source from...
http://3psmlakshmi.blogspot.com/2010/04/blog-post_25.html
జ్యోతిష్యం అంటే ఎంత నమ్మకం లేని వాళ్ళయినా ఏలినాటి శని గురించి భయపడతారు. కానీ ఏలినాటి శని అంటే భయపడాల్సిన అవసరమే లేదని ధైర్యం చెప్పారు డా. సంధ్యా లక్ష్మి. ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని ముఫ్ఫై ఏళ్ళకొకసారి తప్పక వస్తుంది. ప్రతిసారీ 7 సంవత్సరాలు వుంటుంది. సగటున మనిషి జీవితంలో 19 ఏళ్ళు శని ప్రభావంతో గడుపుతారు. శనిని అస్సలు తిట్టకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే శని ఆయు కారకుడు. శని మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా చెయ్యడు. వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభ కార్యాలయినా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా వేరే గ్రహ ప్రభావాలుకూడా వున్నట్టు.
శనికి శనివారంనాడు అరచేతి వెడల్పు నల్లబట్టలో నల్ల నువ్వులు మూటలాగా కట్టి నవగ్రహాలు వున్నచోటో, లేక ఎక్కడన్నా శనీశ్వరుడుకి దానితో దీపారాధన చేసి, శనివారంనాడు 19 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. జన్మ నక్షత్రం రోజున శివునికి అభషేకం చేయించినా మంచిది
source from...
http://telugu.webdunia.com/religion/astrology/panchang/1005/10/1100510079_1.htm
ఏలినాటి శని-నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే..?
అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావాలని అందరూ దేవతలను వేడుకోవడం సహజమే. దేవతలతో పాటు నవగ్రహాలు కూడా కోరిన కోర్కెలు నెరవేరుస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గ్రహ సంచారాన్ని బట్టి గ్రహాధిపత్య కాలంలో నవగ్రహాలను అర్చించే జాతకులకు ఈతిబాధలు తొలగిపోతాయి.
ముఖ్యంగా ఏలినాటి శని మిమ్మల్ని పీడిస్తున్నట్లైతే..? శనివారం పూట నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షణ చేసి, శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా కొన్ని సమస్యలు దరిచేరవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలా తొమ్మిది వారాలు చేస్తే ఏలినాటి శని ప్రభావంతో కలిగే దోషాలు, కష్టనష్టాలు దూరమవుతాయని పురోహితులు చెబుతున్నారు.
అలాగే ఏలినాటి శని దోష నివారణకు శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి, దానిని ఓ మట్టి కుండలోగానీ, ఇనుప పాత్రలో గానీ ఉంచాలి. దానిపై నల్లని వస్త్రమును కప్పి నల్ల పుష్పములు నల్ల గంధము, నల్లని పత్రములతో పూజించి బ్రాహ్మణునికి గానీ, శూద్రునికి గానీ సువర్ణ సహితముగా దానమివ్వాలి. దానితో పాటు నువ్వులు, పులగము దానము చేసినచో ఏలినాటి శని కొంతమేరకైనా నివృత్తి అగునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
మరోవైపు నవగ్రహ దోషాలు గల జాతకులు, ఆ దోష నివారణకు కొన్ని ప్రత్యేక పూజలు చేస్తే శ్రేయస్కరమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే..? ఏ గ్రహ శాంతికైనా చేసే అర్చన, దాన, హోమ, జపాదులను చిత్తశుద్ధితో చేయడం మంచిది. దేవతామూర్తులకు, సద్భ్రాహ్మణులకు గౌరవపూర్వక నమస్కారాలు చేసినట్లైతే కొంతమేరకు దోషవృత్తి తగ్గవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
source from...
http://teluguthesis.com/lofiversion/index.php/t2587.html
ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :- ౧ మయూరి నీఎలం ధరించుట 2 శని జపం ప్రతి రోజు జపించుట 3 శని కి తిలభిషేకం చేఇంచుట 4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి సనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రహంనుకి దానం చేయుట 5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట 6 ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట వలన 7 శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన 8 హనుమంతుని పూజ వలన 9 సుందరకాండ లేదా నల చరిత్ర చదువత వలన 10 కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన 11 శని ఎకదాస నామాలు చదువత వలన ( సనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన 12 బియపు రవ్వ మరియు పంచదార కలిపి చిమలకు పెట్టుట వలన 13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన 14 ప్రతిహి శని వారం రాగి చెట్టుకు ప్రదషణం మరిఉ నల్ల నువులు మినుములు కలిపినా నీటిని రాగి చెట్టు కు పోయటం వలన 15 ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన 16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన 17 బ్ర్హమనకు నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం 18 ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన 19 అయ్యప్ప మాలా ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన 20 ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దరసనం శివాలయం లో శివుని దర్సనం హనుమంతుని దర్సనం kala bhirava puja దరసనం వలన శని గ్రహ దోషం సాన్తిచ్చును
7 అక్టోబర్, 2010
6 జనవరి, 2010
Heart Surgery
Heart Surgery free of cost for children 0-10 years at SRI SATYA SAI INSTITUTE, BANGLORE
PH;08028411500 , inform to others.. you may saves to any body's life.
PH;08028411500 , inform to others.. you may saves to any body's life.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)