్ లో ఆస్ట్రల్ గైడ్స్ ను కూడా కలుస్తాము.ఎలాగైతే మనం ఎ.కె.జి,యుకేజి,ఫస్ట్,సెకండ్ స్టాండర్స్ చదువుతున్నప్పుడు కనీసం ఇద్దరు టీచర్సన్నా ఉంటారు కదా.అలాగే మనందరికి ఒక్కోకరికి ఇద్దరు చొప్పన ఆస్ట్రల్ గైడ్స్ ఉంటారు. ఒక్కరు కాదు, ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు మనకు రక్షణ కల్పిస్తుంటారు.మీరు ఎప్పడు అస్ట్రల్ ట్రావెల్ చేయనివ్వండి మీరు ఒంటరిగా వెళుతున్నానని భయపడకూడదు మీరు గుర్తించకపోయినా,మీరు చూడకపోయిన,ఆ ఇద్దరు మీ వెన్నంటే ఉంటారు. మీరు పరీక్షగా చూస్తే వాళ్ళ ఉనికి మీకు తెలుస్తుంది.ఈ గైడ్స్ మధ్యలో మారు తుంటారు. ఎప్పుడంటే,మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకున్నతరువాత హైయర్ గైడ్స్ దిగుతారు..మీకు ఎల్.కె.జీ., యుకేజి అనుభవాలు,నేర్చుకోవాల్సిన విషయాలు అయిపోయాయి తరువాత చెప్పగలిగే మాష్టర్ గైడ్స్ వస్తారు. ఆవిషయం మీకు కూడా తెలుస్తుంది. ఈ గైడ్ తో అయిపోయింది మరో గైడ్ వచ్చారని. ఇలాంటి చక్కని అనుభవాలు కలుగుతాయి. మీ వ్యక్తిత్వ కూడా ఉన్నతంగా మార్పుచెందుతుంది.ఒక్కసారి ఆస్ట్రల్ ట్రావెల్ చేసాకా మీ ఆలోచనల్లో గొప్ప సృష్టత వస్తుంది.290 .సరిగ్గా చూడడం వస్తుంది.మనకు సరిగాచూడడం రాదు.ఏది చూసిన కూడా సరియైన విధంగా చూడాలి.మేలు ఎంచి కీడు ఎంచు అన్నారు. సరిగ్గా చూడకపోతే కీడు ఎంచి మేలు ఎంచుతాం.ముందుగా కీడు ఎంచుతాం. వారిలోని వ్యతిరేక దుర్గుణాలన్ని చూస్తాం.వారితో వైరం పెంచుకుంటాం.మనం చేయాల్సింది ముందుగా వారిలో ఉన్న సుగుణాలు చూడాలి.మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేసాకా సరైనా దృక్పదం,సరైన ఆలోచన,సరైన అవగాహన మనకు లబిస్తాయి.ఏది తప్పో , ఏది ఒప్పో సరైన నిర్ణాయత్మక శక్తి మనకు కలుగుతుంది. మీ అంతర్గత సామర్ధ్యం వంద రెట్లు పెరిగిపోతాయి.మీ అంతర్వాణి చెప్పేది మీరు సరిగ్గా వినగలుగుతారు.టెలిపతి,మీతో ఒకరు చెప్పే సందేశం వారు చెప్పకముందే మీకు తెలుస్తుంటుంది. వారు చెప్పదలిచే పదాలు సరిగ్గా వాటినే మీకు ముందే వచ్చేస్తాయి.క్లియర్ వాయిన్స్, కొన్ని దృశ్యాలు మీకు ముందే కనపడుతాయి.వీటన్నింటిని అతీంధ్రయ శక్తులని, సిక్త్ సెన్స్ అని అంటాం.వీటన్నింటిని మనం అతి గొప్ప అతీంధ్రయ శక్తులు కావు. వీటిని సహజమైన శక్తులనే చెప్పుకోవచ్చును. కాకపోతే మనం వాటిని గుర్తించ లేదంతే.వాటిని నిజంగా మనం గుర్తించేవరకు సరిగ్గా ఎదుగలేము.నిత్య జీవితంలో వీటన్నింటిని మనం ఉపయోగించవచ్చును. మనం అంతర్వాణి ప్రతి సారి చెపుతుంటుంది, ఏది సక్రమం ఏది సక్రమం కాదు అని. ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే ప్రతి సారి మన అంతర్వాణి చెపుతుంటుంది.హీలింగ్ అనుభవాలు కూడా కలుగుతుంటాయి.గత జన్మ సృతులు కూడా వస్తాయి.సూక్షశరీర ప్రయాణం చేసేప్పుడు మన ఆస్ట్రల్ బాడి గత జన్మ ఙ్ఞాపకాల వరకు కూడా వెళుతుంది.

కామెంట్‌లు లేవు:

ఆత్మ జ్ఞానం కోసం అన్వేషించేవారికి చివరి మజిలి